Friday, September 27, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*పరిశుద్ధ జ్ఞానమైన తన మౌన స్వరూపంలో ఇతర విద్యలన్నీ పూర్తిగా నశించిపోతాయి. అట్లాగే ఇతర స్థితులన్నీ తన సహజస్థితిలో అణగియున్న ఎరుక యొక్క విలాసాలే.*

సంసారమనేది నీ మనస్సులో ఉన్నది గాని
బయటలేదు...బయటి ప్రపంచం
 'ఇదిగో నేనిక్కడ ఉన్నా' నంటూ ఘోషించదు..
అది ఎప్పుడూ ఉండేది అయితే , నీ గాఢ నిద్రలో
కూడా ఉండవలసిందే..అలా ఉండదు గనుక అది
అనిత్యం...ఆత్మ ఒక్కటే నిత్యం....
మనస్సుతో, అనాత్మతో, తాదాత్మ్యం వదలిపెట్టడమే
నిక్కమైన సంన్యాసం!

🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻

*భగవాన్ శ్రీరమణ మహర్షి*

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.434)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment