Quantum Physics కు - ఆది శంకరుని మేధా శక్తిని compare చేస్తూ ఒక వైజ్ఞానిక విశ్లేషణ :
సంకలనం : భట్టాచార్య
...ఆది శంకరుని ప్రకారం, ఈ పాంచ భౌతిక ప్రపంచం మాయా సదృశమైనది. ఈ ప్రపంచమొక భ్రాంతి. క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం, ఈ ప్రపంచం నిజం కాదు. ఈ ప్రపంచం మనస్సు యొక్క ప్రాక్షేపణ లేదా ఆరోపణ. కాబట్టి మనస్సు లేకపోతే ప్రపంచం లేనట్లే కదా!
...ఆది శంకరుల ప్రకారం "బ్రహ్మము" మాత్రమే సత్యం (absolute reality). Quantum Physics ప్రకారం అట్టి చైతన్యమే సత్యం మరియూ పరమావధి.
...శ్రీ శంకరుల ప్రకారం, బ్రహ్మాండ సృష్టి జరిగినది. మరియూ ఆ విశ్వాండం, పరబ్రహ్మముగా లయం కాబడినది.
...క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం...అణువులు సంఘటితమై...గ్రహాలుగా, నక్షత్రాలుగా, ఖగోళ వస్తువులుగా రూపు దాల్చాయి. కాలాంతరంలో ఆయా నక్షత్ర గ్రహ గోళాదులు , విఘటనమై ...క్రమంగా చైతన్యంతో కలసిపోతాయి.
...ఆది శంకరుల ప్రకారం, పర బ్రహ్మము నుండి విడివడిన చిన్న అంశమే ఈ ఆత్మ. ఈ ఆత్మ తిరిగి పరబ్రహ్మము నందు చేరడమే "మోక్షము". క్వాంటం సిద్ధాంతం ప్రకారం, ప్రతి ఒక్కరూ ఆ శుద్ధ చైతన్యము నందు ఉన్నవారే. వారే కాలాంతరంలో ఆ చైతన్యము నుండి విడి వడ్డారు. మరల కాలాంతరంలో ఆ శుద్ధ చైతన్యంలోకే సంలీనమౌతారు.
...ఆది శంకరుల ప్రకారం, ఎప్పుడైతే జీవుడు వాస్తవాన్ని గ్రహిస్తాడో, అతడు "నిర్వాణం" లో ఉన్నడని లెక్క. జీవుడు, స్థల - కాలాలకి అతీతుడౌతాడు. క్వాంటం సిద్ధాంతం ప్రకారం, శుద్ధ చైతన్యాన్ని సంపూర్తిగా అవగాహన చేసుకుంటాడో, అతనికి స్థలంతో - కాలంతో - మనస్సుతో పనిలేదు.
...ఆది శంకరుల ప్రకారం, తన పూర్వ సంస్కారాల వలన జీవుడు తాను సత్యం అని భావిస్తాడు. క్వాంటం ఫిజిక్స్ ఏమి చెబుతుందంటే, ప్రతీ ఒక్కరూ తమ మనస్సు కారణంగా భ్రాంతిలో ఉంటారు. మనస్సు దాటితే భ్రాంతి వదలి వేస్తుంది.
...ఆది శంకరుల ప్రకారం, పర బ్రహ్మము...ఇంద్రియాలతో అనుభవించదగ్గది కాదు. ఎందుకంటే ఇంద్రియాల శక్తి పరిమితం. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం, అనంతం అనేది, పరిమిత స్థాయిలో గల మన ఇంద్రియాలచే అనుభవించలేము.
...ఆది శంకరుల ప్రకారం, మనందరం ఒకే చైతన్యాన్ని, వివిధ రకాలుగా అనుభవిస్తున్నాము. (పిండే పిండే మతిర్భిన్నః) - కారణం - ఒక్కొక్కడి కర్మ భిన్న భిన్నాలుగా ఉండడమే. మరణం గాని, జననం గాని స్వప్న సదృశమే. శంకర భగవత్పాదుల వారు ఏమంటారంటే...ఈ ప్రపంచం దేవుని కల...అంటారు. మరి మనుజులం ? మనుజులు అమరులే. ఆ విధంగా క్వాంమ్ సిద్ధాంతం , అద్వైత సిద్ధాంతానికి సమానత్వ స్థాయిలో వస్తోంది.
No comments:
Post a Comment