*మోక్షసాధనకు మార్గం*
➖➖➖
*భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులున్నాయి :*
*1. మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం,*
*2.దేవునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం,*
*3. నామసంకీర్తన చెయ్యడం -*
*ఇటువంటివన్నీ భగవంతుని పూజావిధానాలే.*
*1.కృతయుగంలో ధ్యానం*
*2. త్రేతాయుగంలో యజ్ఞాలు*
*3. ద్వాపర యుగంలో అర్చనలు*
*4. కలియుగంలో భగవన్నామ సంకీర్తనం*
*ఇవి భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు, మోక్షప్రాప్తికి*
*తగిన సాధనాలని శాస్త్రాలలో చెప్పారు.*
*'ముక్తి సాధనాలు'గా*
*కర్మయోగం,*
*రాజయోగం,*
*జ్ఞానయోగం*
*భక్తియోగం*
*అని నాలుగు యోగాలు శాస్త్రాలలో తెలిపారు.*
*1. సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు.*
*ఫలాపేక్ష వదలి కర్మలు చెయ్యాలని, అదే నిష్కామ కర్మయోగమని గీతాచార్యుడు బోధించాడు.*
*దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ - బంధం నుండి విడిపిస్తుంది.*
*ప్రతి పనినీ భగవత్కైంకర్యమనే భావంతో చెయ్యాలి. ఇదే కర్మయోగం.*
*2. చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం. ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనబడింది.*
*అభ్యాసంతోనూ, వైరాగ్యంతోనూ మనస్సును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది.*
*3. తత్త్వవిచారణలో జీవాత్మ స్వరూపాన్ని, పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం.*
*అద్వైత మతస్తులు - జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్ఠమని చెబుతారు. అవిద్య, అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా లేదనే విషయం తెలుస్తుందని చెబుతారు.*
*4. ఈ కాలంలో తరించడానికి భక్తియోగమే సులభోపాయం.*
*అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ని తెలుసుకోవడం, దర్శించడం ఆయనలో ప్రవేశించడం సాధ్యమవుతుంది.*
*సాత్త్వికాహారాన్నే భుజించడం, విషయసుఖాలపై విరక్తి, శాస్త్రవిధిని పాటించడం, సత్యమార్గాన్ని అనుసరించడం, అహంకారానికి లోనుకాకుండా ఉండడం భక్తియోగానికి మార్గాలు.*
*ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి*
*సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి, భూతదయ కలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్థాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి వుండాలి.*
*అలా జీవితం కొనసాగించి, మరణం తరువాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగలగడమే అసలైన "మోక్షం"*
🙏🙏🙏
No comments:
Post a Comment