*29-Sep-24, Enlightenment Story*
🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
*నేటి యువత వివేకంతో ఆలోచించాలి*
🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
ఈ మధ్య కొత్తగా పెళ్లైన జంట,6 నెళ్లు కూడా గడవక ముందే వారి మధ్య మనస్పర్ధలు వస్తే పెద్ద మనుషులు అందరు కూర్చుని మాట్లాడితే తన భర్త తనను ఇంట్లో పని చేసే పనిమనిషిలా చూస్తున్నాడు కానీ భార్య లాగా తనని ప్రేమగా చూస్కోవడం లేదని అమ్మాయి చెప్తే, తన భార్య తన సంపాదన కంటే ఎక్కువ తన చేత ఖర్చు చేయిస్తోంది తనను ఒక జీతగాడిలా చూస్తోంది పైపెచ్చు నేను తన ఆశల్ని నెరవేర్చడం లేదు అనుకుంటూ రోజూ ఏడుస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంటూ అబ్బాయి చెప్పుకొచ్చాడట. 😂 ఇద్దరి వాదన విన్న తర్వాత ఒకరు పనిమనిషి పాత్ర పోషిస్తే మరొకరు జీతగాడి పాత్ర పోషిస్తున్నారు, మంచిదే కదా, మేము కూడా పనిమనిషి జీతగాడి వలె ఇన్నేళ్లు సంసారాలు చేస్కుంటూ వచ్చామని చెప్పి పెద్దమనుషులు ఆ ఇద్దరినీ నోరు మూసుకొని సంసారం చేస్కోండని తీర్పు చెప్పారట. 👌🏽😄
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అబ్బాయి, అమ్మాయి లేచిపోయి లవ్ మ్యారేజ్ చేస్కుంటాం అంటే పరువు పోతుంది అని ఇద్దరి వైపు తల్లిదండ్రులు పెళ్లి చేశారట. కోరుకున్న వ్యక్తితో లవ్ మ్యారేజ్ చేస్కొని కూడా సాటిస్ఫై అయి కలిసి జీవించలేకపోతే ఎలా?🤦🏽 ప్రస్తుత హిందూ వైవాహిక వ్యవస్థను సరిదిద్దాలి. సంస్కృతీ సాంప్రదాయాలకు వ్యక్తులు దూరం అయితే సహించలేని తనం, అహంకారం, విచ్చలవిడితనం, అవతలి వ్యక్తులను అర్ధం చేసుకోలేని గుణాలు వస్తాయి. కాబట్టి చదువులు, ఉద్యోగాలు, సంపాదనలు ఏవి ఎంత ఉన్నా అన్నింటి కంటే మన వ్యక్తిత్వం ముఖ్యం. ఎంజాయ్ మెంట్లు, ఎక్సైట్మెంట్లు అంటూ వయసు పెరుగుతున్నా పరివర్తన చెందకుండా ఉండడం మన విలువను పెంచదు. మన వ్యక్తిత్వం ఆధారంగానే సమాజం మనల్ని గుర్తిస్తుంది. మన వ్యక్తిత్వం గౌరవప్రదమైనదిగా ఉండాలా లేక అసహ్యించుకునేలా ఉండాలా అనేది *నేటి యువత వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి*
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
No comments:
Post a Comment