Thursday, September 26, 2024

 శబ్ద బ్రహ్మము /నాద బ్రహ్మము - వైజ్ఞానిక విశ్లేషణ :

📚 సంకలనము : భట్టాచార్య

బౌతిక జగత్తులో అనేక శక్తులు ఉన్నాయి .వాటిలో 5 శక్తులకు ప్రాముఖ్యత ఉన్నది .
నిత్య జీవితములో ఈ శక్తులను పరస్పరము ఒకదాని నుండి ఒక దానికి రూపాంతరీకరణ చేయవచు .సృష్టి యొక్క శాశ్వత నియమము ఏమిటంటే శక్తి నశింప బడదు.ఇది రుపాంతరీకరణ చెందుతుంది .

చిత్  విజ్ఞానము యొక్క ఆధారము, శబ్ద శక్తి,చేతనత్వ క్షేత్రములో శబ్ధము లేక ధ్వని ఇంధనము లాంటిది .దీనిని శబ్ద శక్తి/ ధ్వని ఊర్జ /అనాహత నాదము /శబ్ద బ్రహ్మము / నాద బ్రహ్మము...    అనే పేర్లతో పిలుస్తారు .వీటికి అనేక రూపాలున్నా ప్రత్యక్షముగా మనము నిత్య జీవితములో దీనిని పరస్పరము మాట్లాడుకొనే ప్రక్రియలో ఉపయోగిస్తాము .దీనినే "వైఖరీ వాక్కు" అంటారు. ఉత్సాహము ,ప్రేరణను కలుగ చేసే రెండు మాటలు నిరుత్సాహ వంతులలో నూతన ప్రాణమును నింప గలవు .వ్యక్తి యొక్క మస్తిష్కములో 50%నుంచి 60% భాగము ధ్వని కొరకు సురక్షితమై ఉన్నది. దీనిని బ్రోకాస్ క్షేత్రము [Broca ‘s Area ]అంటారు .మానవ మస్తిష్కములో సెరిబ్రల్ కార్టెక్స్   లో ఎక్కువ భాగము ధ్వనికి సంబంధించిన కేంద్రాలున్నవి.వాటిలో ముఖ్యమైనవి.

[1] బ్రోకాస్ క్షేత్రము [Broca ‘s Area ] ఇది ధ్వని ఉత్పాదన కేంద్రము...

[2] వేర్నిక్స్ క్షేత్రము [Vernicke”s Area ]ఇది ధ్వనిని అవగాహనా చేసు కొనే క్షేత్రము ,

[3] పెరెఫ్రంటల్ కార్టెక్స్ [Perefrontal cortex ] ఇది ఆలోచనల విస్తరణకు ఉపయోగపడుతుంది ,

[4] విజువల్ అసోసియేషన్ కార్టెక్స్ [Visual Association cortex] ఇది శబ్దమును చూడటానికి ఉపయోగ పడుతుంది.

 ఈనాలుగు "వాణి" యొక్క పరా,పశ్యన్తి ,మధ్యమా మరియు వైఖరీలకు ప్రతీకలుగా అర్ధం చేసు కోవాలి.

శబ్దముల స్థూల ఉపయోగము భాష,జ్ఞానము మరియు అనుభవాలను ఇచ్చి పుచ్చు కొనుటకు ఉపయోగపడుతుంది.
సాధారణముగా సంభాషణలో సత్యత ,నమ్రత ,శిష్టత తమ ప్రభావాన్ని చూపిస్తాయి .నిజానికి వాక్ శక్తి.... ఒక శక్తి శాలి ఇంధనము.ఇది శరీరములో సూక్ష్మ శక్తి కేంద్రాలని ప్రభావితం చేస్తుంది.
జపము చేస్తున్నప్పుడు శబ్ధముల ప్రభావము... షట్ చక్రముల మరియు గ్రంథుల యొక్క సుక్ష్మ
స్థానముల
 మీద పడుతుంది . అంతే
 కాక మనస్సు ,ఆత్మ శక్తులని కూడా వికసింప చేస్తుంది.కృత్రిమమైన స్వార్ద పూరితమైన కపటపు మాటలు అంతః కరణముల మీద మాలిన్య పొరలను రూపొందిస్తాయి. స్వరములను మన సుక్ష్మదర్శులైన ఋషులు ఎంత దివ్య దృష్టి తో రచించారంటే వాటి ఉచ్ఛారణ , వినటము... మన శరీరము ,మనస్సుల మీద అత్యంత ఉత్తమమైన ప్రభావము కలుగ చేస్తుంది. వ్యంజనములతో, [ హల్లులు ] స్వరముల కలయికల వల్లనే శబ్దోచ్ఛారణ సంభవము . ప్రపంచములోని ఇతరుల భాషకంటే సంస్కృత భాష యొక్క విశేషత ఏమిటంటే దీనిని ఉచ్ఛారణ చేసినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ సూక్ష్మ యౌగిక వ్యాయామము కూడా జరుగుతూ ఉంటుంది .వినే శక్తీ ,మాట్లాడే శక్తీ యొక్క శారీరక ,మానసిక ఆరోగ్యము మీద ఉత్తమ ప్రభావము పడ్తుంది. అందు వలన వేదములోని వేద సూక్తములు పఠించిన లేక వినిన అనారోగ్యము కుదుట పడ గలదు ఇది మన ఋషులు పాటించి ఫలితము పొంది మనకు తెలిపి యున్నారు .    

No comments:

Post a Comment