Sunday, September 29, 2024

 🪷🙏🏻🪷🙏🏻🪷

*శ్రీ గురుభ్యోనమః* 

          నిజమైన  గురువు  నీ హృదయంలోనే  ఉన్నాడు.  బయట  గురువు  చేసేపని  ఏమిటంటే ...  లోపలి  గురువు  దగ్గరకి  ఎలా  పంపాలో,  ఆ పంపే  ప్రయత్నం  చేస్తాడు.  నీ హృదయంలోని  దేవుడు  ఒక్కడే  నిజం !  బయట  దేవుడు  లేడా  అంటే ...  ఉన్నాడు.  బయట  గురువు  లేడా  అంటే ...  ఉన్నాడు.  అయితే,  నీ మనస్సు  ఎంత  నిజమో  వాళ్ళు  కూడా  అంతే  నిజం.  గుళ్ళు,  గోపురాలు,  తీర్థయాత్రలు ...  నీమనస్సెంత  నిజమో  అవి  కూడా  అంతే  నిజం.  నువ్వు  సంపాదించుకున్న  పుణ్యం  కూడా  అంతే  నిజం.  *కానీ, అసలు  సత్యం -* 
*It is above ... It is above ...* 
*It is above all these things and all these troubles.*

అంటే  హృదయంలోని  సత్యం  దగ్గరికి  తీసుకువెళ్ళే  వరకు గురువు వెంటాడుతాడు, హృదయంలోని సత్యం దగ్గరికి వెళ్లే వరకు మనకు  స్వేచ్ఛ  లేదు,  సుఖం  లేదు,  స్వతంత్రం  లేదు.  అక్కడికి  తీసుకువెళ్ళటానికి  మాటల  ద్వారా  ఎంతవరకు  చెప్పగలడో,  అంతవరకూ  చెప్తున్నాడు  *ఈ ఋషి ...  ఈ రమణుడు !* 

మీ దర్శనానికి  రావటం  వల్ల  నాకు  ఏమీ  ప్రయోజనం  ఉండదా ?  నేను  తెలుసుకోగోరేది  అదే  అంటే ...  భగవాన్  ఆ ప్రశ్నకి  సమాదానం  అక్కడ  చెప్పలేదు  కానీ,  మరొక  చోట  సమాదానం  చెప్పారు.  ఇక్కడికి  వచ్చిన  వాళ్ళు  ఎవరూ  రిక్తహస్తాలతో  బయటకు  వెళ్ళరు.  అరుణాచలం  వెళ్ళి  వచ్చామన్న  సంగతి  మీరు  మరిచిపోవచ్చు,  అయినప్పటికీ ...  నాస్తికుడు  ఆస్తికుడు  అవుతాడు,  ఆస్తికుడు  భక్తుడు  అవుతాడు,  భక్తుడు  జ్ఞాని  అవుతాడు,  జ్ఞాని  ఈశ్వరుని  స్వరూపాన్ని  పొందుతాడు.  అది  చిటారు  కొమ్మ !  అంటే  మీరు  ఒక  మంచిపని  చేసి  మరిచిపోయారనుకోండి ...  ఏదో  ఒకరోజు,  ఎప్పుడో  ఒకప్పుడు  దాని  పలితం  ఇచ్చేవరకు  అది  మిమ్మల్ని  విడిచిపెట్టదు. 

*జ్ఞానికి  నమస్కరిస్తే  అది  నాకే  అందుతుంది  అని  నారాయణుడు  అన్నాడు.*  అయితే  ఆ నమస్కారం  లౌకికులకు  పెట్టే  నమస్కారం  కింద  ఉండకూడదు,  లౌకికులు  యాంత్రికంగా  పెడతారు.

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*పోడూరు :*  2000 / 08 / 10
                      
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment