Thursday, September 26, 2024

 *నీ కోసమే…

       *నీ దేవుడు పంపిన సందేశం!*
                   ➖➖➖✍️
        *(నీ సమస్య తీరిపోతుంది.)*


బవ (భౌతిక) దారిద్ర్యం ఉండవచ్చు... పర్వాలేదు. కానీ... *భావ దారిద్ర్యం* ఉండకూడదు.


*"ఛీ ఛీ"!!!*
*చచ్చిపోతే..బాగుండు ...నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు....* 
*అర్థంచేసుకొనేవారు కూడా ఎవరూ లేరు...*
*చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ...*

*చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు... విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...!!!*

*అన్నీ అంటే...???*

*ఉద్యోగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...*

*చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు...*

*"దేవుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా?" అని అడుగుతాడు...*

*దానికి దేవుడు వాత్సల్యంగా… "నాయనా! ఒక్కసారి నీచుట్టూ చూడు. ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి.., వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"*

*"అవును... కనిపిస్తున్నాయి."*

*"నేను... ఆ గడ్డి విత్తనాలు... వెదురు విత్తనాలు... నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. గాలి ,నీరు సూర్యరశ్మి ... ఇలా అవసరమైనవి అన్నీ అందించాను."*

*గడ్డి వెంటనే మొలకెత్తింది.*

*భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...*

*కానీ వెదురు మొలకెత్తనే లేదు.*

*కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు... విస్మరించనూలేదు...*

*ఒక సంవత్సరం గడిచింది,
గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది 
అందంగా ఆహ్లాదంగా...
కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .*
*రెండు , మూడు , నాలుగు సంవత్సరాలు గడిచాయి ... టవెదురు మొలకెత్తలేదు కానీ నేను అప్పటికీ వెదురును విస్మరించలేదు...*

*ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది..!*

*గడ్డి కన్నా ఇది చాల చిన్నది.*

*కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ...!*

*ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది, బలపరచుకుంది...!*

*పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి... ఆ బలం వాటికి లేకపోతే వెదురుమనలేదు (నిలబడలేదు).*


*నా సృష్టిలో ఏదీ కూడా ఎదుర్కోలేని సమస్య అనేది ఉండనే ఉండదు...!*

*ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి...!*

*వెదురు మొక్కను విస్మరించలేదు..*

*నిన్నుకూడా విస్మరించను...!*

*ఒకటి, నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు..!*

*రెండూ, అడవిని అందంగా మలచినప్పటికీ,  గడ్డి లక్ష్యం వేరు .. వెదురు లక్ష్యం వేరు ...!*

*నీసమయం వచ్చ్చినప్పుడు నువ్వూ ఎదుగుతావు...!!!"*

*"దేవుడా...! మరి నేను ఎంత ఎదుగుతాను??"*

*"వెదురు ఎంత ఎదిగింది?"*

*”అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."*

*”నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు..”*

*దేవుడు ఎప్పుడూ...  ఎవరినీ ... విస్మరించడు... విడిచిపెట్టడు... మనం కూడా దేవుని పై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రయత్నాన్నీ  ఎన్నటికీ విడిచిపెట్టకూడదు..!*

*ఆయన మన చేయి విడువక మంచి స్నేహితునిగా మనలను అర్థం చేసుకుంటాడు...*

*ధైర్యంగా ఉండండి..! తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటారు.*

*నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు... నీ దేవుడు ఎంత గొప్పవాడో      నీ సమస్యకు చెప్పు.!!!*
.                   

No comments:

Post a Comment