Tuesday, September 24, 2024

 Vedantha panchadasi:
విజ్ఞానవాదో బాహ్యర్థవై యర్థ్యాత్ సాదిహేతి చేత్ ౹
న హృద్యాకార మాధాతుం బాహ్యస్యాపేక్షితత్వతః ౹౹36౹౹

36.బాహ్యవిషయములు వ్వర్థములగుటచే ఇది కేవలం విజ్ఞిన వాదమని ఆక్షేపమైనచో అట్లు కాదు.మానసికాకారములను ఇచ్చుటకు బాహ్య వస్తువులు అవసరమగుటచే వేదాంతవాదము విజ్ఞానవాదము కాదని సమాధానము.

వైయర్థ్యమస్తు వా బాహ్యం న వారయితు మీశ్మ హే ౹
ప్రయోజన మపేక్షంతే నమానానీతి హి స్థితిః ౹

37.బాహ్య వస్తువులు వ్యర్థములే. కాని అవి లేనే లేవని మేము చెప్పము.ఒక వస్తువు ఉన్నది,లేదు అని చెప్పుట ప్రమాణమును బట్టిగాని ప్రయోజనమును బట్టి కాదు గదా. ప్రయోజనము లేని వస్తువు అసత్తయని ఎవరును అంగీకరింపరు.

వాఖ్య:యోగాచార బౌద్ధుల మతమున బాహ్యవస్తువులు లేనేేలేవు.అంతా మనః కల్పితమే కాని వేదాంత మతమున బాహ్యజగత్తు వ్యవహారకాలమున సత్యమే.వానిని మనస్సు గ్రహించును.దీనిని మించి బుద్ధి ఎన్నో భావనలు కూడా ఆ వస్తువులను గూర్చి కల్పించును.ఇట్లు బాహ్య వస్తువులు లేనిదే బుద్ధికృత రూపములు అసంభవములు కనుక వేదాంతమతము విజ్ఞానవాదము కాదు.

కొరవికట్టెను గిరగిర త్రిప్పునప్పుడు మాయమయమయిన అగ్నివలయము రూపొందు విధముగా చైతన్యములో

కొరవికట్టెను గిరగిర త్రిప్పునప్పుడు మాయామయమయిన అగ్నివలయము రూపొందు విధముగా చైతన్యములో కలుగు స్పందనమువలన మాయామయమయిన ప్రపంచదృశ్యముండును.

ప్రపంచము తనదృష్టియందే ఆవిర్భవించుచున్నదనియు,కనుక ఈ వస్తువులన్నియు క్షణకాలముండుననియు తెలియవలెను.
అందువలన జాలిపడుటకుగానీ సంతోషించుటకుగానీ కారణము లేదని అతడు భావించును.

సుఖ-దుఃఖములు,వాంచనీయ-అవాంఛనీయములు వంటి భావనలన్నియు నశించినప్పుడు మనస్సులోని భావనలన్నియు నశించును.

మంచుయొక్క తెల్లదనమువలె, నువ్వులగింజలోని నూనెవలె, పూవ్వులోని తావివలె,
అగ్నిలోని వేడివలె 
స్పందము చైతన్యము ఏకమయి అవిభాజ్యముగానుండును.విభిన్న
వస్తువులని వానిని వర్ణించుట పొరపాటు.

మనస్సు భావనావ్యాపారము అవిభాజ్యములు;ఒకటి నశించినచో రెండును నశించును.        

No comments:

Post a Comment