🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
విజ్ఞానము - వేదాంతము
ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!
చిత్రమైన స్టేట్మెంటు కదా!
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||
తల్లీ! నీ పాద పద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.
సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన scientific వివరణ ఆలోచనా తరంగాల్ని పురికొల్పి విజ్ఞాన శాస్త్రము - వేదాంత శాస్త్రాల సంగమప్రదేశానికి తీసుకుపోతుంది. శాస్త్రిగారు స్వయంగా physics professor కావడం గమనార్హం. ఆదిశేషుడు పధ్నాలుగు భువనాలను మొయ్యలేక తన వెయ్యి తలలపై అటూ ఇటూ మార్చుకుంటూ అతికష్టంగా భరిస్తున్నాడన్న విషయాన్ని భూమి ఉత్తరదక్షిణాయనాల్లో ప్రవేశించడంతో పోల్చారు. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా, దక్షిణాయణంలో ఆ దిశగా సూర్యుడి కదలిక కనిపిస్తుంది కదా! నిజానికి పొజిషన్ మారేది భూమి. తన కక్ష్యలో తన axis కి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ప్రయాణించడం వల్ల సూర్యుడు అలా కదిలినట్టు అనిపిస్తుంది. ఋతువుల మార్పు దీనివల్ల కలుగుతుంది. ఆదిశంకరుడు అదే విషయాన్ని poetic గా చెప్పారని అంటారు శ్రీ శాస్త్రిగారు. ఆదిశేషుడి వెయ్యి పడగల మీద భూమి ఒక ఏడాదిలో ఆ చివర నుంచి ఈ చివరికి, ఈ చివరనుంచి ఆ చివరకి దొర్లుతూ భూగోళపు ఊహాచిత్రం మనసులో మెదిలింది.
అద్వైతాన్ని ఔపోసన పట్టకపోయినా ఆదిశంకరుడన్న పేరు విన్నా, ఆ రూపం తలచుకున్నా ఎందుకో హృదయం ఉప్పొంగుతుంది. శివుడి అవతారంగా పరిగణించే శంకరుడికి ఖగోళ విజ్ఞానం ఒక లెక్కలోది కాదని తెలుసు. కానీ ఒక తత్త్వవేత్తగా, జీవాత్మ, పరమాత్మల మధ్య సరిహద్దు రేఖని చెరిపి ఇద్దరినీ విలీనం చేసిన అద్వైత శాస్త్రవేత్తగా చూసినప్పుడు ఆయనకీ ఖగోళ రహస్యాలు తెలిసే అవకాశం ఉందా? ఆయన కాలానికి indian astronomy అంత అభివృద్ధి చెందిందా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచనలు అటు మళ్ళాయి.
శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ట , భాస్కరాచార్యుడు ప్రసిద్ధులయ్యారు. So, శ్లోక రచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ముందు భూమి ఇలా ఎందుకు పొజిషన్ మారుతుందో తెలుసుకుందామని గూగులించగా దొరికిన సమాచారంలో, నాకర్ధమైనంత వరకూ భూమికి మూడు రకాల మూవ్-మెంట్స్ ఉన్నాయని తెలిసింది. (తన చుట్టూ తన ఆత్మప్రదక్షిణాలు కాక)
ఒకటి – సూర్యుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరగడం.
రెండు – ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇరవై ఆరు వేల ఏళ్ళకొకసారి తారుమారవ్వడం (Axial Precession). హిపార్కస్ (190 – 120 B.C) తో మొదలుపెట్టి టాలెమి, భాస్కరులతో సహా అనేకమంది దీనిపై పరిశోధనలు చేశారు.
మూడు – భూకక్ష్య స్థిరంగా ఒకే పొజిషన్ లో ఉండదు. భూమితో సహా కక్ష్య కూడా సూర్యుడి చుట్టూ మెల్లిగా తిరగలి రాయిలా (eccentricగా) తిరుగుతుంది. ఇలా –
Perihelion_precession
(శాస్త్రిగారి సౌందర్యలహరి అనువాదం ఇక్కడ – https://archive.org/details/sondaryalahari023321mbp)
దీన్ని Apsidal precession అంటారు. హిపార్కస్ మొదటిగా చంద్రుడి కదలికల్లో దీన్ని గమనించాడట. బుధ గ్రహానికి ఈ precession లెక్కవేయ్యడంలో కెప్లర్ చిక్కులు పడ్డాడు. ఐన్-స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించాక దాని ఆధారంగా బుధగ్రహపు precession సరిగ్గా లెక్క వెయ్యగలిగారు. సాపేక్ష సిద్ధాంతాన్ని ఋజువు చేసిన ప్రయోగాల్లో ఇదొకటి. భూకక్ష్య సూర్యుడి చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 29000 ఏళ్ళు పడుతుంది. ఇదంతా మామూలు కళ్ళతో, మహా అయితే టెలిస్కోపుతో అబ్జర్వ్ చెయ్యగలిగిన విషయాలే. బ్యూటీ అంతా ఐన్-స్టీన్ ప్రతిపాదించిన స్పేస్-టైమ్ కంటిన్యువమ్ లో ఉంది. కంటికి కనిపించని శూన్య ఆకాశాన్ని,ఊహకందని కాలాన్ని కలిపి వలగా అల్లి దానిపై గ్రహ నక్షత్రాలు కదలాడుతున్నాయని ఎలా ఊహించాడో ఈ ఫిజిక్స్ పాలిటి ఆదిశంకరుడు! ఊహించడమే కాదు ప్రయోగాత్మకంగా ఋజువైన వైనం మరీ విచిత్రం.
గ్రహాలు, నక్షత్రాల వంటి వస్తువుల చుట్టూ ఉన్న స్పేస్ వంగుతుంది అన్న ప్రతిపాదన ఒకానొక సూర్యగ్రహణ సమయానికి సూర్యుడి వెనుక, అంటే ఆకాశంలో మనకి కనిపించకుండా ఉండే భాగంలో ఉండే ఒకానొక నక్షత్రం ఈ ఎఫెక్టు వల్ల కనబడుతుందని జోస్యం చెప్పారు శాస్త్రవేత్తలు, ఐన్-స్టీనే అనుకుంటా. అది నిజమయ్యింది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో మామూలుగా అయితే కనబడకూడదనుకున్న ఆ నక్షత్రం కనబడింది. దాన్నుంచి వచ్చే కాంతి సూర్యుడి పక్క వంపు తిరిగితే తప్ప అది సాధ్యం కాదు. మామూలుగా స్ట్రైట్ లైన్ లో ప్రయాణించే కాంతి వంగిన స్పేస్ తో పాటు వంగి భూమిని చేరింది. ఆకాశం వంగడమేమిటి? శూన్యం అని అనుకుంటున్నది శూన్యం కాదనేగా దీనర్ధం.
ఇదిగో ఆకాశం వంపు తిరిగేది ఇలా –
earth-around-sunwarp
బొమ్మలో భూమి చుట్టూ క్రుంగి ఉన్న స్పేస్-టైమ్ మాట్రిక్స్ ఒత్తుకున్న మెత్తటి పడగలా లేదూ? So, నిజంగానే కంటికి కనిపించని పడగల మీద భూగోళం దొర్లుతోంది. In fact, అంతరిక్షంలో ఉన్న గోళాలన్నీ.
శంకరుడు ఆదిశేషుడిగా వర్ణించిన అదృశ్యశక్తినే ఆధునికంగా space-time continuum అంటున్నామా?
అయితే శేషుడి పడగలు వెయ్యి కాదు అనంతం. It may be coincidental, but, ఆదిశేషుడి మరోపేరు అనంతుడు!
శతాబ్దాల క్రితం ఆదిశంకరుని ఆలోచనలు, ఇటీవలి ఐన్-స్టీన్ ఆలోచనలు మస్తిష్కంలో ఒకటైపోయాయి,
“Both religion and science require a belief in God. For believers, God is in the beginning, and for physicists He is at the end of all considerations… To the former He is the foundation, to the latter, the crown of the edifice of every generalized world view,” అని క్వాంటమ్ థియరీకి ఆద్యుడైన మాక్స్ ప్లాంక్ అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఒక బ్లాగ్ నుండి సేకరణ
భట్టాచార్య.
No comments:
Post a Comment