*_ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు... హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది._*
*_కొందరు డబ్బు ఉందని మిడిసి పడుతుంటారు. మరి కొందరు అందం ఉందని ఎగసి పడుతుంటారు... కానీ వారికేం తెలుసు అన్నిటికంటే గొప్పది, గుణమని._*
*_జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది._*
*_గొప్పతనం అంటే, సాధించడం, సంపాదించడం కాదు. మన మాటలవల్ల కానీ లేదా మన చేతలవల్ల కానీ ఇతరులను హింసించకుండా బతకగలిగితే అదే మన గొప్పతనానికి నిలువెత్తు సాక్షం._*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🌺🙇♂️🌺 🌸🌸🌸
No comments:
Post a Comment