Monday, December 15, 2025

 💥💥🔥🔥💥💥అఖండ-2 సినిమా పూర్తిగా బాలయ్య సినిమా.

అఖండ-1 సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.
కధ సాదా సీదా బోయపాటి సినిమా కధ.
అందరూ కధ, బాలయ్య ఎలివేషన్స్, లొకేషన్స్, ఫోటోగ్రఫీ మొదలగు వాటి గురించి రివ్యూ రాస్తున్నారు. 

కానీ, ఒక హిందుత్వ వాదిగా నేను ఈ సినిమా వేరే కోణంలో చూసాను.

 ఈ సినిమా పరోక్షంగా హిందువులకు ఒక హెచ్చరిక. ఈ ధర్మం ఉంటేనే ఈ దేశం నిలబడుతుంది, మీరు నిలబడతారు. ఇది నేరుగా చెప్పడానికి బోయపాటి ఎక్కడా మొహమాట పడలేదు.

సినిమా మొత్తం హిందూ ధర్మం మీద పూర్తి గా ఆధారపడి తీసాడు. సినిమాలో చాలా సీన్లలో శివ లింగం, విభూతి, త్రిశూలం హిమాలయాలు కనిపిస్తూనే ఉంటాయి.  ఇలా శివుడు పరోక్షంగా కనిపిస్తూనే ఉంటాడు. సినిమా చూసి వచ్చిన తరువాత కూడా ఆ శివ భావన వెంట తరుముతుంది.

"ఇన్ని విదీశీ శక్తుల దాడులను తట్టుకుని ఈ దేశం ఇంకా ఇలా నిలబడి ఉంది అంటే ఈ దేశ ప్రజల్లో ఉన్న దైవ భక్తి" 

"ఈ దేశం మీద తురుష్కులు మొదలగు వారు దండయాత్రలు చేసి విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం చేసినా అన్ని తట్టుకుని ఈ దేశం ఇప్పటికి ఇలా నిలబడ్డాది అంటే ఈ ప్రజల్లో మన వెనకాల దేవుడు ఉన్నాడు అనే గట్టి నమ్మకమే. అందుకని ఆ దైవ నమ్మకం ఉన్నన్నాళ్ళు ఈ దేశాన్ని ఏమీ చేయలేం"

"బిడ్డ పుడితే దేవుని బహుమానం అనుకుంటారు, ఆ బిడ్డకు దేవుని పేరే పెడతారు ఆఖరుకు మనిషి పోయినా ఆ దేవుడులో కలిసిపోయాడు అనే అంటారు. వారి జీవితాలు దేవుడు మీద నమ్మకం తో ముడిపడిపోయాయి.
ఇన్ని కోట్ల మందిని కలిపి ఉంచుతోంది దేవుడు ఉన్నాడు అనే ఆ నమ్మకమే."

"ఈ దేశాన్ని విచ్చిన్నం చేయాలి అంటే ఆ దైవ నమ్మకం మీద దెబ్బకొట్టి ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోగొట్టాలి"

అంటూ ఈ దేశ మనుగడకు మరియు సనాతన ధర్మానికి ఉన్న లింక్ ని సినిమా ప్రారంభం లోనే ఒక విలన్ చేత డైలాగ్ రూపంలో చెప్పిస్తాడు బోయపాటి.

ఈ దేశంలో అంతర్గత శత్రువులు వున్నారు. వారే మనకు సాయం చేస్తారు అంటూ విలన్ చేత కటిక నిజం చెప్పించాడు.

కుంభమేళా సమయంలో గంగలో వైరస్ కలపడం వల్ల కొన్ని వందల మరణాలు సంభవిస్తే ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోయి, మేం పిలిస్తే పలకని దేవుణ్ని మేం ఎందుకు పూజించాలి అంటే?

ఏం చేస్తున్నారు అని మనకు వెంటనే దేవుడు కనపడాలి? ధర్మం చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా?

బొట్టు పెట్టుకోడానికి నామోషీ
పూజ చేయడానికి నామోషీ
దేవాలయానికి వెళ్ళడానికి నామోషి

"నీ మొబైల్ నువ్వు ఆఫ్ చేసుకుని ఉంచుకుని అవతల వారు కాల్ చేయలేదు అని ఎలా నిందిస్తావ్" అంటూ దేవుడు స్పందిస్తారు మీరు స్వీకరించే స్థితిలో లేరు అంటాడు.

ఇటువంటి చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ కల్యాణ చక్రవర్తి రాశారు. 

సినిమా కథ మీద బోయపాటి ఇంకా దృష్టి పెట్టవలసింది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచింది. ఇంటర్వల్ ముందు సీన్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది, ఆ టెంపో సినిమా సెకండ్ ఆఫ్ లో మైంటైన్ చేయలేకపోయాడు బోయపాటి.

అఖండ 1 మీద ఎక్కువ అంచనాలు లేకుండా చూడటం వల్ల అది అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా మీద ముందు నుండే భారీ అంచనాలు పెట్టుకోవడం వల్ల కొందరి కి నిరాశ కలగవచ్చు.

ఇక సినిమాలో లాజిక్ లేదు అంతా మేజిక్, బాలకృష్ణ ని మరీ సూపర్ మేన్ లాగా బోయపాటి ఎలివేట్ చేసాడు అని కొందరు విమర్శిస్తున్నారు.

ఈ ట్రెండ్ హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఉంది.  సిల్విస్టర్ స్టాలిన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగెర్, విన్ డీజిల్ వంటి హాలీవుడ్ హీరోలు ఇంత కంటే ఎక్కువ చేశారు. హాలీవుడ్ వాళ్ళు బాట్ మాన్, స్పైడర్ మాన్, ఐరన్ మాన్, ఇంటర్ స్టెల్లార్, అవతార్ అంటూ గ్రాఫిక్స్ తో మాయలు మంత్రాలు వంటి సినిమాలు తీసినా లాజిక్ లు వెతకకుండా ఎగబడి చూస్తాం.

అందుకని అటువంటివి తెలుగు సినిమాల్లో చూపిస్తే విమర్శించడం అర్ధరహితం.

శివుణ్ణి బాత్ రూమ్ ల్లో పరిగెత్తించిన 'పీకే' సినిమాకు కోట్లు ఇచ్చాం. ఈ సినిమాలో లాజిక్ లు వెతక్కుండా ఆలోచించకుండా సినిమా చూసేయ్యడమే. 

ఇది బాల కృష్ణ, బోయపాటి సినిమా..
అదే లెవెల్ లో హైప్ ఉంది. సినిమా లో డైలాగ్స్ అద్భుతంగా రాశారు.

ఈ సినిమా మొత్తం మీద మాస్, హై-వోల్టేజ్, బాలయ్య స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్. లాజిక్ కంటే ఎమోషన్ & ఎలివేషన్స్ మీద నడిచిన సినిమా. 

⭐ పాజిటివ్ పాయింట్స్

1. బాలకృష్ణ అఘోర పాత్ర (అఖండ) — సినిమా ప్రధాన హైలైట్ పవర్‌ఫుల్ లుక్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్. అఘోర పాత్ర  బాలయ్య తప్ప ఇంకెవరూ చేయలేరు

2. బోయపాటి స్టైల్ ఎలివేషన్స్ హై-ఎనర్జీ ఫైట్లు

4. అఘోరా మేకప్, విజువల్స్ & లొకేషన్స్

5. ఋషులు, అఘోరాలు, ఆధ్యాత్మిక టచ్ ఒక లెవెల్ లో తీసాడు.
---
నెగటివ్ పాయింట్స్

1. కథ చాలా రొటీన్, స్క్రీన్ ప్లే పేలవం
2. రెండో హాఫ్ మీద శ్రద్ద తగ్గింది
3.థమన్ మరికొంత వెరైటీ BGM ఇవ్వగలిగే
అవకాశం ఉన్నా పూర్తిగా వినియోగించుకోలేదు.

మొత్తం మీద ఒకసారి ఖచ్చితంగా చూడవలసిన సినిమా #అఖండ_2

No comments:

Post a Comment