*భక్తులు - రకములు:-*
---------------
*భక్తులు పలు రకములు ..!!!*
———————————————————————
1.
*భంగు భక్తులు:-*
వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు.. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు..
2.
*రంగు భక్తులు:-*
వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు .. డ్రెస్ కోడ్ కి importance ఇస్తారు.. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు..
3.
*హంగు భక్తులు:-*
వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది .. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.. ఒక రకంగా వీళ్లు Megalomaniacs ..
4.*మింగు భక్తులు:-*
ఈ టైప్ భక్తులు తమ "తిండిపిచ్చి"నే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు .. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే "ప్రసాదం" గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది .. అది చూసి ఈ టైప్ భక్తులని గుర్తుపట్టొచ్చు.. తిండి కక్కుర్తికి భక్తి రంగు వేస్తారు..
5.
*పొంగు భక్తులు:-*
ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు .. వీరు అల్పసంతోషపరులు .. టెంకాయలో పువ్వొచ్చినా .. దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు .. వీరి మీద Placebo Effect బాగా పని చేస్తుంది...
6.
*లొంగు భక్తులు:-*
వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి.. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు.. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం...
7.
*ఒంగు భక్తులు:-*
వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే.. ఇంకా చెప్పాలంటే .."అంతకుమించి" .. వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం..
8.
*సాంగు భక్తులు:-*
వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు .. ఇవే వాళ్ల లోకం..
9.
*పింగ్ పాంగు భక్తులు:-*
వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు .. పబ్ లో DJ అనుకుంటారు .. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు.. అల్ట్రామోడర్న్ భక్తులు.. భక్తిలో technology వాడతారు.. Virtual పూజలు చేసే బ్యాచ్..
10.
*కొంగు భక్తులు:-*
దరిద్రపు భక్తులు వీళ్లు .. కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.వీరినే "చొంగ భక్తులు" అని కూడా అనవచ్చు ...
11.
*రాంగు భక్తులు:-*
వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు .. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.. Comedy piece లు
12.
*కింగు భక్తులు:-*
వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం.. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు.. వీరికి డబ్బు విలువ తెలీదు .. పబ్లిసిటీ పిచ్చి... వీరిలో బాగా బల్సినోళ్లు ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు..
13.
*వాకింగు భక్తులు:-*
పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్ .. పాదయాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం..
14.
*జాగింగు భక్తులు:-*
ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ.. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు..
15.
*ట్రెక్కింగు భక్తులు:-*
భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.. వీళ్లందరికీ ఉండే common goal హిమాలయాలు వెళ్లడమే అయ్యుంటుంది..
16.
*సఫరింగు భక్తులు:-*
వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు..వీరినే 'బెంగ భక్తులు' అని కూడా అనవచ్చు..
17.
*కటింగు భక్తులు:-*
వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా విజ్ఞాన ప్రదర్శనలు చేస్తుంటారు..
18.
*మీటింగు భక్తులు:-*
వీరికి సమారాధనలు,ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం.. కోసేసుకుంటారు ..
19.
*కేర్ టేకింగు భక్తులు:-*
వీరు "మెరిట్ భక్తులు".. మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్.. వీరు ప్రవచనకర్తలు గా,మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని,దేవుళ్లని బతికిస్తూ ఉంటారు మహానుభావులు ..
20.
*షాకింగు భక్తులు:-*
వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు.. నాలుక కోసుకోవడం..నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.. భక్తి ముదిరిపోయి ఉంటుంది వీళ్లకి..
21.
*బెగ్గింగు భక్తులు:-*
వీళ్లు చాలా మంది ఉన్నారు.. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు..ఇదివ్వు అని.. Quid Pro Quo కూడా అవలంబిస్తారు .. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్.. ముడుపులు,బలులు etc ఇస్తారు..
22.
*షిఫ్టింగు భక్తులు:-*
వీళ్లు మతం మారిన భక్తులు.. వీళ్లు మనశ్శాంతి లేదా డబ్బు లేదా అమాయకత్వం లేదా అజ్ఞానం లేదా వివక్ష వగైరా కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు..
23.
*కేటరింగు భక్తులు:-*
వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు.. వీరి భక్తి కొంతమంది కడుపు నింపుతుంది.. ప్రసాదాల పిచ్చి ఉన్నవాళ్లు వీళ్లని టార్గెట్ చేస్తారు..
24. *రీజనింగు భక్తులు:-*
వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు తీసి నాస్తికులని వాదిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. .. "*గాలి చూపించు?*?
*పాలు పెరుగులల్లో బ్యాక్టీరియా ని (సూక్ష్మజీవులు) చూపించు*... అంటూనే *చూపించలేవ్ కదా అని !! కాబట్టి దేవుడున్నాడు* ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు...😆
-- copied post
Collection
Kondappa
No comments:
Post a Comment