Tuesday, January 13, 2026

 [1/8, 08:13] +91 98497 72509: ది. 08.01.2026.
నా కవితా శీర్షిక......!
-----------------------
ఎవరు నయం ......?
-----------------------
పక్కలో బల్లెం 
చెప్పులో గులక నయం 
పల్లేరు గాయల్లాంటి
బంధువులు కన్న 

అంగీలో గొంగళి 
పురుగు నయం 
నేనున్నాను అని గొప్పగా 
నటించే స్నేహం కన్న 

నరహంతకుని నడుమ 
బందీగా ఉండడం నయం
క్షణం క్షణం మరిగించే
భాగస్వామి చెరలో కన్న 

ఆయుధము తో
ఎదురుగా వచ్చే కసాయి నయం
భుజం పై చెయ్యి వేసి 
నడిచే కపట మనిషి కన్న

నిలువు దోపిడి చేసే 
కరుడుగట్టిన దొంగ నయం 
సొంత ఇంటికి కన్నం
వేసే ఇంటి వాడి కన్న 

చలనం లేని రాతి 
దేవుడు నయం
మనిషిని మనిషిగా చూడని 
మనువాది ఉన్మాదం కన్న
-----------------------
    -----రత్నమహర్షి'అమ్మఒడి'.
మొబైల్ నెం:8978741733
-----------------------
[1/10, 15:53] +91 98497 72509: ద. 10.01.2026
నా కవితా శీర్షిక..........!
-----------------------
ఏది నీది ఏది నాది....!
-----------------------
ఏది నీది ఏది నాది
ఏది సొంతం ఏది శాంతం 
నీది నాది ఏదికాదని 
ఎదను నింపుకో ఎర్రి వాడా 

ఏది సత్యo ఏదసత్యo
ఏది నిత్యమో ఏదనిత్యమో
మనసు చెప్పును మానవీయుడా 
తోసిపుచ్చకు నేటి జీవుడా 

ఏదిగమ్యo ఏది రమ్యo 
ఏది వెలుగు ఏది చీకటి
ఏదిగమనమో ఏదగమనమో
ఎంత వరకో జీవి పయనం 
నిజము తెలియునా నరుడ నీకు

ఏది పుణ్యం ఏది పాపం 
ఏది నరకo ఏది స్వర్గo
ఏదిజీవమో ఏది మృత్యువో
ఇలనే తెలుసును ఖచ్చితముగా
కనులు తెరువుము మానవుండా

ఏది ఏకం ఏదనేకం 
ఏది మైకం ఏది లోకం 
ఏదికారణమేది,కార్యమో
పొంది జ్ఞానం పరవశిస్తూ
జీవితమున శాంతి నొందుము !
----------------------------
      ----రత్నమహర్షి 'అమ్మఒడి '.
మొబైల్ నెం : 8978741733
-----------------------------

No comments:

Post a Comment