Tuesday, January 13, 2026

 -----------------
అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారమా?
----------------------

డా. ఉమర్ అలీ షా సాహితీ సమితి - భీమవరం వారు కీ.శే. ఉమర్ అలీ షా 81వర్ధంతి సందర్భంగా ఉమర్ అలీ షా పురస్కారాన్ని 
అఫ్సర్‌కు ప్రకటించారు.

ఉమర్ అలీ షా (1885-1945) ఒక అంతర్జాతీయ స్థాయి కవి అనీ, ఉమర్ ఖయ్యామ్ రుబాయీల తెలుగు అనువాదం విషయంగా ఉమర్ అలీ షా ఇతరులకన్నా గొప్ప అనీ, తెలుగులోకి వచ్చిన తొలి ఫార్సీ రుబాయీ ఉమర్ అలీ షా అనువాదం అనీ, తెలుగులో రుబాయీ వంటి రచన చేసిన తొలి కవి ఉమర్ అలీ షా అనీ నేను లోగడ సాధికారికంగా, సోదాహరణంగా తెలియజేశాను.

దేవులపల్లి కృష్ణశాస్త్రినే ప్రభావితం చేసిన ఉమర్ అలీ షాకు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో చోటు లేదు. సాహిత్య చరిత్రకారులు ఉమర్ అలీ షాకు అన్యాయం చేశారు. దాదాపుగా తెలుగులో నిర్లక్ష్యం చెయ్యబడ్డ ఉమర్ అలీ షా కవిత్వ ఘనతను నేను వెలికి తీసుకువచ్చాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దిన పత్రికల్లోనూ, సోషల్ మీడిఅలోనూ విరివిగా ఉమర్ అలీ షా గురించి సరైన వ్యాసాలు రాశాను. ఉమర్ అలీ షా కవిత్వాన్ని నేను ఇంగ్లిష్‌లోకి  అనువదించి అంతర్జాతీయ వేదికలపై పొందుపరిచాను; ఉమర్ అలీ షా కవిత్వాన్ని నేను అంతర్జాతీయం చేశాను.

ఉమర్ అలీ షా భారతీయతా కవిత్వం, జాతీయతా కవిత్వం చెప్పారు. ఇస్లామ్ వాదిగా కాదు మతాతీత కవిగానూ, భారతీయతా స్ఫూర్తితో మేలైన మనిషిగానూ మనుగడ చేశారు ఉమర్ అలీ షా. 1935-45 కాలంలో బ్రిటిష్ ఇండిఅ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడి హోదాలో ఉమర్ అలీ షా పాకిస్తాన్ విభజనను వ్యతిరేకించారు. ఉమర్ అలీ షా ఒక ముస్లీమ్ వ్యక్తిగా కన్నా భారతీయతా స్ఫూర్తితో, జాతీయతా భావాలతో ఉన్నతమైన మనిషిగా జీవించారు. 

"భరతమాత" అన్న జాతీయతా కవి ఉమర్ అలీ షా. "యోగ సమాధి", "మోక్షసిద్ధి" అంటూ భారతీయతను నింపుకున్న కవి ఉమర్ అలీ షా. "జాతీయవిద్య", "జన్మభూమి", "శ్రీ రాముడు" అంటూ గొప్పగా రాయడంతో పాటు 'దేశమాత దండకం' కూడా రాశారు ఉమర్ అలీ షా! అటువంటి ఉమర్ అలీ షా పురస్కారాన్ని 
అఫ్సర్‌కు ఇవ్వడం ఏమిటి? 

తెలుగులో కవిగా అనుకోబడుతున్న అఫ్సర్ ఏ మాత్రమైనా ఉమర్ అలీ షా పురస్కారానికి తగిన వ్యక్తేనా? ఉమర్ అలీ షా లాగా
"భరతమాత",  "యోగ సమాధి", "మోక్షసిద్ధి",  "జాతీయవిద్య", "జన్మభూమి", "శ్రీ రాముడు", దేశమాత దండకం వంటి భారతీయతా చింతనతో, భారతీయతా భావాలతో అఫ్సర్ ఇంత వరకూ ఏ రచనా చెయ్యలేదు. "మోమిననగ లజ్జించుచుంటి" అంటూ ఉమర్ అలీ షా ఒక ఉమర్ ఖయ్యామ్ రుబాయీని అనువదించిన నిజాయితీ నిండిన కవి! మరి అఫ్సర్? అఫ్సర్ ఆ స్థాయి నిజమైన కవేనా? ఉమర్ అలీ షా లాగా అఫ్సర్ ఇస్లామ్ అతీత కవేనా? అఫ్సర్ కవేనా? అఫ్సర్ మతాతీత భారతీయుడేనా?

కవిత్వం అన్న పేరుతోనూ, వచనంగానూ అఫ్సర్ రాసిన దాంట్లో ఎక్కడైనా భారతీయత, దేశ భక్తి,  మతాతీత భావాలు ఉన్నాయా? కొన్నేళ్ల క్రితం వివిన మూర్తి అనే రచయిత విషయంగా అఫ్సర్ బ్రాహ్మణ్యం పేరు మీద చేసిన నిర్వాకం అఫ్సర్‌ను పట్టిస్తుంది. ఈ విషయంగా సోషల్ మీడిఅలో అఫ్సర్‌పై దుమారం రేగింది
ఇటీవల నిజాం రజాకార్ల విషయంగా అఫ్సర్ చేసిన రచనలు కూడా ఆయన తత్త్వాన్ని తెలియజేస్తున్నాయి. 2024 జూలైలో ఆంధ్రజ్యోతిలో 'డియర్ మేరీ' పేరుతో అఫ్సర్ రాసిన కథ కూడా ఆయన హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని పట్టించేదిగానే ఉంటుంది.   

అసలు అఫ్సర్ ఎటువంటి వ్యక్తి? 20యేళ్ల క్రితం అఫ్సర్ పోలీస్ చర్యలకు గురైన వాస్తవం బహిరంగంగా తెలిసిందే. ఏ విషయంగా ఆయనపై పోలీస్ చర్యలు జరిగాయి? ఏ అసాంఘీక, ఏ అనైతిక ప్రవర్తన వల్ల అఫ్సర్ పోలీస్ చర్యలను ఎదుర్కొన్నారో  తెలుగు లోకానికి బాగా తెలుసు. ఏ హిందూ పోలీస్ ఉన్నతాధికారి దయా భిక్ష వల్ల అఫ్సర్‌కు
ఇవాళున్న బతుకు అమరిందో నా వంటి వాళ్లకు ఆ పోలీస్ ఉన్నతాధికారి స్వయంగా చెప్పడం వల్ల తెలుసు. అటు వంటి అఫ్సర్‌కు ఉన్నతమైన, ఏ కళంకమూ లేని ఉమర్ అలీ షా పురస్కారం ఎలా ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు?

500యేళ్లకు పైబడ్డ శ్రీ విశ్వ  విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం- పిఠాపురం ఒకప్పటి పీఠాధిపతి అయిన ఉమర్ అలీ షా పేరిట ఒక పురస్కారాన్ని అసాంఘీక, అనైతిక ప్రవర్తన ప్రాతిపదికన పోలీస్ చర్యలను ఎదుర్కొన్న అఫ్సర్‌కు ఇస్తూండడాన్ని తెలుగు లోకం ఎలా చూడాలి? అఫ్సర్ ఆధ్యాత్మికత ఏమిటి? అఫ్సర్ నైతికత ఏమిటి? 

అఫ్సర్ చదువు ఏ పాటిది? ఒక సందర్భంలో అఫ్సర్ ఫేస్‌బుక్‌లో 
ఇంగ్లిష్ వంటిది ఏదో రాస్తే అది నాకంట పడితే చదివి "ఇది ఇంగ్లిషేనా?" అని నేను అడిగాను. అందుకు సమాధానం చెప్పలేక ఆ పోస్టును డిలీట్ చేసుకుని తప్పించుకున్న పండితుడు అఫ్సర్. 'తన తెలుగు చదువుతో ఇంటర్వ్యూలలో విఫలమై ఒక తెలుగు ఉపాధ్యాయుడి ఉద్యోగాన్ని కూడా అఫ్సర్ మనదేశంలో పొందలేదు' అన్న వాస్తవం కూడా తెలుగు లోకంలో పెద్దగా చెప్పకోబడుతున్నదే. ఆయన తెలుగు రచనా విధానం కూడా హాస్యాస్పదమే అని పలువురు చెబుతారు.

అఫ్సర్‌ను ఉమర్ అలీ షా పురస్కారానికి ఎలా ఎన్నిక చేశారు? ఎవరు ఎన్నిక చేశారు? ఎందుకు ఎన్నిక చేశారు? 
ప్రస్తుత పీఠాధిపతి స్వయంగా అఫ్సర్‌ను ఈ పురస్కారానికి ఎన్నిక చేశారా? లేదా పీఠం కార్యవర్గ సభ్యులు ఎన్నిక చేశారా? లేదా ఈ ఎన్నికకు కూడా పైరవీలు జరిగాయా? (తెలుగులో వచ్చే పురస్కారాలు పైరవీల వల్లా, అసాంఘీక, అనైతిక విధానాల వల్లా మాత్రమే వస్తాయని తెలిసిందే కదా?) మతాతీత ఆధ్యాత్మిక పీఠం అని చెప్పుకుంటున్న ఈ పీఠం నిజంగా మతాతీత ఆధ్యాత్మిక పీఠం కాదా?

తాను ఇస్లామ్ మతాతీత కవిని, వ్యక్తిని అని, భారతీయతా భావాల కవిని, వ్యక్తిని అని అఫ్సర్ ఎప్పుడైనా, ఎక్కడైనా చెప్పుకున్నారా? ఇకపైనైనా అఫ్సర్ చెప్పుకుంటారా? తనను కూడా కవి అని అనుకుంటున్న హిందువులకు అఫ్సర్ కృతజ్ఞుడిగా ఉన్నారా? ఇకపైనైనా ఉంటారా? అఫ్సర్‌ను కవి అని అనుకుంటున్న వాళ్లలో 90% మంది హిందువులే! (ముస్లీములకు ఏది కవిత్వమో బాగా తెలుసు అని, హిందువుల కన్నా ముస్లీములు తెలివైన వాళ్లు అని, అందుకే అఫ్సర్‌ను కవిగా ముస్లీముల కన్నా హిందువులే ఎక్కువగా పరిగణించారు ప్రత్యేకించి చెప్పుకోవక్కర్లేదు) ఆ కారణంగా అయినా,  కవిగా కాకపోయినా మనిషిగా అయినా అఫ్సర్ హిందువుల పట్ల, హిందూత్వం పట్ల కృతజ్ఞతతో మెలుగుతున్నారా? 

అఫ్సర్ రచనలు, మాటలు, ధోరణి, ఆలోచనలు ఎప్పుడైనా దేశాభిమానాన్ని, హిందూ అభిమానాన్ని చూపాయా? ఉమర్ అలీ షా పురస్కారం తీసుకున్న తరువాత అయినా ఉమర్ అలీ షా లాగా "భరతమాత", "యోగ సమాధి",  "మోక్షసిద్ధి",  "జాతీయవిద్య", "జన్మభూమి", "శ్రీ రాముడు" "దేశమాత దండకం" వంటి రచనలు అఫ్సర్ చెస్తారా?

తెలుగులో కవి అని అనిపించుకుంటున్న అఫ్సర్‌ ఆ తెలుగులోనే వచ్చిన అంతర్జాతీయ స్థాయి కవి ఉమర్ అలీ షా గొప్పతనం గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రస్తావించారా? ఉమర్ అలీ షా అంతర్జాతీయ స్థాయి కవి అని అఫ్సర్ అర్థం చేసుకోగలరా? అసలు ఉమర్ అలీ షా గురించి తెలివిడి, ఆలోచన అఫ్సర్‌కు ఉన్నాయా? ఉంటే ఉమర్ అలీ షా గురించి అఫ్సర్‌ నాలాగా చెప్పి ఉండేవారు కదా? ఉమర్ అలీ షా ప్రస్తావనే చెయ్యని అఫ్సర్‌కు, ఉమర్ అలీ షా ఆలోచనే లేని అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కార ప్రదానం దారుణం కాదా? ఉమర్ అలీ షా గొప్పతనం గురించి ప్రస్తావన కూడా చెయ్యని తెలుగు కవి(?) అఫ్సర్ ఆ ఉమర్ అలీ షా పురస్కారం తీసుకోవడం గర్హనీయం అవదా?

'ఉమర్ అలీ షా పురస్కారాన్ని 
అఫ్సర్‌కు ఇవ్వడం ఉమర్ ఆలీ షాకు, ఉమర్ అలీ షా మతాతీత భారతీయతా స్ఫూర్తికి తగిలిన ఘాతం' అవుతుంది. ఏ లోకంలో ఉందో ఉమర్ అలీ షా ఆత్మ? అఫ్సర్‌కు తన పేరుతో ఇలా పురస్కారం ఇవ్వడం వల్ల
ఉమర్ అలీ షా ఆత్మ ఏ లోకంలో ఉన్నా క్షోభిస్తుంది అని మనం గ్రహించవచ్చు. 'అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం' అన్నది శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి, ప్రస్తుత పీఠాధిపతికి శాశ్వతమైన కళంకం అవుతుంది' అని ఎవరైనా గ్రహించవచ్చు.

'అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం' కారణంగా విశ్వ  విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంతోనూ, ప్రస్తుత పీఠాధిపతితోనూ, పీఠం సభ్యులతోనూ ఉన్న పరిచయాన్ని, మైత్రిని, అనుబంధాన్ని నేను  తెంచుకుంటున్నాను. నేనేదో గొప్పవాణ్ణి, నావల్ల ఆ పీఠానికి గొప్పతనం, ఉపయోగం ఉందని, ఉంటుందని కాదు... నేను అతి సామాన్యుణ్ణే; నేను పామరుణ్ణే... కాబట్టే  ఉమర్ అలీ షా గొప్ప కవిత్వంపై తెలివిడి ఉన్న నేను 'అఫ్సర్‌కు
ఉమర్ అలీ షా పురస్కారం' అన్నది
నాకు అవమానంగా భావిస్తున్నాను.

'ఉమర్ అలీ షా తెలుగులో వచ్చిన అంతర్జాతీయ కవి' అని సాధికారికంగానూ, గట్టిగా తెలియజెప్పిన నేను ఆ ఉమర్ అలీ షా స్ఫూర్తికి, కవిత్వానికి, మతాతీత భారతీయతా చింతనకు, ఉమర్ అలీ షా ఆత్మకు జరుగుతున్న ఈ 'అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం' అన్న అవమానానికి ఆవేదన చెందుతున్నాను.

రోచిష్మాన్
9444012279

No comments:

Post a Comment