*@ చెడ గొట్టేది పెద్దలే @
66వ రోజు
తేది: 13/01/2026
""""""""""""""""""""""""""""""""""""""
రాఘవ జీతంలో సగం సిగరెట్లకే తగలేస్తాడు సిగరెట్ల
వ్యసనం మానుకోమని, ఆరోగ్యానికి మంచిది కాదని
భర్తకి చెప్పి చెప్పి రాధ విసిగిపోయింది ఒకరోజు
అయిదొందల నోటు ఇచ్చి కొడుకును సిగరెట్ ప్యాకెట్
తెమ్మన్నాడు రాధ అభ్యంతరం చెబితే 'ఏం కాదులే
అని కసురుకున్నాడు కొడుకు సిగరెట్లు తెచ్చి పాకెట్
మనీ కావాలంటూ యాభై రూపాయలు తీసుకున్నాడు...
మర్నాడు రాధ ఏదో రాసుకోవడానికి పెన్ను కోసం
కొడుకు స్కూల్ బ్యాగ్ తెరిచింది అందులో సిగరెట్లు
ఉండటంతో భర్తకు చూపించింది 'నీ బ్యాగ్ లో సిగరెట్లు
ఎందుకున్నాయిరా?' అడిగాడు రాఘవ కోపంగా, 'అవీ...
అవీ..నా ఫ్రెండ్ పెట్టాడు నాన్నా' అన్నాడు కొడుకు
భయంగా 'నీ బ్యాగ్ లో వాడెందుకు పెడతాడ్రా?'
అంటూ బెల్ట్ తీసుకుని కొడుకును కొట్టడం మొదలెట్టాడు తండ్రి 'పిల్లాణ్ని కొట్టి చంపేస్తావా?' అంటూ
పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది రాధ ఆ గోలకి
ఇరుగూ పొరుగూ వచ్చారు 'నువ్వు మనిషివేనా?
పిల్లాణ్ని కొడతావా? నువ్వు కాల్చితే ఒప్పూ, వాడు
కాల్చితే తప్పునా? ముందు నువ్వు మారు' అని
రాఘవని చివాట్లు పెట్టారు అతడికి తల తీసేసినట్లయింది ఇక సిగరెట్లు తాగనని శపథం చేసుకున్నాడు అతణ్ని మార్చడానికి తల్లీ కొడుకూ ఆడిన
నాటకం అదని ఆ తండ్రికి తెలియదు...
శ్రీహరి గెజిటెడ్ అధికారి మొదట్లో పార్టీల్లో తాగేవాడు క్రమంగా అది వ్యసనంగా మారింది కొడుకు
సుధీర్ ఈమధ్యే ఉద్యోగంలో చేరాడు తండ్రిని చూసి
అతనూ తాగడం మొదలెట్టాడు అమ్మానాన్నలు
కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తండ్రీ
కొడుకూ ఇద్దరూ తాగుబోతులని తెలిసి వచ్చిన సంబం
ధాలు వెనక్కిపోతున్నాయి ఒకరోజు అర్ధరాత్రి శ్రీహరికి
ఫోన్ వచ్చింది 'మీ వాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరి
కాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు' అని. ఎస్ఐ శ్రీహరి
మేనల్లుడే విషయం తెలిసి ఉదయాన్నే శ్రీహరి స్నేహితులు పరామర్శకి వచ్చారు అతడికి చాలా అవమా
నంగా అనిపించింది తను చేసిన పనే కొడుకూ చేస్తు
న్నాడు కాబట్టి అతణ్ని ఏమనడానికీ మొహం చెల్లలేదు
దాంతో ఇక జన్మలో తాగకూడదని గట్టిగా నిర్ణయించు
కుని భార్యాబిడ్డలకు మాటిచ్చాడు అతడిలో
ఆ మార్పు
తేవడానికి భార్య, కొడుకు, మేనల్లుడు కలిసి ఆడిన
నాటకం అదని శ్రీహరికి తెలియదు
ఇలా నాటకాలతో వ్యసనాలు మాన్పించడం మాటలు
చెప్పినంత తేలికేమీ కాదు పెద్దలు ఏం చేస్తే పిల్లలూ
అదే చేస్తారని చెప్పడానికే ఈ ఉదాహరణలు. చాలా
మంది తండ్రులు చేస్తున్న తప్పులే ఇవి తాము వ్యస
నాల బారిన పడటమే కాక పిల్లలూ ఆ దారి పట్టేం
దుకు కారణమవుతున్నారు చేజేతులా తమ బిడ్డల
ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు నిజంగా
పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులెవరూ వ్యసనాల
జోలికి పోరని గుర్తుంచుకోవాలి...*
No comments:
Post a Comment