Tuesday, January 13, 2026

 *ప్రభాత గుళిక*

విజయానికి కొలమానం మార్చకుండా మనుషులకు ఎన్ని చెప్పినా ఎన్ని నేర్పించినా మనుషుల ఆలోచన మారదు. మనిషి గుర్తింపు కోరుకునే లక్షణం పుట్టుకతోనే వస్తుంది. అది పోవడం అంత సులభమైన విషయం కాదు అలాగని అసాధ్యం కాదు. 

మనిషి విజయం మనిషిగా జీవించి చనిపోవడం. మనిషి విజయం చుట్టూ ఉన్నవాళ్లకు ఇబ్బంది కలుగకుండా జీవించడం. మనిషి విజయం క్రమశిక్షణతో బాధ్యత తో జీవించడం. మనిషి విజయం యధాపళంగా పిల్లలను కనకుండా ఉండడం. మనిషి విజయం ద్వేషాన్ని అసూయను తగ్గించుకోవడం. మనిషి విజయం జీవించటానికి కావలసిన కనీస అవసరాలతో జీవించడం. మనిషి విజయం తనతో అందరు సంతోషంగా జీవించే పరిస్థితులు కలిపించడం. 

దురదృష్టవశాత్తు విజయాన్ని గొప్పతనాన్ని ఎక్కువ డబ్బు సంపాదించడంలో, ఎక్కువ మందికి తెలియడంతో కొలుస్తున్నారు. ఇవి రెండు మనిషి విజయాన్ని కాదు చూపేవి ఇతరుల్లో ద్వేషాన్ని, అసూయను, మోసాన్ని పెంచేవి. ఇవి రెండు మనిషిని అసంతృప్తికి, అశాంతికి, నిరాశకు గురి చేశేవి. 

బాగా సంపాదించిన వాళ్ళ గురించి పట్టించుకోవొద్దు, వాళ్ళ గురించి ఇతరులకు చెప్పవద్దు, ఫలానా అయన లా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి అనే వాళ్ళను దూరంగా పెట్టండి. ఇవి మిమ్మని మీ చుట్టూ ఉన్నవాళ్లను ప్రశాంతగా ఉంచుతుంది. బాగా సంపాదించిన ప్రతి ఒక్కరు సాటి మనుషులను ఎక్కడో ఒక దగ్గర ఎదో ఒక విధంగా మోసం ద్రోహం చేసినవాళ్ళే. అది చట్ట పరంగా కరక్ట్ కావొచ్చు మనుషులుగా నైతికంగా అయితే వాళ్ళు మోసం చేయకుండా సంపాదించలేరు. 

బాగా ఆస్తిహస్తులు సంపాదించిన వాళ్ళ గురించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళ గురించి చెప్పి చెప్పి చుట్టూ ఉండే మనుషులను ఒక పరుగు పందెం లో నిలబెడుతున్నారు. వీళ్లంతా వాళ్ళను అందుకోవటానికి జీవితాంతం అలా పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి జీవితం అంటే ఏంటో తెలియకుండానే జీవితం ముగిస్తున్నారు. 

140 కోట్లమంది లో ఎంతమంది అంబానీలు అదానీ టాటాలు కాగలరు. ఎంతమంది టెండూల్కర్ లు సింధులు మోడీలు కాగలరు. మహా అయితే ఓ 10 వేలమంది. మరి మిగతా 139 క్తోల 99 లక్షల 90 వేలమంది అలా పరుగెత్తుతూనే ఉంటారు. ఎందుకంటే విజయం అనేదానికి వాళ్ళే కదా కొలమానం. 

పోనీ జీవితాంతం వాళ్లలాగే బాగా అన్ని చేసి అలా అయినా అది శాశ్వతమా? వాళ్ళ పేర్లు శాశ్వతమా? మైకేల్ ఫెల్ప్స్ తెలుసా మీకు? స్విమ్మింగ్ లో 23 బంగారు ఒలంపిక్ పతకాలు సాధించాడు. ఎంతమందికి అతను తెలుసు? అతన్ని చూపి ఆలా కమ్మని అలా కావాలని ప్రయత్నాలు చేయడం చేయించడం వలన జీవితంలో సాధించేది ఏమి ఉండదు. 


నీవు జీవించే జీవితంలో ఎక్కడికి చేరుకున్నా అది నీ ఇష్టంతో నీకు సంతోషం కలిగించే విధంగా చేరుకుంటే అది గొప్ప విజయం. ఎవరో ఒకర్ని మోటివేషన్ అని లక్ష్యం అని పెట్టుకోవడం అనేది నీ జీవితాన్ని నీవు కోల్పోతున్నట్లు. విజయం అనేది నీ ప్రయాణంలో భాగంగా ఉండాలి తప్ప నీ ప్రయాణం విజయం కొరకు కాదు.

💦💐🙏💐💦

No comments:

Post a Comment