చైతన్య సింధువు
***************
వివేకానందను
సంఘపరివార్ తో
కలిపిఎలాచూస్తారు?
వాళ్ళది మతోన్మాదం!
సర్వమతసహనం
వివేకానందబోధలసారం!
ఆకలిఅంటరానితనం
తొలగాలన్నదే ఆదర్శం!
ఆకలినుండి ఆర్తుల్ని
కాపాడాలన్నదే
ఆయన వేదన అంతా!
అదే పిలుపు ఇచ్చాడు!
ఉక్కునరాలు
ఇనుపకండరాలు
ధైర్యసాహసాలు
కావాలన్నాడు!
ఆయనముఖాకృతి
కళా కాంతులు
హావభావాలు ఆహార్యం
యువతకు స్ఫూర్తి!
మూఢ హిందువుకాడు
హేతువాదహిందువు!
మహాచైతన్య సింధువు!
సకల జన బంధువు!
*********
తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
. 12-1-2026
(వివేకానంద 163వ
జయంతి సందర్భంగా)
No comments:
Post a Comment