Tuesday, January 13, 2026

 *_Thyroid : థైరాయిడ్ సమస్యకు దీంతో శాశ్వత పరిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట..!_*
        ➖➖➖

       
*_థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవటు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాళ గ్రంథులన్నింటిలో కంటే పెద్దది._*

*_శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి పనితీరు అదుపు తప్పడం వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతోపాటు ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఏర్పడతాయి._* 

*_ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్ ను స్రవిస్తుంది. ఇది సాధారణ జీవక్రియ వేగాన్ని నియంత్రిస్తుంది._*

 *_థైరాయిడ్ గ్రంథి నుండి విడుదల అయ్యే హార్మోన్ లు ప్రతి కణం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఎముకలకు అవసరమయ్యే క్యాల్షియంను క్యాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది._*

*_థైరాయిడ్ గ్రంథి టి3, టి4 , క్యాల్సిటోనిన్ హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది. శరీర అవసరాల నిమిత్తం రక్తంలో హార్మోన్ ల శాతం తగ్గడం లేదా పెరగడం చాలా సాధారణం. మారిన హార్మోన్ల నిల్వల వల్ల కలిగే అనారోగ్య లక్షణాలకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల అది హైపోథైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది._*

*_థైరాయిడ్ అసమతుల్యత వల్ల కీళ్లల్లో వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. అంటే కీళ్లలోపల అంతా వాచిపోయి కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంది. కేవలం ఆర్థరైటిస్ వంటి సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది._*

*_కానీ ఈ థైరాయిడ్ సమస్యను శాశ్వతంగా రూపుమాపవచ్చట._* 

*_థైరాయిడ్ ను రూపుమాపడంలో శుద్ది చేసిన అశ్వగంధ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని హైపో, హైపర్ థైరాయిడ్ లకు మందుగా వాడవచ్చు._* 

*_ఆయుర్వేదంలో అశ్వగంధ మొక్కను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు._* 

*_థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేయకుండా నివారించడంలో అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు._*

*_అశ్వగంధ అడాప్టోజెన్ గా పని చేస్తుంది. ఇది థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొదిస్తుంది. అడాప్టోజెన్ లు అన్ని రకాల వయసుల వారికి పని చేస్తాయి. దీనిని పలు రకాల వ్యాధులు ఉన్న వారు కూడా చికిత్సగా వాడుకోవచ్చు._* 

*_శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు జరిపి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు టానిక్ గా వాడుతున్నారు. కనుక దీనిని దీర్ఘకాలికంగా వాడినా కూడా ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు._*

*_అశ్వగంధ  పొడి రూపంలో తీసుకోలేని వారు  దీనితో  టీ  ని తయారు  చేసుకుని తాగవచ్చు.  ఈ అశ్వగంధ చూర్ణానికి తులసి ఆకులను కలపడం వల్ల దీని శక్తి మరింతగా పెరుగుతుంది._*

*_శుద్ది చేసిన అశ్వగంధ  2 నుండి 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడడం వల్ల మాత్రమే మనకు ఫలితం కనబడుతుంది._*

*_అశ్వగంధను ఔషధంగా వాడి థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందిన వారు కూడా ఉన్నారని, దీనిని వాడడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు._*.

No comments:

Post a Comment