Tuesday, January 13, 2026

 పిల్లలకు *" ప్రోటీన్ పౌడర్"*

మార్కెట్లో అందుబాటులో ఉన్న హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ వంటి ప్రాసెస్డ్ డ్రింక్స్‌తో పోలిస్తే, బాహుబలి ప్రోటీన్ పౌడర్ 100 రేట్లు శ్రేష్టమైనది మరియు పూర్తిగా సహజమైనది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, పిల్లలను టాలర్, స్ట్రాంగర్, మరియు షార్పర్గా మారుస్తుంది.

*పిల్లలకు ఈ ప్రోటీన్ పౌడర్‌ను "బాహుబలి ప్రోటీన్" అని చెప్పి ఇస్తే, వారు ఆసక్తిగా, సంతోషంతో తాగుతారు.*

ఇప్పుడు బాహుబలి ప్రోటీన్ పౌడర్ ను మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం… 

*అవసరమైన పదార్థాలు:*
1.బాదం - 100 గ్రాములు
2.కాజూ - 100 గ్రాములు
3.వేరుశెనగలు - 100 గ్రాములు
4.సొయాబీన్ లేదా సోయా పప్పు - 100 గ్రాములు
5.ఓట్స్ - 100 గ్రాములు
6.జీడిపప్పు  - 100 గ్రాములు
7.ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం - 50 గ్రాములు
8.వాల్ నాట్ - 100 గ్రాములు
9.పుచ్చగింజలు - 100 గ్రాములు
10. గుమ్మడి గింజలు - 100 గ్రాములు
11.వాల్ నట్స్ - 50 గ్రాములు
11.ఎండు కొబ్బరి తురుము - 50 గ్రాములు
12.యాలకులు - 5
13. మిరియాలు - 5
 
*తయారీ విధానం:-*
1.మొదట అన్ని గింజలను,పప్పు దినుసులను, బాదం, కాజూ, వేరుశెనగలను  వేయించి చల్లారనివ్వాలి.
2.ఓట్స్‌ను కూడా తక్కువ మంటపై రెండు నిమిషాలు వేయించి ఉంచాలి.
3.ఈ పదార్థాలను బాగా పొడి చేయగలిగే మిక్సీలో వేసి, మెత్తగా పొడి చేసుకోవాలి.
4.పొడిలో ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం, ఎండు కొబ్బరి తురుము, మరియు జీడిపప్పు పొడి కలిపి మళ్లీ మిక్సీ చేయాలి.
5.చివరగా, స్వాసన కోసం ఎలకల పొడిని చేర్చాలి.
6.పొడిని సీల్డ్ కంటైనర్‌లో నిల్వ చేయాలి.

*తీసుకునే విధానం:-*
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో రెండు టేబుల్ స్పూన్లు బాహుబలి ప్రోటీన్ పౌడర్ కలిపి తాగవచ్చు.
శరీరానికి కావాల్సిన శక్తి మరియు ప్రోటీన్లను అందించడంలో ఇది సహాయపడుతుంది.

*బాహుబలి ప్రోటీన్ పౌడర్ ఉపయోగాలు:-*

1.శక్తి పెంపు:
శరీరానికి తక్షణ శక్తిని అందించి రోజువారీ కార్యకలాపాలకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

2.మేధస్సు మెరుగుదల:
పిల్లల దృష్టి, జ్ఞాపకశక్తి, మరియు మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.

3.కండరాల బలవృద్ధి:
శరీర కండరాలను బలపరచి, శక్తి మిగిలించడంలో సహాయపడుతుంది.

4.రోగనిరోధక శక్తి పెంపు:
శరీరానికి సహజ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5.పౌష్టికతతో నిండిన ఆహారం:
సమతుల ఆహారంగా పనిచేసి, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అనువైనది.

ఈ పౌడర్ సహజమైన పదార్థాలతో తయారుచేయబడినందువల్ల, దీన్ని ప్రతిరోజు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments:

Post a Comment