*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_♻️ మారిస్ ఫ్రీడ్మన్ ఒక విదేశీయుడు. మహర్షి దర్శనం కోసం వచ్చి, మహర్షి మీద కొన్ని గేయాలు వ్రాశారు. మహర్షి ఆ గేయాలన్ని చదివి ఇలా సెలవిచ్చారు..._*
*_ఇదే విషయాన్ని కొన్ని శతాబ్దాల క్రితం అప్పయ్య దీక్షతార్ తన సంస్కృత రచనల్లో చెప్పారు. తాటాకు మీద ఉన్న ఆ గేయాలన్ని ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అందులో ఉన్నది ఏమిటంటే "రాజు ముందు నృత్యం చేసే రాజనర్తకి తన కాళ్ళు నొప్పి పెట్టినా రాజు సైగ చేసేదాకా నృత్యం ఆపలేదు" అని._*
*_అదేవిధంగా.. "ఓ భగవాన్ ! జనన మరణాల వలయంలో పడి అలసిపోయాను. నాపైన కరుణ చూపి ఈ జనన మరణ నృత్యావర్తనం (చక్రం) నుంచి నన్ను తప్పించు" అని._*
*_🦚 మహర్షి ఎందుకో ఒక్క నిమిషం చటుక్కున ఆగి మరలా ఇలా కొనసాగించారు..._*
*_ఈ విదేశీయుడు ఇక్కడి వారే. ఏ కారణం చేతనో విదేశంలో జన్మించారు. మళ్ళీ ఇక్కడికి చేరాడు. లేకపోతే అప్పయ్య దీక్షితులు వ్రాసినట్లుగా ఇలా గేయాలు వ్రాయడం ఏమిటి ?!"_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_*
*_🧘♀️ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment