*"తీర్థయాత్రలయందు పాటించవలసిన ధర్మాలు"*
మన ధర్మశాస్త్రాలు తీర్థయాత్రా కాలంలో పాటించవలసిన ధర్మాలను ఋషిప్రోక్తంగా శాస్త్రోక్త విధిగా తెలియచేసాయి.
*తీర్థయాత్రలకు బయలుదేరుముందు పఠించవలసిన శ్లోకాలు:*
🚩 యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!
🚩 ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!
🚩 తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!!
🚩 యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!
🚩 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!
ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. (యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతినిత్యము ఉదయం ఇంట్లో నుండి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటినుండి బయలుదేరినా అంతటా జయం కలుగుతుంది).
*మరికొని ధర్మాలు:*
🔶 *ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్థయాత్రలు చేయవలెనని శాస్త్రం నిర్ధేశించింది.*
🔶 ఇంటినుండి బయలుదేరునప్పుడు ఇలవేల్పును, కులదేవతలను, గ్రామదేవతల అనుమతి తీసుకొని, తల్లిదండ్రులు, పెద్దల అనుమతి తీసుకొని బయలుదేరాలి![శ్రీరాములు వారు అరణ్యవాసానికి బయలుదేరునప్పుడు కూడా అయోధ్యానగరి దేవత అనుమతి తీసుకొనే బయలుదేరి సనాతన ధర్మాచరణ విషయంలో ఆచరించవలసిన ఆదర్శాన్ని మనకు చూపించారు.]
🔶 తీర్థయాత్రలయందు అబద్ధం చెప్పడం, ఇతరులను తిట్టడం చేయరాదు. బ్రహ్మచర్యవ్రతులై క్షేత్రాలను సేవించాలి.
🔶 యాత్రలకు బయలుదేరి వెళ్ళి మరల ఇంటికి తిరిగి వచ్చేవరకూ కూడా తలనీలాలు సమర్పించే విషయంలో తప్ప, అన్యప్రదేశాలలో క్షౌరాది కర్మలు చేసుకొనరాదు.
🔶 తీర్థాలయందు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి! అవకాశం లేని సమయంలో భగవన్నామాన్ని తలుస్తూ చేయవలెను.
🔶 పుష్కరిణులయందును, నదులయందును, సరోవరాలయందును, సముద్రాలయందును, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానమాచరించడం మహాపరాధం. అంతేకాక వాటియందు మల,మూత్ర విసర్జనం చేయడం చాలా పెద్ద దోషం.
🔶 అంతేకాకుండా చీరలు-జాకెట్లు, పంచెలు-ఉత్తరీయాలు వంటివాటిని నదీదేవతలకు సమర్పించదలుచుకొంటే మానసికంగా నదీమతల్లికి అర్పిస్తూ దగ్గరలోని ముత్తయిదువులకో, బ్రాహ్మణోత్తములకో లేక అభాగ్యులకో ఇవ్వడం వలన పుణ్యము మరియు పురుషార్థము సిద్ధిస్తాయి.
🔶 *స్త్రీలు జడముడి విడతీసుకొని క్రిందభాగమున ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి.* జుట్టు విరబూసుకొని నిత్యజీవితంలోనే ఉండరాదు. అటువంటిది పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అసలు ఉండకూడదు. దంపతులు వెళ్ళినప్పుడు ఇరువురు కూడా ఉత్తరీయానికి, చీరకు కలిపి ముడివేసుకొని సంకల్ప స్నానం చేయాలి. స్త్రీలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి.
🔶 వీలయినంతవరకు తక్కువగా మాట్లాడుతూ, మనస్సునందు ఎల్లప్పుడు భగవంతుడి నామము జపిస్తూ ఉండాలి.
🔶 తీర్థ స్థలాలలోను, క్షేత్రాలలోను మనం ఆచరించిన జప, తప, స్నాన, హోమ, అనుష్ఠాన, ధర్మాచరణ, దానాదుల పుణ్యము *ఒకటికి వందలరెట్లు, వేలరెట్లు* కలుగుతుంది. అదేవిధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే ఫలితము కలుగుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలి!
🔶 పుణ్య తీర్థాలయందు గతించిన తల్లిదండ్రులకు, పెద్దలకు పిండప్రధాన, తర్పణాదులు తప్పకుండా చేయవలెను. వారి ఆశీస్సులే మనకు, మన కుటుంబాలకు శ్రీరామరక్ష.
🔱 కావున మన ధర్మశాస్త్రం చెప్పిన విధంగా నడుచుకొని మనం సనాతన ధర్మానికి వారసులమని గర్వంగా చాటుదాము.
మన పుణ్య క్షేత్రాలను, తీర్థాలను కాపాడుకుందాం. మన భావితరాలు కూడా ఆ క్షేత్రాలు, తీర్థాలు దర్శించి తరించాలి కదా! వాటిని పరిరక్షించుకుందాము.
****మంగళం మహాత్******
No comments:
Post a Comment