🔱 *ప్రభాత గుళిక* 🔱
# *ఆత్మజ్ఞాన నిధి...*
🍁మనిషి శరీరం రథం అనుకుంటే జీవాత్మ రథికుడు. బుద్ధి సారథి. మనసు పగ్గాలు, ఇంద్రియాలు రథాన్ని నడిపే గుర్రాలు. విషయాలు అవి నడిచే మార్గాలు... అని తెలుసుకోమంటుంది.
🍁కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయం. ఆత్మ, శరీరం, బుద్ధి, మనసు, ఇంద్రియాల మధ్య సంబంధాన్ని రథాన్ని ఉపమానంగా చేసుకుని నచికేతుడికి చెప్పాడు యమధర్మరాజు. ఆత్మజ్ఞానానికి సంబంధించి ముఖ్యమైనదిగా కఠోపనిషత్తు గురించి చెబుతారు. ఇందులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయం మూడు భాగాలతో మొత్తం 120 శ్లోకాలు ఉంటాయి. ఇది కృష్ణ యజుర్వేదానికి చెందిన ముఖ్యమైన ఉపనిషత్తు. దీంట్లోనే యమధర్మరాజుకు నచికేతుడికి మధ్య నడిచిన సంభాషణ కనిపిస్తుంది.
🍁నచికేతుడు వాజశ్రవుడి(ఉద్దాలకుడు) కుమారుడు. ఒకసారి వాజశ్రవుడు యజ్ఞం చేసిన అనంతరం ఏమాత్రం పాలివ్వలేని ముసలి గోవులను దానమిస్తాడు. అది చూసిన నచికేతుడు తనను కూడా ఎవరికైనా దానమిస్తే వారికి తాను ఉపయోగపడవచ్చని అనుకుంటాడు. తండ్రి దగ్గరికి వెళ్లి 'నన్నెవరికి ఇస్తావు' అని అడుగుతాడు. అతడు సమాధానం చెప్పకపోతే రెట్టించి అడగడంతో. విసిగిపోయిన వాజశ్రవుడు కోపంతో 'నిన్ను
యముడికి దానం చేశాను వెళ్లు' అంటాడు. తండ్రి మాట జవదాటని నచికేతుడు యమపురికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు లేకపోవడంతో ఆయనకోసం మూడు రాత్రులు నిరాహారంతో ఎదురుచూస్తాడు. తిరిగొచ్చిన యమధర్మరాజు తన ఇంటి ముందున్న నచికేతుణ్ని చూసి మూడు రాత్రులు ఉపవాసమున్నాడని తెలుసుకుని మూడు వరాలు కోరుకోమంటాడు. తండ్రి కోపం తగ్గి, తిరిగి తనను ఆదరించాలని మొదటి వరం కోరతాడు నచికేతుడు. రెండో వరంగా యజ్ఞానికి మూలాధారమైన అగ్ని గురించి, మూడో వరంగా మృత్యువు తదనంతరం జరిగే ఆత్మగమ్యపు జ్ఞానాన్ని కోరతాడు. మొదటి రెండు వరాలు అడిగిన వెంటనే ఇచ్చిన యముడు మూడోదైన ఆత్మను గురించి తెలుసుకోవడం కష్టమని, దానికి బదులు భోగభాగ్యాలను,
అష్టశ్వర్యాలను ఇస్తానంటాడు. పట్టు వదలని నచికేతుడి కోరికను మన్నించి చివరికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు యమధర్మరాజు. వారిద్దరి మధ్య జరిగీన తత్వజ్ఞాన సంవాదమే కఠోపనిషత్తు.
🍁నచికేతుడి వృత్తాంతం తిక్కన మహాభారతంలోని ఆనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసంలోనూ ఉంది. భీష్ముడు ధర్మరాజుకు గోదాన ప్రభావం గురించి
చెప్పేటప్పుడు వస్తుంది. వాజశ్రవుడు (ఉద్దాలకుడు) ఒకనాడు నదీతీరంలో స్నానంచేసి దర్భలు, పాత్రలు మర్చిపోయి వాటిని తీసుకురమ్మని నచికేతుణ్ని పంపుతాడు. అవి నదిలో కొట్టుకుపోవడం వల్ల ఖాళీ చేతులతో వచ్చిన కొడుకును యమలోకం పొమ్మని. శపిస్తాడు వాజశ్రవుడు. నచికేతుడు వెంటనే
మరణించడంతో- అతడిలోని తండ్రి మేల్కొంటాడు.
రాత్రంతా కుమారుడి దగ్గర ఉండి విలపిస్తాడు. మరునాడు ఉదయమే నచికేతుడు లేచి తనకు యమధర్మరాజు పుణ్యలోకాలను చూపించాడని చెప్పి తండ్రిని ఆనందపరుస్తాడు.🙏
✍️- గూగుల్ మాత సహకారం తో
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
No comments:
Post a Comment