*మొటిమల నివారణకు*
*+++++++++++++++++++-*
1వారానికి రెండు మూడు పర్యాయములు ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టినందునలన ముఖంలోని చర్మరంధ్రాలు శుభ్రపడగలవు.
2 గోరువెచ్చని నీటితో ముఖం మూడు, నాలుగు పర్యాయములు శుభ్రం చేసుకోవాలి. మంచిరకం సబ్బు ఉపయోగించాలి.
3 గట్టిగా వుండే పెరుగులో శుభ్రమయిన శెనగపిండి కలిపి ముద్దగా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయము కడిగేసుకోవాలి. ఈ విధముగా చేసిన మొటిమలు, మచ్చలు, గుంతలు తగ్గును.
4క్రొవ్వు పదార్ధములు తగ్గించి, వ్యాయామము చేస్తూ, ఆకుకూరలు ఎక్కువగా సేవించిన జీర్ణప్రక్రియ క్రమబద్దమయి మొటిమలు నివారణయగును.
5. పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతూ ఉండాలి మహిళలకు,మలబద్ధకము లేకుండా వుండాలి. వ్యాయామము చేయటం మంచిది.
6. ముఖంపై మచ్చలు ఉన్నా మొటిమలు ఉన్నవారికి ఫేషియల్ చేసిన తర్వాత ప్యాక్ చేసే ముందు
చిన్న మెంతికూర రసం ఐదు చెంచాలు నిమ్మరసం అర చెంచా పుదీనా రసం రెండు చెంచాలు కలిపి వేళ్ళతో ముఖాన్ని మసాజ్ చేస్తే ఎలాంటి మొటిమలు అయినా మచ్చలైన తగ్గిపోతాయి..
No comments:
Post a Comment