*ఆత్మ విచారణ - 2*
నిన్నటి తరువాయి......
నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది. మీరు ఓ పెద్ద రోదసీ నౌకలో కూర్చుని ఏ నక్షత్రానికీ, గ్రహానికీ తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో విహారాలు చెయ్యొచ్చు. ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదయినా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆకాశం అప్పుడు ఎలా కనపడుతుంది! మన సూక్ష్మజీవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా? ’ ఆసూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమే’ అని మనకు తెలుసు. కానీ దానికి తెలీదు. అలాగే మనకు కన్పించే ఈ విశ్వపు పూర్తి స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలీదు. ప్రతి మనిషీ ఓ విశ్వం లాంటి వాడే. ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుళ్ళ చుట్టూ, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. రాతిలోనూ, ఓ చెట్టుకొమ్మలోనూ, ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతరం భ్రమణం అనిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది.
మానవులలోని అణువులలోని పరిభ్రమణం ఓ విధమైన ’విద్యుత్’ ను సృష్టిస్తుంది. ఈ విద్యుత్ పైనున్న ’పరమాత్మ’ అందించే విద్యుత్’తో కూడి "ప్రాణశక్తి’ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతోంది. మన భూమ్మీది ఉత్తర, దక్షిణ దృవప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తివల్ల మనకి ’అరోరా బొరియాలిస్’ అని పిలువబడే కాంతి రేఖలు కన్పిస్తూటాయి. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు. మిగతా, మనుష్యుల, జంతువుల, వృక్షాల, క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే. ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీదే ఆధారపడి వుంది. మిగతా జీవరాశులు లేకపోతే మనిషి లేడు. ఇతర జీవరాశుల ఉనికి లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు. జీవులన్నింటికీ ’సహజీవనం’ అనివార్యం.
ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కన్పిస్తాయి; మరో చోట విసిరేసినట్లు దూరంగా కన్పిస్తాయి. అలాగే ఓ రాతిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు. ఓ గాలి అణువును తీసుకుని పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగిఉన్నట్టు కనిపిస్తాయని గ్రహించవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోకి దూసుకెళ్ళి ఊపిరితిత్తుల్లోంచి నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి. భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న రోదసీ ప్రదేశం ఖాళీగా ఉందని మనకు కనిపించవచ్చు. కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరివేయబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఈ హైడ్రొజన్ అణువులు పిచ్చిపిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి, ఓ తీరూ తెన్నూ లేకుండా.
ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోనికి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు. కాని, ఓ గోడ లోంచి ఓ దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం వినే వుంటాం. దానికి కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని సులభంగా ఊహించవచ్చు. గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతుందో అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడ లోంచి తక్కువ సాంధ్రత గల దెయ్యం ఆ వైపుకు ఏ అణువుకూ కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనం ఊహించడం అంత కష్టమేమీకాదు. ఈ జగత్తు సాపేక్షంగా ఘన, ద్రవ, వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును పరిశీలించే జీవి సైజుని బట్టి అణువుల పొందికను బట్టి ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు మిధ్యాసదృశ్యాలు. ఘన పదార్థం నిజంగా ఘనపదార్థం కాదు. ద్రవ పదార్థం నిజంగా ద్రవ పదార్థం కాదు. మన కంటికి రాతి గోడలాగా కనిపించే వస్తువు ఓ ఏకకణ జీవికి జల్లెడలా కన్పిస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఓ దెయ్యానికి గానీ, మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ మన ప్రపంచం నక్షత్రాల సముదాయాలలాగా కానీ, విరజిమ్మబడిన ఇసుక రేణువుల్లాగా గానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు.
TO BE CONTD....
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment