Tuesday, January 13, 2026

 --------------
మన శంకర వరప్రసాద్ గారు
--------------------

 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను మల్కాజ్ గిరి సాయిరాం హాల్‌లో నిన్న రాత్రి చూశాను.

సరదా సినిమా మంచి హిట్ అవుతుంది అనుకున్నాను.
ఇవాళ సూపర్ హిట్ అయిందని తెలిసిపోయింది.

సినిమాలో ఇద్దరు హీరోలు...

చిరంజీవి చాల బాగా చేశారు. Energy... చిరంజీవి enlivening energyతో చేశారు. 70యేళ్ల పైబడ్డ వయసులో ఇలా enlivening energyతో చేసిన చిరంజీవి సినిమా హీరో నెంబర్ 1.

అనిల్ రావిపూడి... సినిమాకు మరో హీరో దర్శకుడు అనిల్ రావిపూడి. Simple సినిమాను ఎలా తియ్యాలో అనిల్ రావిపూడి నిరూపించారు.

సినిమాలో heavynessను పూర్తిగా తొలగించెయ్యడం అనిల్ రావిపూడి గొప్పతనం. గొప్ప సినిమా తీస్తున్నాను, గొప్పగా తీస్తున్నాను లాంటి 'attitude' లేకుండా simple సినిమా superగా తీశారు; Super hit సినిమా చేశారు అనిల్.

Joviality సినిమాకు ప్రాణం. Jovial సినిమా తీసి serious hit కొట్టారు. భారీ సీన్లలోనూ, బరువైన సీన్లలోనూ jovialityని పొదివి పండించారు దర్శకుడు అనిల్. ఇది విశేషాంశం.

హీరోయిజమ్‌ను పూర్తిగా సినిమా నుంచి తప్పించేశారు దర్శకుడు అనిల్, చిరంజీవి. ఇది గొప్ప అంశం. చిరంజీవి తన కమర్షియల్ మేనరిజమ్స్ అన్నిటినీ తొలగించుకున్నారు. అభినందనీయం ఇది. చిరంజీవి చాల subtleగాను చేశారు.

సినిమాను సరిగ్గా మొదలుపెట్టి సరిగ్గా ముగించారు దర్శకుడు. డైవర్స్ అయ్యాక
అత్తగారు, కోడలుతో మాట్లాడే సీన్ చాల గొప్ప సీన్. 

సినిమా మొదటి షాట్ నుంచీ కూడా సినిమాటోగ్రఫీ గొప్పగా ఉంది. గొప్ప toneలో తీశారు కెమరామేన్.

సంభాషణలు బావున్నాయి. సంగీతం చక్కగా ఉంది. పాటలు, రి రికడింగ్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. పాటల సాహిత్యం చక్కగా ఉంది. "ఓ శశిరేఖ..." పాటలో అనంత శ్రీరాం ఒక తరహా వేటూరిని తలపించారు.

విద్వత్, profoundity, depth, density, మేధ అవి, అలాంటివి ఏవీ లేని 'హాయి' సినిమా మన శంకర వరప్రసాద్ గారు సినిమా. మేధావుల్ని గట్టిగా ఒక్క తన్ను తన్నడం అంటే ఏమిటి? ఇదిగో ఈ సినిమా సూపర్ హిట్ అవడం. 

ఇందులో తమిళ్ష్ నుంచి వచ్చిన కులం గబ్బు లేదు; కమ్యూనిజమ్ లేదు; మాఫియా లేదు; విదేశీ మతం లేదు. ఇది మామూలు సినిమా; ఇది మన సినిమా. కాబట్టే గొప్పగా విజయవంతమైంది. సకుటుంబ సమేతంగా అందరూ ఈ సినిమాను చూడండి. 

చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ మరోసారి అభినందనలు.

మన శంకర వరప్రసాద్ సినిమా a polite and pleasent సినిమా.

రోచిష్మాన్
9444012279

No comments:

Post a Comment