Tuesday, January 13, 2026

 


🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺

1) ఏం దర్శనం అయ్యింది అనేది ముఖ్యం కాదు.
దర్శించేవాడు ఎవడు అనేదే ముఖ్యం.

2) భగవంతుణ్ణి నమ్మినందుకు గుర్తు ఏమంటే భగవంతుణ్ణి ఏమీ కోరకపోవడమే.

3) కావాలి - వద్దు ఈ రెంటినీ వదిలినవాడే నిజమైన విరాగి.

4) ఒకటి' అని నిర్వచించడం కూడా ద్వైతమే.
ఊరక ఉండడమే అద్వైతము.

5) “నా”లోనిది ఈ ప్రపంచం.
“నా” ఒక్కనిదే ఈ ప్రపంచం.
“నేనే" ఈ ప్రపంచం.

6) మన సమస్యలకు కారణం మనస్సే.

No comments:

Post a Comment