Tuesday, January 13, 2026

 *మూత్రద్వారంలో మంట పడుతుంటే*
*====================*
🔹అతిబల ఆకులతో  : అతిబల అనగా దువ్వెనకాయల చెట్టు. దీనినే ముద్రబెండ, తుత్తురుబెండ అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులను 20 గ్రా॥ మోతాదుగా తీసుకొని కొంచెంనీటితో కలిపి దంచి రసంతీసి ఆరసంలో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు లేదా మూడుపూటలా సేవిస్తుంటే మూత్రపిండాలలోమంట, వాపు, పోటు తగ్గటమేకాక మూత్రం సాఫీగా విడుదలౌతూ శరీరానికి బలం కూడా కలుగుతుంది.

🔸 నల్లతుమ్మతో :-- నల్లతుమ్మచెట్టుకు వచ్చే జిగురు చింతగింజంత రెండు లేదా మూడుపూటలా ఒకకప్పు నీటిలో కలిపి కరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.

🔸రుద్రజడాకులతో - : సబ్జాచెట్టునే రుద్రజడ అంటారు. దీని ఆకులు 20గ్రా॥ తీసుకొని కొంచెం నీరుపోసి దంచిరసంతీసిపూటకురెండుచెంచాలరసం మూడుపూటలా సేవిస్తుంటే మూత్రంలోమంట, మూత్రనాళంలో వాపు తగ్గిపోతయ్.

🔹 బొప్పాయిపండుతో -: బాగాపండిన బొప్పాయిపండును తెచ్చి పైతోలుతీసి లోపలిగుజ్జును ముక్కలుగా చేసి రెండు లేదా మూడుపూటలా తింటూవుంటే మూత్ర ద్వారంలోమంట ఆశ్చర్యకరంగా అదృశ్యమైపోతుంది.

No comments:

Post a Comment