Tuesday, January 13, 2026

 *ఆత్మ విచారణ - 1*

 *ప్రాణశక్తి*  - 

సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ’ప్రాణమే’. మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ’నిస్తేజంగా నిశ్చలంగా’ ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం, మామూలు మాటల్లో నిజానికి ఆ శిధిలమవుతున్న శరీరంలో నుంచి మరో క్రొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది.

                           సృష్టి మొత్తం అనంతమైన నిరంతరం చైతన్యంతో నిండి వుంది. ’అచలం’, ’జడం’, ’కదలకుండా ఉంది’ అనని మనం అనుకునే పదార్ధాలలో అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంధం పదార్ధ విజ్నానశాస్త్రం గురించీ, రసాయన శాస్త్రం గురించీ కాదు కనుక స్థూలంగా ’అణువులు’ అనే పదాన్నే మనం ఉపయోగిద్దాం, అనవసరంగా ’పరమాణువులు’, న్యూట్రాన్లూ, ’ఎలక్ట్రాన్లూ’ లాంటి పదాలను ఉపయోగించకుండా ’జగత్తు’ అనే చిత్రం స్తబ్ధంగా కనిపించినా నిరంతర భ్రమణమే దాని అసలు స్వరూపం.
మనం అణువుల గురించీ, పరమాణువుల గురించీ కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో! లేకపోతే పదార్ధ విజ్నానశాస్త్రం గురించి మనకేమీ తెలియదనుకుని కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ వ్రాసి మనకే బొధించే ప్రయత్నం చేసే అవకాసం వుంది. వాళ్ళ జిజ్నాసని కూడా గుర్తిస్తూ ఆ మాటలని మనమే అనుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా అనిపిస్తుంది; ఔనా? ’అణువులు’ అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతిచిన్న తునకలన్నమాట. ఇవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలంటే కుదరదు. ఎలక్ట్రాను మైక్రోస్కోపు లనైనా ఉపయోగించాలి. లేకపోతే దివ్యదృష్టిని సమకూర్చుకున్న యోగులను అడిగైనా తెలుసుకోవాలి.

                           అణువులను నిశితంగా పరిశీలిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైన కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గొచరిస్తుంది.


ఓ పరమాణువు చూడటానికి ఓ చిన్నసైజు సూర్య కుటుంబంగా ఉంటుంది. పరమాణువు మద్యలోఉన్న భాగం సూర్యుడిలాగా, ఆ మధ్యభాగం చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తూన్న ఎలక్ట్రానులు భూమి, శుక్రుడు, అంగారకుడు లాంటి గ్రహాల లాగా మనకి గోచరిస్తాయి. ఓ సూర్యకుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు. అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే.

మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమె. చూడటానికి ఓ ఘనపదార్థంలాగా, విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాం. మన ఎముకల గూటి లోచి, కడుపు మీద కండరాల లోచి ఓ వ్రేలును ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభం కాదని మనకి అర్థమౌతుంది. మనం మనుష్యులం కనుక మనవాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థంలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే. మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూందని అనుకోండి. ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయం లాగా, ఓ విశ్వ కాయంలాగా, అనేక నదుల సంగమంలాగా, అనేక సూర్యుళ్ళ, నక్షత్రాల కుప్పల్లాగా, మబ్బుల్లాగా, జలపాతాలలాగా కనిపిస్తుంది. మన ఎముకలు ఉన్నచోట్లలో గుత్తులు గుత్తులు గానూ, మాంసం ఉన్నచోట్లో కాస్త చెల్లాచెదురు మబ్బుల్లాగానూ మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది.

నక్షత్రాలు స్పష్టంగా కన్పిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొడమీద మీరు నిలబడి ఆకాశం వంక చూస్తూ వున్నారనుకోండి.  ఆకాశంలో దూరం దూరంగా విసిరి వేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా, గుంపులుగా మీ కళ్ళముందు నెమ్మదిగా కదుల్తూ మీకు కనిపిస్తాయి. అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మిణుకు మిణుకు మంటూ వెలుగుతూంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మీరు గమనించకుండా మీరు ఉండలేరు. నక్షత్రాలు, ప్రపంచాలు, గ్రహాలు, అణువులు! ’ఇందాక మనం అనుకున్న సూక్ష్మజీవికి మన శరీరం కన్పించే విధంగానే మనకు ఈ రాత్రి ఈ ఆకాశ చిత్రం కన్పిస్తోంది’ అని అనిపించటం లేదూ?

TO BE CONTD.....

💐💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment