*మంగు మచ్చలు తగ్గేందుకు 5అద్భుతమైన చిట్కాలు...*
*1.బంగాళ దుంపలతో:-*
బంగాళ దుంపలపై ఉండే తొక్కను తొలగించి సన్నగా తురమండి. దాన్ని పలచని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండండి. ఆ దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి.
*2.టమోటా, కలబందతో:-*
ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా ఉత్తమంగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలకు రాసుకుని 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో కలబంద అందుబాటులో ఉంటే మచ్చలపై రాస్తూ ఉండండి. కలబందను కేవలం ముఖానికే కాకుండా ముఖం మొత్తం రాసుకున్నా మంచిదే.
*3.నిమ్మరసంతో:-*
ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. అలాగే, రోజ్ వాటర్ లేకపోతే నిమ్మరసం, తేనె కలిపి రాసినా చాలు. ఇలా రోజూ చేస్తే మంగు మచ్చలు త్వరగానే మాయమవుతాయి.
*4.టమోటా, ముల్తాని మట్టితో:-*
టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండు లేదా మూడు రోజులు ఈ చిట్కాను పాటిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
*5.పాల ఉత్పత్తులతో:-*
గేదె పాల వెన్నను రోజూ మచ్చలపై రాసినా మంగు మచ్చలు మాయమవుతాయి. అలాగే, గేదె పాలల్లో కాస్త పసుపు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. మేకపాలలో జాజికాయను అరగదీసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంగు మచ్చలు కనిపించవు. ఎర్ర కందిపప్పు ఫౌడర్‌లో పాలు వేసి, నెయ్యి వేసి మంగు మచ్చలపై రాస్తే త్వరగానే ఉపశమనం లభిస్తుంది...
No comments:
Post a Comment