Tuesday, January 13, 2026

 


🌟 దివ్యమైన పిచ్చి! 🌟

శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అద్భుతమైన సత్యం ఇది. ఈ ప్రపంచం నిజంగానే ఒక పిచ్చి ఆసుపత్రి లాంటిది.మనం దేని కోసం ప్రాకులాడుతున్నాం,దేని కోసం పిచ్చివాళ్ళం అవుతున్నాం అనేది చాలా ముఖ్యం.
గురుదేవులు ఇలా అనేవారు:
"ఈ ప్రపంచం ఒక ఉన్మత్త శరణాలయం, కొందరు ధనవ్యామోహంతో, కొందరు ఇతర వ్యామోహాలతో, మరికొందరు కీర్తి ప్రతిష్ఠల వ్యామోహంతో పిచ్చివారైతే, అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే భగవంతుని నిమిత్తం పిచ్చివారవుతున్నారు. ఇందులో, భగవంతుని యందు ఉన్మత్తత కలిగి ఉండటమే నా అభిమతం. మనలను క్షణంలో బంగారంగా మార్చే పరుసవేది వంటివాడు భగవంతుడు. దీనివలన ఆకృతి నిలిచి ఉన్నా, స్వభావం మారినట్టే. మనలో హాని చేసే గుణం తొలగిపోయి, పరిశుద్ధమై నిలిచి ఉంటాము."🕉️🙏

No comments:

Post a Comment