మళ్లీ పుట్టకూడదా? | మోక్షం పొందే నిజమైన మార్గం | గరుడ పురాణం సారం
Author Name:BHAGAWAN RAHASYAM
Youtube Channel Url:https://www.youtube.com/@BHAGAWANRAHASYAM
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pmJnIz2ZvqI
Transcript:
(00:00) నమస్కారం మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి? చాలామంది అనుకుంటారు పాపాలు చేయకుండా ఉంటే చాలు పుణ్యం చేస్తే చాలు చనిపోయాక స్వర్గానికి వెళ్తామని కానీ గరుడ పురాణం ప్రకారం స్వర్గం అనేది ఒక బంగారు పంజరం లాంటిది. అక్కడ సుఖాలు ఉంటాయి. కానీ అవి శాశ్వతం కాదు. మన పుణ్యం అనే కరెన్సీ అయిపోగానే మళ్ళీ భూమ్మీదకు నెట్టివేయబడతాం.
(00:26) మళ్ళీ తల్లి గర్భం మళ్ళీ కష్టాలు మళ్ళీ మరణం అలా కాకుండా అసలు ఈ జనన మరణాల చక్రమే వద్దు నాకు ఆ పరమాత్మలో ఐక్యం కావాలి అనుకునే స్థితే మోక్షం మరి ఆ మోక్షం ఎవరికీ దక్కుతుంది కేవలం పూజలు చేసేవారికా లేక హిమాలయాలకు వెళ్ళిన వారికా గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా మోక్షం గురించి చెప్పిన అత్యంత రహస్యమైన లోతైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
(00:52) గరుత్మంతుడు విష్ణువును ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. ప్రభు ఎన్నో యజ్ఞాలు దానాలు వ్రతాలు ఉన్నాయి కదా అవి చేస్తే మోక్షం వస్తుందా అని దానికి విష్ణువు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇస్తాడు. గరుడ వేల కొద్ది యజ్ఞాలు చేసినా లక్షల కొద్ది దానాలు చేసినా వాటి వల్ల స్వర్గ సుఖాలు వస్తాయే తప్ప మోక్షం రాదు. మోక్షం అనేది క్రియ వల్ల వచ్చేది కాదు.
(01:18) అది జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఉదాహరణకు ఒక గదిలో చీకటి ఉంది. ఆ చీకటిని కర్రతో కొడితే పోతుందా పోదు చిన్న దీపం వెలిగిస్తే పోతుంది. అలాగే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మను అనే ఆత్మజ్ఞానం ఎవరికీ కలుగుతుందో వారే మోక్షానికి అర్హులు. కర్మలు చిత్తశుద్ధిని ఇస్తాయి. ఆ శుద్ధమైన మనసుతో జ్ఞానాన్ని పొందినవాడే ముక్తుడు అవుతాడు. గరుడ పురాణం ప్రకారం మోక్షం పొందడానికి మనిషిలో ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు ఇవే మొదటిది వైరాగ్యం సంసారంలో ఉన్నా సరే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి.
(01:55) నా భార్య నా పిల్లలు నా ఆస్తి ఇవన్నీ నా బాధ్యతలు మాత్రమే ఇవేవి నావి కాదు అని ఎవరైతే మానసికంగా దూరంగా ఉంటారో వారికి మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. రెండవది అహంకార రాహిత్యం నేను చేస్తున్నాను నేను గొప్పవాడిన అనే అహంకారం ఉన్నంతవరకు జీవుడు బంధించబడే ఉంటాడు. చేసేవాడు ఆ భగవంతుడే నేను కేవలం నిమిత్త మాత్రుడిని అని ఎవరైతే భావిస్తారో వారి కర్మలు వారికి అంటవు.
(02:24) కర్మ అంటని వాడికి జన్మ ఉండదు. మూడవది ద్వంద్వాతీత స్థితి లాభం నష్టం సుఖం, దుఃఖం, పోగడ్డత, తెగడత ఈ రెండిటిని ఎవరైతే సమానంగా స్వీకరిస్తారో వారే మోక్షానికి అసలైన అర్హులు. గరుడ పురాణం కేవలం శిక్షల గురించే కాదు అష్టాంగ యోగం గురించి కూడా చెబుతుంది. విష్ణువు ఏమన్నారంటే ఎవరైతే ప్రాణాయామం ద్వారా శ్వాసను ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో వారు తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించగలరు.
(02:58) కానీ కలియుగంలో అందరికీ యోగ్యం సాధ్యం కాదు కదా అందుకే విష్ణువు అంతిమ స్మరణ అనే రహస్యాన్ని చెప్పాడు. ఎంఎం వాసి స్మరణ భావం మనిషి చనిపోయే ఆఖరి క్షణంలో ఏది ఆలోచిస్తాడో తర్వాతి జన్మలో అదే అవుతాడు. కానీ జీవితాంతం డబ్బు కుటుంబం గురించి ఆలోచించిన వాడికి చనిపోయేటప్పుడు హటాతుగా దేవుడు గుర్తుకు రాడు. అందుకే జీవితాంతం అభ్యాస యోగం చేసిన వాడికే అంత్యకాలంలో భగవంతుని స్మరణ వచ్చి సాయోజ్యం అనే మోక్షం లభిస్తుంది.
(03:31) జ్ఞానం కష్టం యోగం ఇంకా కష్టం మరి సామాన్యుడికి మోక్షం ఎలా? గరుడ పురాణంలో విష్ణువు చెప్పిన అద్భుతమైన మాట. ఎవరైతే నన్ను అనన్య భక్తితో ఆశ్రయిస్తారో వారి యోగక్షేమాలను మోక్ష బాధ్యతను నేనే వహిస్తాను. మోక్షం పొందడానికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు కేవలం కృష్ణ ఈ శరీరం నీది ఈ ప్రాణం నీది నన్ను నీలో కలుపుకో అనే పూర్ణ శరణాగతి ఎవరికీ ఉంటుందో యమధర్మరాజు వారిని చూసి కూడా పక్కకు తప్పుకుంటాడు.
(04:06) విష్ణు దూతలు వారిని నేరుగా వైకుంఠానికి తీసుకువెళ్లి అక్కడి నుండి శాశ్వత విముక్తిని ప్రసాదిస్తారు. చివరగా గరుడ పురాణం సారాంశం ఇది. స్వర్గం అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిది. అక్కడికి వెళ్లి మళ్ళీ వెనక్కు రావాలి. కానీ మోక్షం అనేది సొంత ఇల్లు ఎవరైతే అజ్ఞానాన్ని వదిలేస్తారో అనుబంధాలను తెంచుకుంటారో ఈశ్వరుని తప్ప వేరే దిక్కు లేదని నమ్ముతారో వారే మోక్షాన్ని పొందుతారు.
(04:33) అటువంటి వారు మరణించినప్పుడు వారి ఆత్మ బ్రహ్మరంద్రం ద్వారా బయటకు వచ్చి సూర్య మండలాన్ని బెదిరించుకుని అనంతమైన పరబ్రహ్మంలో ఐక్యమవుతుంది. ఇదే పునరావృత్తి రహిత కైవల్యం ఈ వీడియో ద్వారా మీకు నిజమైన మోక్షం అంటే ఏంటో అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ టైప్ చేయండి.
No comments:
Post a Comment