విశ్వమంతా ఒక ఇంద్రజాలం! ఉపనిషత్తులు చెప్పిన మాయా రహస్యం.
Author Name: Amruthavani kathalu
Youtube Channel Url:https://www.youtube.com/@Amruthavani-f8j
Youtube Video URL:https://www.youtube.com/watch?v=O5t6oX25G5U
Transcript:
(00:00) దాహంతో అలమటిస్తున్న ఒక వ్యక్తికి ఎడారిలో దూరాన నీళ్లు కనిపిస్తాయి. ప్రాణాలు దక్కించుకోవాలని ఆశతో అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్నది కేవలం వేడి ఇసుక మాత్రమే మన జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉందా? మనం దేన్నైతే సుఖం అనుకొని వెతుకుతున్నామో అది దొరికాక మాయమైపోతుందా? మనం ప్రేమిస్తున్న మనుషులు మనం సంపాదిస్తున్న ఆస్తులు ఇవన్నీ ఒకరోజు మన కళ్ళ ముందే ఆవిరైపోతాయని తెలిసి కూడా వీటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాం మాయ అంటే లేనిది ఉన్నట్లు కనిపించడం కాదు ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడనివ్వకుండా మన కళ్ళకు కట్టిన గంట ఈరోజు మన అమృతవాణి కథలు
(00:44) ఛానల్లో వేల ఏళ్ల నాటి ఉపనిషత్తుల రహస్యాన్ని నారదుడి జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఉపనిషత్తులు మాయను ఒక తెరతో పోలుస్తాయి. ఈషావాస్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి హితం ముఖం అంటే సత్యం అనే ముఖం బంగారు పాత్రతో కప్పబడి ఉంది. ఇక్కడ బంగారం అంటే ఆకర్షణీయమైన ఈ ప్రపంచం.
(01:15) మాయ అంటే ఏమిటో అర్థం కావడానికి మూడు స్థాయిలు ఉంటాయి. ప్రతిభాసిక సత్యం కలలో కనిపించే ఏనుగు నిద్ర లేవగానే అది మాయం వ్యావహారిక సత్యం మనం ఇప్పుడు చూస్తున్న ఈ లోకం ఇది నిజమే కానీ శాశ్వతం కాదు పారమార్థిక సత్యం ఎప్పటికీ మారని ఆ పరమాత్మ తత్వం మాయ అనేది ఒక గొప్ప ఇంద్రజాలికుడి లాంటిది. ఒక ఇంద్రజాలికుడు స్టేజ్ మీద వస్తువులను సృష్టించినప్పుడు అవి మనకు కనిపిస్తాయి కానీ అవి నిజం కావని మనకు తెలుసు.
(01:48) కానీ ఈ విశ్వం అనే స్టేజ్ మీద దేవుడు చేసే మాయలో మనమే పాత్రలమైపోయి ఇది అబద్ధం అని మరిచిపోతున్నాం. అందుకే ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించమన్నాయి. ఆ చీకటి పేరే మాయ. ఒకనాడు వైకుంఠంలో నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు. ప్రభు నీ మాయను జయించడం అసాధ్యం అంటారు కదా అసలు ఆ మాయ ఎలా పనిచేస్తుంది? విష్ణువు చిరునవ్వు నవ్వి నారదుని భూలోకానికి తీసుకెళ్ళాడు.
(02:18) అలసిపోయినట్లు నటించి నారదా ఆ కనిపించే ఇంటికి వెళ్లి కొంచెం నీళ్లు తీసుకురా అని పంపాడు. నారదుడు ఆ తలుపు తట్టాడు. ఒక లావణ్యవతి తలుపు తీసింది. ఆమె కళ్ళలోకి చూడగానే నారదుడి లోపల ఉన్న జ్ఞానంఅంతా కరిగిపోయింది. తాను దేవుడి దూత అనే విషయం వైకుంఠం విష్ణువు అంతా ఒక్క క్షణంలో మాయమైపోయాయి. ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు.
(02:44) పిల్లలు పుట్టారు పిల్లల నవ్వులు భార్య అనురాగం ఇదే లోకం అనుకున్నాడు. ఒకరోజు తన కొడుకుకి దెబ్బ తగిలితే నారదుడు విలవిలలాడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంంతా తన కుటుంబం అనుకున్న మహర్షి ఇప్పుడు కేవలం నలుగురు వ్యక్తుల కోసం ఏడుస్తున్నాడు. ఇదే మాయ చేసే మ్యాజిక్ సంవత్సరాలు బెడిచాయి. ఒక భయంకరమైన రాత్రి ఆకాశం చిల్లులు పడేలా వర్షం కురుస్తోంది. ఊరంతా జలమయమైంది.
(03:12) నారదుడు తన భార్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. చంకలో ఒక బిడ్డ భుజంపై మరో బిడ్డ నీటి ప్రవాహం పెరిగింది. ఒక్కసారిగా ఒక పెద్ద అల వచ్చి చంకలో ఉన్న బిడ్డను లాక్కెళ్ళిపోయింది. నారదుడు ఆక్రందన చేస్తున్నాడు. నా బిడ్డ నా బిడ్డ అని మరుక్షణమే భార్య చెయ్యి జారిపోయింది. ఆ ప్రవాహంలో తన సర్వస్వాన్ని కోల్పోయి తానే కొట్టుకుపోతూ ఊపిరాడక నారాయణ అని గట్టిగా కేక వేశడు.
(03:42) కళ్ళు తెరిచి చూస్తే తను నీళ్ళల్లో లేడు విష్ణుమూర్తి పాదాల చెంత ఉన్నాడు. విష్ణువు అడుగుతున్నారు. నారదా నీళ్లు తేవడానికి ఇంత సమయం పట్టిందఏమిటి? నా బిడ్డలు నా భార్య అని ఎవరికోసం ఏడుస్తున్నావ్? నారదుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు 12 సంవత్సరాల జీవితం ఆ ప్రేమ ఆ బాధ ఆ మరణం అంతా కేవలం కొన్ని నిమిషాల భ్రమ అప్పుడు నారదుడు అన్నాడు స్వామి నీ మాయను తెలుసుకోవడం కాదు దాన్ని అనుభవించాను అది ఎంత భయంకరమైనదో ఎంత మధురమైనదో అర్థమైంది.
(04:18) మిత్రులారా నారదుడి కథ మనందరి కథే మనం కూడా ఒక మాయా నదిలో కొట్టుకుపోతున్నాం. నేను సంపాదిస్తేనే నా కుటుంబం బతుకుతుంది అనుకుంటాం. కానీ మనం లేకపోయినా ఈ లోకం ఆగిపోదు. ఈ పదవి ఈ గౌరవం శాశ్వతం అనుకుంటాం. కానీ కాలం అనే ప్రవాహం అన్నింటిని కొట్టుకుపోతుంది. మాయను వదిలించుకోవడం అంటే అడవులకు వెళ్ళడం కాదు. ఒక సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మంటలు వచ్చినా అది కాలదని నీళ్లు వచ్చినా స్క్రీన్ తడవదని మనకు తెలుసు.
(04:49) అలాగే జీవితంలో కష్ట సుఖాలు వస్తున్నప్పుడు ఇది మాయ నేను సాక్షిని మాత్రమే అనే సత్యాన్ని గుర్తుంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత ఈరోజు మీకో చిన్న ప్రశ్న మీ జీవితంలో మీరు అత్యంత నిజమని నమ్మి తరువాత అది అబద్ధం అని తెలుసుకున్న విషయం ఏమిటి? కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొందాం సత్యాన్ని దర్శిద్దాం.
(05:15) ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమృతవాణి కథలు వీక్షించినందుకు ధన్యవాదాలు.
No comments:
Post a Comment