సులభతర కుండలినీ యోగం
6. వేదాద్రిమహర్షి సందేశం
1. ఎంత గొప్ప మహానుభావుడైనా ఆయన బాల్యావస్థలో కలలు కనే సమయం. కలలకు నిజానికి మధ్యలో... అలవాట్లు ఆచరణమధ్య తీవ్రమైన అంతర్మథనం కలుగుతుంది.
2. మారే గుణాలు అన్నీ ప్రకృతివలన వచ్చినవే.
3. జీవించే హక్కు అందరికి ఉంది. జీవించేవాళ్ళతో కలిసి జీవించే వరకు, జీవించడానికి ఉన్నవాళ్ళు అందరూ కలిసి సృష్టిద్దాం ఒక పద్ధతిని సుఖంగా జీవించడానికి.
4. ధనం జీవితానికే కాని, ధనానికే జీవితం కాకూడదు.
5. అనవసరమైన చాలావాటిని అవసరం అనుకొని, తెలివిలేని ఊహలతో ఆలోచించేటప్పుడు, అవసరాల పరిమితి తెలుసుకొనేపద్ధతి సమాజంలో రూపొందించబడాలి.
6. వదలుకోలేని పద్దతికి అలవాటుపడి, తలరాతను తలచుకొని ప్రజలు, కూరలేని భోజనంలాగ దానికి తగ్గట్టు జీవిస్తున్నారు.
7. తప్పుచేయడం అందరికీ సహజం; ఆలోచనలు లేని వాళ్ళు. తప్పులని పెంచుకొంటారు.
8. ప్రపంచంలో జీవించిన ప్రజలందరూ ఆడవాళ్ళ బహుమతి కాక మరేమిటి?
9. అందరు వ్యక్తులూ సమాజానికి ఋణపడ్డవాళ్ళే.
10. ప్రేమమత్తులో ఉండే అలవాటును వదిలివేసి, మంచిగా జీవించడానికి దారి తెలుసుకోవాలి.
11. కళలని వ్యాపారంచేసే కాలాన్ని మార్చి, శాశ్వతంగా సామరస్యాన్ని ప్రపంచంలో మనం చూద్దాం.
12. ఐదు భూతాల తర్వాత బట్టబయలు తప్ప ఏమున్నది? కాబట్టి బట్టబయలే దేవుడని చెప్పబడుతున్నది.
13. చాలా తీవ్రసాధనవల్ల జ్ఞానం ఆ దేవుడని తెలుసుకొన్నాను.
14. ప్రాణశక్తియే జీవకాంతశక్తి అని, కుండలినీ శక్తి అని చెప్ప బడుతున్నది.
15. జీవరాశిలో ఆకాశమేప్రాణంగా పనిచేస్తుండగా, దానిలోనుండి పుట్టే తరంగాల కదలికే మనస్సు.
16. నా ధనం, ఇల్లు బట్టబయలే అనుకొని సన్యాసం తీసుకొన్నాను.

No comments:
Post a Comment