Wednesday, May 27, 2026

నీ చుట్టూ ఉన్నవాళ్లే నిన్ను ముంచుతారు | Beware Of These Toxic People | Satyagrahi

నీ చుట్టూ ఉన్నవాళ్లే నిన్ను ముంచుతారు | Beware Of These Toxic People | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vGYYdUWK-iQ



Transcript:
(00:05) మీరు ఈ భూమ్మీద పుట్టారు మీకుొక శరీరం ఉంది మీకుొక బ్రెయిన్ ఉంది. కానీ మీ జీవితాన్ని ఎవరు నడుపుతున్నారు మీరా లేక మీ చుట్టూ ఉన్న సమాజమా చాలామంది తము బతుకుతున్నాము అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళని ఎవరో బతికిస్తున్నారు. సమస్య ఎక్కడఉందో తెలుసా? దేవుడు మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. దాని పేరే స్వేచ్ఛ.
(00:27) మీరు ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకునే హక్కు కేవలం మీకే ఉంది. మీ ముందు మంచి ఉంది చెడు ఉంది. ఓ పక్క ఇరుకైన కష్టాల మార్గం ఉంది మరో పక్క విశాలమైన సుఖాల లోక మార్గం కూడా ఉంది. కానీ మీరు ఏమ ఎంచుకుంటున్నారు సమస్యలు రాగానే దేవుణని తిడతారు. సక్సెస్ రాగానే కాళ్ళ ఎగరేస్తారు. నిజం ఏంటంటే ఈరోజు మీకున్న దరిద్రానికైనా రేపు రాబోయే వైభవానికైనా కారణం కేవలం మీరు మాత్రమే.
(00:52) మీరు తీసుకున్న నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఇతరులను బ్లేమ్ చేయడం ఆపనంతవరకు మీరు ఒక పపెట్ మాత్రమే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఎవరైనా తగిలి సారీ చెప్తారు. ఎందుకంటే అది చెయ్యి కాబట్టి అదే కాళ్ళు తగిలితే అవతల వ్యక్తి సీరియస్ గా చూస్తాడు. చెయ్యి అయినా కాలైనా మీ శరీరంలోని బాగాలే కదా మరి కాలు తగిలితే ఎందుకు అంత ఈగో హర్ట్ అవుతుంది ఎందుకంటే సమాజం కొన్నిటికి ఉన్నత స్థానాన్ని ఇంకొన్నిటికీ నీచ స్థానాన్ని ఇచ్చింది.
(01:18) మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు కూడా సమాజంలో ఆ కాలు లాగా లేదా కాలి కోరులాగా మారిపోతున్నారు. మీరు సత్యం వైపు నిలబడకుండా ప్రతిదానికి రాజీ పడిపోతుంటే మీ వల్యూ పడిపోతుంది. ఆచార్య చాణక్య గారు ఒక మాట అంటారు. పాముకి విషం కోరల్లో ఉంటుంది. కానీ దుర్మార్గుడికి ఒల్లంతా విషమే ఉంటుంది అని ఇక్కడ దుర్మార్గుడు అంటే ఎవరో కారు తనకున్న స్వేచ్ఛని వాడుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకునేవాడే దుర్మార్గుడు.
(01:50) మీరు మీ లైఫ్ ని ఏ స్థానంలో ఉంచాలనుకుంటున్నారో ఉన్నతమైన స్థానమా లేక ఎవరైనా తొక్కి వెళ్లే నీచ స్థానమా నిర్ణయం పూర్తిగా మీదే. కాకపోతే ఇప్పటి సమాజంలో ఈ రోజుల్లో జనాలు నరకాన్ని కూడా ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు. సినిమాలో చూపించే యమధర్మరాజుని ఆయన కింకర్లను చూసి నవ్వుకుంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కేస్ పెట్టొచ్చని జోకులు వేస్తున్నారు.
(02:13) నిజం ఏంటంటే మీరు దేన్నైతే కామెడీగా తీసుకుంటున్నారో అది మీ జీవితాన్ని తగలపెట్టే అతి పెద్ద నిప్పు నరకం అంటే ఎక్కడో ఉండే ప్లేస్ కాదు. మీరు తీసుకునే మూర్ఖపు నిర్ణయాల వల్ల బతికుండంగానే అనుభవించే మానసిక క్షోభే ఒక నరకం. అక్కడ ఏడుపు పలుకోరుకుడు తప్ప ఇంకేం మిగలవు. చాణిక్య గారు అప్పుడే చెప్పారు మూర్ఖుడికి అజ్ఞానాన్ని బోధించడం అంటే బూడిదిలో నెయ్యి పోయడమే అని ఎవరు చూశారు భయ్యా మరణాన్ని ఎవరు చూశారు నరకాన్ని మంచం మీద పడి ప్రాణం పోయే ఆఖరి క్షణంలో మీ కళ్ళ ముందు చీకటి తప్ప ఏమీ కనపడినప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది.
(02:49) అప్పుడు తెలుస్తుంది మీరు బతికిన జీవితం ఎంత వేస్ట్ అయిందో అనేది. ఈ సమస్య అంతా రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? యవ్వన మదం లోకపిచ్చి ఈ వయసులో బ్లడ్ వేడిగా ఉంటుంది. కళ్ళకి ఏది సరిగ్గా కనపడదు. పెద్దలు చెప్పే మాటలు గురువులు చెప్పే నిజాలు అన్ని వెటకారంగా అనిపిస్తాయి. దిస్ ఈస్ మై లైఫ్ మై లైఫ్ మై రూల్స్ అంటూ ఎటకారంగా కాళ్ళ ఎగరేస్తాం.
(03:10) కానీ మీకు తెలుసా ఈ యవ్వనం అనేది నడమంత్రపు సిరి అని గట్టిగా మాట్లాడితే మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ తర్వాత జీవితం మీ సరదా తీర్చేస్తుంది. బాడీలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొంది బాధ్యతలు కూడా పెరుగుతాయి. అప్పుడు కానీ మీకు రియాలిటీ మైండ్ లోకి ఎక్కదు. చాణిక్య గారు చాలా క్లియర్ గా ఒక లైన్ చెప్పారు రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ విద్యహీన నా సోభంతే నిర్గంధ ఇవకిన్సుంక అంటే అందం ఉన్న యవ్వనం ఉన్న పెద్ద వంశంలో పుట్టిన లైఫ్ లో క్లారిటీ వివేకం లేకపోతే వాసన లేని పువ్వులాగా మిగిలిపోతారు అని ఎందుకు పనికి
(03:49) రారు అని మీరు ఇప్పుడు అదే భ్రమలో బతుకుతున్నారా మరో పెద్ద ఇల్యూషన్ ఏంటో తెలుసా తాత్కాలిక సుఖాల పట్ల వ్యామోహం ఇన్స్టంట్ గ్రాఫికేషన్ ఇప్పుడు దొరికే ఐదు నిమిషాల ఎంజాయ్మెంట్ కోసం రేపటి 70 ఏళ్ల జీవితాన్ని తాకట పెట్టేస్తున్నారు. మీ మైండ్ మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తుంది. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇదే లాస్ట్ టైం రేపటి నుంచి మారిపోతాను అని మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది.
(04:15) దాన్నే సైకాలజీలో నిరాకారణ లేదా డినైట్ అంటారు. అలాగే కొంతమంది చూడండి 40 రోజులు ఏదో ఒక నియమం పెట్టుకుంటారు. చెడు అలవాట్లను సిగరెట్లను మానేస్తారు. ఆ రోజు అయిపోగానే బాబోయ్ నాకు మోక్షం వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ పాత బతుకు మొదలు పెడతారు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు దేవుడినా ప్రకృతినా లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా నాకు తెలిసినంతవరకు మీరు దేవుణ్ణి మోసం చేయలేరు.
(04:40) ఎందుకంటే దేవుడు ఎప్పుడు మోసపోడు. ప్రకృతిని మోసం చేయలేరు. ఎందుకంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాలక్రమేణ మనం ఈ కాలగర్భంలో కలిసిపోతాం. చివరిగా మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది పచ్చి నిజం. నిజమైన మార్పు అంటే ఒకసారి తప్పు అని తెలిసాక ప్రాణం పోయిన మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అలా కాకుండా సీజనల్ గా మారుతానంటే మీకంటే పెద్ద కపట భక్తుడు ఇంకొకడు ఉండడు.
(05:06) అసలు ఈ ఊబిలో నుంచి ఎలా బయటపడాలి? చాలా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ గేమ్ ఆడటం ఆపాలి. నా తలరాతి ఇంతే నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను నాశనం చేశారు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఇలాంటి పనికి మాలిన సాకులు చెప్పడం మానేయాలి. సమస్య మీతోనే మొదలైంది కాబట్టి సొల్యూషన్ కూడా మీతోనే స్టార్ట్ అవ్వాలి మీ జీవితానికి మీరే 100 శాతం బాధ్యత వహించాలి.
(05:29) నిజం ఏంటంటే ఈ క్షణంలో మీరు పడుతున్న బాధకు కారణం గతంలో మీరు తీసుకున్న దరిద్రపు నిర్ణయాలే. దాన్నే చాణక్య గారు కార్యన్ కారణ సిద్ధాంతం అంటారు. నువ్వు ఏమి విత్తనం నాటితే ఆ చెట్టే మెలకెత్తుతుంది. విషపు విత్తనాన్ని నాటి అమృతాన్ని ఆశించకూడదు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇంకా టైం ఉంది మీరు ఇంకా బతికే ఉన్నారు చావలేదు వయసుతో సంబంధం లేదు ఈరోజే ఈ క్షణమే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి మీ తప్పులను కప్పి పుచ్చుకోకుండా ధైర్యంగా వాటిని ఒప్పుకోండి అప్పుడే మార్పుకి మొదటి అడుగుపడుతుంది.
(06:00) రెండవది సత్యం కోసం రోషం పెంచుకోకండి. సమాజంలో అందరూ వెళ్తున్నారని చెప్పి విశాల మార్గంలో ఆ తప్పుడు ఆచారాల వెనక పరిగెత్తకండి. ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే ఒక మంచి మాట చెప్తే వెటకారం చేస్తారు. వీడేదో పొట్ట తిప్పల కోసం మాట్లాడుతున్నాడు వీడుఒక పెద్ద వేదాంతి అని ఈజీగా కామెంట్ చేసి పారేస్తారు. కానీ మెట్ట వేదాంతం మీ జీవితాన్ని కాపాడదు.
(06:22) నిజమైన వివేకం కావాలంటే మీకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే క్లారిటీ ఉండాలి. చాణిక్య గారు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు సత్యేన ధార్యత్తే వృద్ధే సత్యేన తాపతే రవి అని అంటే ఈ భూమిమీద నిలబడింది సూర్యుడు మండుతోంది కేవలం సత్యం వల్లే కదా సత్యానికి ఉన్న పవర్ అది మీరు కూడా మీ లైఫ్ లో రాజీ పడకుండా సత్యం వైపు నిలబడటం నేర్చుకోండి.
(06:47) ఎన్ని ఆకర్షణలు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని అవహీలన చేసినా మీ విలువని వదులుకోవద్దు. ఒక చేతితో లోకాన్ని ఇంకో చేతితో నీతిని పట్టుకుంటాను అంటే కుదరదు. ఏదో ఒకటి మాత్రమే సాధ్యం. మూడోది కష్టపడాల్సిన టైంలో కష్టపడటం నేర్చుకోండి. చాలామంది సమయాన్నంతటినీ పనికిమాలిన వ్యవహారాలకు తగలబెడతారు. ఆ తర్వాత పక్కవాడు కష్టపడి పైకి వస్తే వాడి మీద ఏడుస్తారు.
(07:10) వాడికి లక్కు బాగుంది భయ్యా అందుకే సక్సెస్ అయ్యాడు అని చెట్ట ప్రచారాలు చేస్తారు. ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు. అవతలి వాడు సాధించాడు అంటే వాడు మీకంటే ఎక్కువ కష్టపడ్డాడు అని అర్థం. మీరు ఆ స్థాయిలో కష్టపడలేదు కాబట్టే మీకు ఆ రిజల్ట్ రాలేదు. అంతెందుకండి ఒక వ్యక్తి బాగా లవ్ గా ఉండి సడన్ గా అతను సిక్స్ ప్యాక్ సాధిస్తే అతనికి ఏంటండీ అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పేసి ఎవడైనా అంటాడా ఎందుకంటే ఒళ్ళు వంచకుండా శరీరానికి బెండు తీయకుండా ఇక్కడ ఎవ్వడు సిక్స్ ప్యాక్ సాధించలేడు అలాగే జీవితంలో సాధించే ప్రతి విజయం కూడా అంతే మనం ఏంటంటే మనం చేతగాని వాళ్ళం అని
(07:43) చెప్పేసి ఒప్పుకోవడం ఇష్టం లేక వాడికి లక్కు కలిసి వచ్చింది వాడి వైపు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం దాన్నే నిజం అని చెప్పి అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. గడిచిపోయిన రోజులు మళ్ళీ రిటర్న్ వస్తాయా రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. కాలం ఉండగానే మీ లక్ష్యం కోసం కష్టపడండి.
(08:03) లౌకిక జీవితంలో మీ కుటుంబాన్ని బతికించడం కోసం ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువగా మీ ఆత్మగౌరవం కోసం మీ అంతర్గత ఎదుగుదల కోసం కష్టపడాలి. చాణక్య గారు అన్నట్లు సోమరితనానికి మించిన శత్రువు కష్టపడటానికి మించిన మిత్రుడు మనిషికి ఇంకొకడు లేడు అని. ఇప్పుడు అసలైన పాయింట్ కి వద్దాం. జీవితాన్ని కేవలం బ్రతకడం కాదు దాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి.
(08:26) ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ లోకంలో ఏది ఉచితంగా రాదు. దేనికైనా ముందే ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతారు. మనం కూడా దాన్ని తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది. ఈర్ష పడితే మన పనులు అవ్వవు. ఇంకా రెండవది మీ అంతర్గత శక్తులను ప్రభావితం చేసే సాహసాన్ని ఎంచుకోండి.
(08:48) ఎన్నాలు గడిచినా మీలో మార్పు రావడం లేదంటే మీ చుట్టూ ఉన్న సమాజం మీ ఫ్రెండ్స్ తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ మీరు అక్కడే ఉంటారు. వెంటనే ఆ అజ్ఞానాన్ని ఇవతలకు విసిరేసి సత్య సంబంధమైన సాహసాన్ని వెతకండి. చాణక్య గారు చాలా క్లియర్ గా చెప్పారు దుర్జన సంసర్గం త్వజ భుజసాధు సమగమం అని అంటే దుర్మార్గుల మూర్ఖుల సాహసాన్ని వదిలేయండి.
(09:12) వేగవంతుల చెంతకు చేరండి. మీకు ఏది మంచిదో ఏది సత్యమో బోధించే వ్యక్తి దొరికినప్పుడు మీ ఈగుని పక్కన పెట్టి అతన్ని అనుసరించండి. మీ ప్రగతిని మీ మెంటల్ స్ట్రెంత్ ని పెంచే పనులు చేయండి. అంతేకానీ లౌకిక వ్యామోహంలో పడి సర్వస్వం కోల్పోకండి. లోకాన్ని వదిలేయడం అంటే అడుగులోకి వెళ్ళడం కాదు దాని మీద ఉన్న గుడ్డి ఆకర్షణని వదిలేయడం. మీ అవసరాలన్నీ ప్రకృతి చూసుకుంటుంది.
(09:36) బాధ్యత గల వ్యక్తిగా మీరు చేయాల్సింది కేవలం సత్య మార్గంలో నడవడం మాత్రమే. చివరిగా ఒక మాట ఈ జీవితం ఒక యుద్ధం లాంటిది ఇక్కడ రాజీ పడే వాడికి భయపడే వాడికి స్థానం లేదు మీరు చచ్చినా కూడా మీ ఆత్మ మీ కర్మలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఒక మంచి మిత్రుడు ఏ మాట చెప్పినా వినండి అంతేకాని వెటకారం చేయకండి ఒకవేళ వెటకారం చేస్తే కచ్చితంగా మీరే బాధపడతారు.
(09:59) ఎందుకంటే మంచి మాటలు కూడా ప్రకృతి మనకి పంపిస్తూ ఉంటుంది. అది నీ ఫ్రెండ్ ద్వారా కావచ్చు లేకపోతే ఈ వీడియో ద్వారా కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళ రూపంలో అవ్వచ్చు అలా రూపంలో వచ్చిన మంచి మంచి విషయాలను మీరు నవ్వుకుంటూ కామెడీ చేస్తే కచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు బాధపడతారు. ఎందుకంటే కాలం ఎవరిని క్షమించదు. ఇప్పటికైనా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి.
(10:22) రిస్క్ తీసుకోండి. సత్యాన్ని అంగీకరించండి. మీ తప్పులను సరిదిద్దుకోండి. మోటివేషన్ కోసం వెతకడం ఆపి జీవితం పట్ల క్లారిటీ తెచ్చుకోండి. చివరి క్షణాల్లో మంచం మీద పడి పశ్చాత్తాప్ పడటం కంటే ఇప్పుడే కళ్ళు తెరవడం 100 రెట్లు మేలు. గుర్తుంచుకోండి మీ భవిష్యత్తును డిసైడ్ చేసే పెన్ను మీ చేతిలోనే ఉంది. దాంతో ఒక అద్భుతమైన చరిత్ర రాస్తారో లేదా జీరోగా మిగిలిపోతారో ఆ ఛాయిస్ పూర్తిగా మీదే ఎందుకంటే మనం ఎదగాలన్నా ఎదగకుండా అక్కడే మిగిలిపోవాలన్నా ఆ రెండు ఛాయిస్లు మన చేతిలోనే ఉన్నాయి.
(10:56) ఆ ఛాయిస్ దేవుడు మనకే ఇచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్. ఆ

No comments:

Post a Comment