మీతో ఉంటూనే వెన్నుపోటు పొడిచే వారిని గుర్తించడం ఎలా? చాణక్యుడు చెప్పిన 5 కఠిన వాస్తవాలు!
Author Name: galaxy of life lessons
Youtube Channel Url:https://www.youtube.com/@Galaxyoflifelessons-1176
Youtube Video URL:https://www.youtube.com/watch?v=K0S39yRz7Iw
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక పచ్చి నిజం మాట్లాడుకుందాం. ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి జీవితంలో మీరు ఎప్పుడైనా ఒంటరిగా గద్దిలో కూర్చొని ఏడ్చారా లేదు అంటే కనీసం ఒక్కసారైనా బాధపడి ఉంటారు అవునా కాదా మీ శత్రువులు ఎవరో దాడి చేశారని లేదా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చారని కాదు మీరు ప్రాణానికి ప్రాణంగా నమ్మిన మనిషి మీ చేతిలో చెయి వేసి నడిచిన ఒక వ్యక్తి మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడాడని లేదా లేదా మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచాడని తెలిసినప్పుడు ఇంకా చెప్పాలంటే నమ్మించి మోసం చేసినప్పుడు ఆ వచ్చిన
(00:45) కన్నీళ్లు ఉన్నాయే అవి రక్తం కంటే చిక్కటివి ఒక నిజం చెప్పనా యుద్ధంలో ఎదురుగా వచ్చే శత్రువు 100 కత్తులతో దాడి చేసిన మీరు బతికి బయట పడగలరు కానీ మీ పక్కనే ఉంటూ మీతో కలిసి తింటూ మీరు వేసే ప్రతి అడుగును గమనిస్తూ మీ బలహీనతలను తెలుసుకుంటూ సమయం చూసి వెన్నుపోటు పొడిచే నకిలి మనుషులు ఉన్నారే వాళ్ళ వల్లే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు.
(01:19) వాళ్ళు బయట ఎక్కడ లేరు మీ ఫోన్ కాంటెక్స్ట్ లోనే ఉన్నారు. మీవాట్సాప్ స్టేటస్ లు చూస్తున్నారు మీ ఆఫీస్ లో మీ పక్క కూర్చేలోనే కూర్చున్నారు. బహుశా మీ బంధువుల రూపంలో మీ ఇంట్లోనే తిరుగుతున్నారు. నిజానికి వాళ్ళకి మీ ఎదుగుదల ఇష్టం లేదు కానీ మీతో ఉన్న అవసరం వాళ్ళని మీ పక్కన ఉంచింది. చాణక్యుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ మానవ నైజాన్ని చదివాడు.
(01:48) ఒక సాధారణ వ్యక్తిని చక్రవర్తిని చేసిన ఆ మహా మేధావి ఈ నకిలి మనుషులను వెన్నుపోటు పొడిచే ద్రోహులను ముందే ఎలా పసిగట్టాలో ఐదు సూత్రాలుగా చెప్పాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక సవాలు ఈ ఐదు లక్షణాలు జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఒక్కరైనా ఖచ్చితంగా ఉంటారు. ఈరోజు వాళ్ళు వేసుకున్న ముసుగులను తొలగిద్దాం. వాళ్ళను మీ జీవితం నుండి శాశ్వతంగా ఎలా పీకి పారేయాలో నిర్ణయించుకుందాం.
(02:21) సిద్ధంగా ఉన్నారా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం మరియు మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఇప్పుడు ఒకటవ సూత్రం అవసరానికి మించి పొగుడే విష సర్పాలు చాణక్యతిలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే ముఖం మీద అమృతం చల్లుతూ మనసులో విషం దాచుకునే వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
(02:56) మీ చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళు మీరు ఎదురుపడగానే ప్రపంచంలో మీ అంత గొప్పవాళ్ళు లేరు అన్నట్లు పోగొడతారు. అన్నా నువ్వు తోట అన్నా నీ టాలెంట్ కి నువ్వు ఎక్కడ ఉండాలి బ్రో మీరు లేకపోతే ఈ పని జరిగేదే కాదు సార్ ఇలాంటి మాటలు వినడానికి మన అహంకారానికి అదే ఈగో చాలా చల్లగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి కారణం లేకుండా పొగిడేవాడు సమయం చూసి గొంతుకోస్తాడు.
(03:25) వాళ్ళు ఎందుకు అలా పొగుడుతారో తెలుసా ఎందుకంటే వాళ్ళకు మీ దగ్గర ఒక పని కావాలి. మీ జేబులో డబ్బులైనా కావాలి లేదా మీ ద్వారా వాళ్ళ పనులైనా నెరవేరాలి. మీరు గమనించారా ఇలాంటి వాళ్ళు మీ ముఖం మీద మిమ్మల్ని పొగుడుతారు కానీ మీరు లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ గురించి అత్యంత నీచంగా మాట్లాడతారు. ఇప్పుడు రియల్ లైఫ్ సైకాలజీ చూద్దాం.
(03:53) మీరు ఒక కొత్త బట్టలు వేసుకున్నారో లేదా ఏదైనా కొత్త బైక్ కొన్నారో అనుకుందాం. వాడు వచ్చి అరే మామ ఏమున్నావురా అంటాడు కానీ వాడి కళ్ళల్లో చూడండి ఆ నవ్వులో నిజాయితి ఉండదు. కళ్ళలో అసూయ కనిపిస్తుంది. వాడికి మీ ఎదుగుదల చూసి కడుపు మండుతోంది కానీ దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఆ పొగర్తల మాస్క్ వేసుకున్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలి ఎవడైనా మిమ్మల్ని అవసరానికి మించి పోగుడుతున్నాడు అంటే అక్కడ ఒక అలారం మోగాలి వాడికి మీ అవసరం ఏంటో అర్థం చేసుకోండి.
(04:32) వాడి మాటలకు పొంగిపోయి మీ జేబులు ఖాళీ చేసుకోకండి. వాడికి ఎప్పుడైతే మీతో అవసరం తీరిపోతుందో అప్పుడు వాడు కనీసం మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. అలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎంతమంది లేరు మీ జీవితంలో ఈరోజే అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను దూరం పెట్టండి మీ విలువలను కాపాడుకోండి. రెండవ సూత్రం మీ రహస్యాలను కన్వి తీసే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మీ జీవితంలో జరిగిన అతి పెద్ద తప్పుఏంటో తెలుసా? నీ బాధను పంచుకోవడానికి సరైన మనిషి దొరికాడు అనుకొని నీ మనసులో ఉన్న కష్టాన్ని మీ కుటుంబంలో ఉన్న సమస్యలను నీ ఆర్థిక ఇబ్బందులను ఒకడి దగ్గర ఏకరు
(05:18) పెట్టడం ఆ సమయంలో వాడు నీ భుజం మీద చేయి వేసి నేను ఉన్నానురా నీకు బాధపడకు అని అంటాడు. మీకు అనిపిస్తుంది అబ్బా నాకు ఎంత మంచి స్నేహితుడు దొరికాడు అని కానీ చాణక్యుడు ఏమన్నాడో తెలుసా నీ రహస్యం నీ దగ్గర ఉన్నంతవరకే అది నీకు బానిస దాన్ని నువ్వు వేరొకరికి చెప్పిన క్షణమే నువ్వు ఆ రహస్యానికి బానిస అవుతావు కొంతమందికి ఒక వ్యసనం ఉంటుంది వాళ్ళు నీ దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి ఏమి చెప్పరు కానీ నీ గురించి అన్ని అడిగి తెలుసుకుంటారు.
(05:57) ఏంట్రా డల్గా ఉన్నావ్ ఇంట్లో ఏమైనా గొడవ అప్పులు ఏమైనా ఉన్నాయా నీకు ఆఫీస్ లో బాస్ తో ఎందుకు పడట్లేదు అని చాలా ఆప్యాయంగా అడుగుతారు. మీరు దాన్ని ప్రేమ అనుకొని మీ గుండె విప్పి వాడి ముందు పెడతారు. కానీ వాడు ఏం చేస్తాడో తెలుసా? మీరు వాడికి ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ను రేపు మీతో గొడవ వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా వాడతాడు.
(06:23) నలుగురిలో మీ తరువు తీయడానికి ఆ రహస్యాలని ఆయుధంగా మలుచుకుంటాడు. మీరు నమ్మి చెప్పిన మీ కుటుంబ సమస్యలను నలుగురి దగ్గర కూర్చుని ఛాయ తాగుతూ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక వెటకారంగా చెబుతాడు. మీకు ఆ విషయం తెలిసినప్పుడు గుండె ముక్కలు అవుతుంది. అవునా కాదా చెప్పండి దీనికి పరిష్కారం ఏంటి మరి నిజం మాట్లాడుకుందాం.
(06:49) ఈ రోజుల్లో ఎవరికీ మీ బాధ విని తీరిక లేదు 80% మంది మీరు కష్టాల్లో ఉన్నారంటే లోపల సంతోషపడతారు. మిగిలిన 20% మందికి మీరు ఎలా పోయినా అనవసరం అందుకే మీ ఆర్థిక సమస్యలు మీ భార్యా భర్తల మధ్య గొడవలు మీ ఆఫీస్ పాలిటిక్స్ ఇవి మీ మనసులోనే ఉంచుకోండి. ప్రతి ఒక్కరి ముందు మీ ధైర్యం ఓపెన్ చేయకండి. మీరు ఎంత మౌనంగా ఉంటే మీరు ఎంత మిస్టరీగా ఉంటే ఈ సమాజం మీకు అంత భయపడుతుంది.
(07:26) మీ గురించి అంతా తెలిసిపోతే మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా వాడేసుకుంటారు. మీ రహస్యాలను కాపాడుకునే ధైర్యం తెచ్చుకోండి. మూడవ సూత్రం కష్టకాలంలో కనిపించకుండా పోయే నీడలు చాణక్యుడు మనుషుల గురించి ఒక అద్భుతమైన సత్యం చెప్పాడు. జబ్బ పడినప్పుడు కరువు వచ్చినప్పుడు శత్రువులు దాడి చేసినప్పుడు మరియు స్మశానంలో ఎవరైతే నీ పక్కన నిలబడతారో వాడే నీ నిజమైన మిత్రుడు.
(07:56) ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మీ జేబులో క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు మీరు వీకెండ్ పార్టీలు ఇస్తున్నప్పుడు మీ చుట్టూ ఎంతమంది తిరిగారు? మీరే లోకం అన్నట్లు ఎంతమంది ప్రవర్తించారు కానీ మీకు ఒక ఆర్థిక కష్టం వచ్చినప్పుడు లేదా మీకు ఒక యక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా మీరు ఉద్యోగం పోయి మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ రోజు మీతో పాటు బిర్యానీలు తిన్న బ్యాచ్ లో ఏ ఒక్కడైనా నీకు నేను ఉన్నాను అని ముందుకు వచ్చాడా? మీ ఫోన్ లిఫ్ట్ చేశారా? కనీసం ఒక మెసేజ్ అయినా చేశారా? వెలుగు ఉన్నప్పుడు మన నీడ కూడా
(08:38) మనకంటే పెద్దగా కనిపిస్తుంది. కానీ చీకటి పడగానే ఆ నీడ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే మీ దగ్గర అధికారం హోదా డబ్బు ఉన్నప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండేవాళ్ళు మనుషులు కాదు వాళ్ళు అవకాశవాదులు మీ దగ్గర రసం ఉన్నంతవరకే వాళ్ళు పీల్చుకుంటారు. ఎప్పుడైతే మీరు ఖాళీ అవుతారో వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు.
(09:08) ఇందులో వాళ్ళ తప్పు లేదు తప్పు మీదే ఎందుకంటే పార్టీలు ఇచ్చినప్పుడు మీతో పాటు ఎంజాయ్ చేసిన వాళ్ళందరిని మీరు స్నేహితులు అనుకున్నారు కానీ నిజమైన స్నేహం ఎప్పుడు పార్టీల్లో పుట్టదు అది కష్టాల్లో పుడుతుంది. మీ కళ్ళు తెరవండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే కారణాలు చెప్పి తప్పించుకున్నారో వాళ్లే రేపు మీరు మళ్ళీ సక్సెస్ అయినప్పుడు మొదటి వరుసలో వచ్చి నిలబడతారు.
(09:39) అప్పుడు వాళ్ళను నమ్మకండి వాళ్ళను అక్కడే తొక్కేయండి మీ కన్నీళ్లు తుడవని చేతులు మీ సక్సెస్ లో చప్పట్లు కొట్టే అర్హత లేదు ఇది మనసుకు నాటుకునేలా గుర్తుపెట్టుకోండి. నాలుగవ సూత్రం నీ విజయాలను చూసి లోపల ఏడ్చే విషపు నవ్వులు నీకు తెలిసిన వారిలో అతి భయంకరమైన ద్రోహి ఎవరో తెలుసా బయటవాడు కాదు నీ ప్రతి ఎదుగుదలను చూసి లోపల కుల్లిపోయే నీ దగ్గరి మనిషి చాణక్యుడు స్పి చెప్పాడు నిప్పు కాలుస్తుందని తెలుసు కానీ అసూయ పడేవాడు కౌగిలించుకొని మరీ కాలుస్తాడు అని ఈ లక్షణాన్ని కనిపెట్టడం చాలా కష్టం కానీ ఒక చిన్న సైకలాజికల్
(10:25) ట్రిక్ చెప్తాను వినండి మీకు ప్రమోషన్ వచ్చినప్పుడో మీరు ఎప్పుడైనా ఏదైనా సాధించినప్పుడో లేదా మీ ఇంట్లో ఒక మంచి జరిగినప్పుడో మీరు ఎంతో ఆనందంగా వెళ్లి మీ బంధువులతోనో లేదా స్నేహితులతోన ఆ విషయం చెబుతారు. అప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే మొదటి రియాక్షన్ ని గమనించండి. వాళ్ళు పైకి ఇలా అంటారు అరే కన్స్రా చాలా ఆనందంగా ఉంది అని నవ్వుతారు కానీ ఆ నవ్వులో కళ్ళు నవ్వవు పెదాలు మాత్రమే సాగుతాయి.
(11:00) వాళ్ళు వాయిస్ లో ఒక రకమైన వణకు లోపల ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా అవును నీకు లక్కు ఉంది కాబట్టి నీకు వచ్చింది మాకుఎక్కడ ఉందిరా అదృష్టం అని ఒక సెటైర్ వేస్తాడు. ఆ సెటైర్ వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసా నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోయావు అని కడుపు మంట.
(11:28) ఇలాంటి వాళ్ళు పైకి ఏమి చేయలేరు కానీ అవకాశం దొరికినప్పుడు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా మాట్లాడతారు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అదంతా వర్కవుట్ అవ్వదురా మనకఎందుకు చెప్పు మనవల్ల కాదు అని మిమ్మల్ని భయపెట్టి కిందికి లాగుతారు. గుర్తుంచుకోండి మీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేని వాడు మీ కష్టానికి ఎప్పుడు తోడు రాడు వాళ్ళ చుట్టూ ఉన్న గాలి కూడా నెగిటివ్ గానే ఉంటుంది.
(11:57) వాళ్ళ మాటలు మీ మెదడులో విషం లాగా పనిచేస్తాయి. మీ లక్ష్యాలను మీ సక్సెస్ ను ఇలాంటి వాళ్ళ ముందు బయట పెట్టకండి. మీ ఎదుగుదల వాళ్ళకు కళ్ళ మంట పుట్టించేలా ఉండాలి. అంతేగానీ వాళ్ళ ముందు మీరు ప్రగల్భాలు పలకకండి. సైలెంట్ గా పని చేయండి మీ సక్సెస్ తోని వాళ్ళ చెంప పగలగొట్టండి. ఐదవ సూత్రం మీపై నెపన్ మోపే విక్టమ్స్ చివరిది మరియు అతి ముఖ్యమైనది.
(12:26) ఎవరైతే తమ తప్పులకు బాధ్యత తీసుకోకుండా ప్రతిసారి మీరే తప్పు చేసినట్లు మిమ్మల్ని నమ్మిస్తారో వాళ్ళు మీ మానసిక ప్రశాంతతను నాశనం చేసే అసలైన ద్రోహులు. మీరు గమనించే ఉంటారు ఒక గొడవ జరుగుతుంది. తప్పు 100 శాతం వాళ్ళదే ఉంటుంది. కానీ గొడవ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఎలా మాట్లాడుతారంటే తమ తప్పు జరగడానికి మీరే కారణం అన్నట్లు వాళ్ళు చాలా బాధపడుతున్నట్లు ఒక నాటకం ఆడతారు.
(12:54) మీరే వాళ్ళను మోసం చేసినట్లు క్రియేట్ చేస్తారు. చివరకు తప్పు చేయని మీరు వాళ్ళకి సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. చాణిక్యుడు దేని గురించే చెబుతూ తప్పు చేసినవాడు నిన్ను నిందిస్తున్నాడు అంటే వాడు నీ మనసు మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు అని అర్థం ఇలాంటి వాళ్ళు మీ ఆత్మ గౌరవాన్ని నెమ్మదిగా తినేస్తారు నేను ఏది చేసినా తప్పేనేమో నా వల్లే వీళ్ళు బాధపడుతున్నారేమో అనే అపరాధ భావనలోకి మిమ్మల్ని నెట్టేస్తారు.
(13:29) ఈ గిల్ట్ ఫీలింగ్ ఒక మనిషిని బతికుండగానే చంపేస్తుంది. దయచేసి వినండి మీరు ఎవరి కోసం బతుకుతున్నారు పదే పదే మిమ్మల్ని తప్పుపట్టే వాళ్ళ కోసమా మీ ప్రశాంతత లేకుండా చేసే బంధాల కోసమా ఒక [గురకలు] బంధం లేదా స్నేహం అనేది మీకు బలాన్ని ఇవ్వాలి మీరు ఆనందాన్ని నింపాలి. అంతేకానీ ప్రతీక్షణం మిమ్మల్ని నిరూపించుకునేలా చేసే బంధం ఒక నరకంతో సమానం.
(13:56) తప్పు వాళ్ళది అయినప్పుడు కరాకండిగా చెప్పండి వాళ్ళు ఏడ్చినా అరిచినా డ్రామాలు చేసినా కరగకండి మీ మానసిక ప్రశాంతత కంటే ఈ ప్రపంచంలో ఏ బంధము గొప్పది కాదు వాళ్ళను వదిలించుకోవడానికి భయపడకండి మిత్రమా ఈ ఐదు రకాల మనుషులు భూతం లాగా ఎక్కడి నుంచో రారు. వీళ్ళు మన చుట్టూనే మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. బహుశా ఈ పాటికే మీ కళ్ళ ముందు కొంతమంది ముఖాలు మిగిలి ఉంటాయి కదా ఒక విషసర్పం మన ఇంట్లో ఉందని తెలిసాక కూడా దానికి పాలు పోసి పెంచితే అది ఎప్పటికైనా మనల్నే కాటేస్తుంది.
(14:35) ఈ నకిలి మనుషులు ఈ వెన్నుపోటు పొడిచే ద్రోహులు కూడా అంతే వాళ్ళని భరించాల్సిన కర్మ మీకు లేదు చాలా మందికి ఒక భయం ఉంటుంది. వీళ్ళందరిని దూరం పెడితే నేను ఒంటరివాడిని అయిపోతానేమో అని నేను ఒక మాట చెబుతాను గుండెల్లో చెక్కేసుకోండి 100 మంది నకిలి కుక్కల మధ్య బతకడం కంటే ఒక సింహం లాగా అడవిలో ఒంటరిగా బతకడం వంద రెట్లు మేలు ఒంటరితనం మీకు మిమ్మల్ని పరిచయం చేస్తుంది.
(15:04) కానీ ఈ నకిలి బంధాలు మీ ఆత్మస్థేన్ని చంపేస్తాయి. ఈరోజే నిర్ణయం తీసుకోండి. మీ ఫోన్ బుక్ ఓపెన్ చేయండి. మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని వాడుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని వెనకకు లాగుతున్నారో వాళ్ళను మీ జీవితం నుంచి కట్ చేయండి. కొద్ది రోజులు బాధ ఉంటుంది కానీ ఆ తర్వాత మీకు దొరికే ప్రశాంతత ముందు ఈ ప్రపంచంలో ఏది సాటి రాదు.
(15:32) భయం వదిలేయండి నిలబడండి మిమ్మల్ని కిందికి లాగే వాళ్ళను వదిలించుకొని మీరేంటో ఈ ప్రపంచానికి చూపించండి. చూసారుగా మిత్రులారా గతాన్ని వదిలేసి మీలోని అనంతమైన శక్తిని నమ్మండి. కాలం మనల్ని పరీక్షించినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడడమే అసలైన గెలుపు. ఈ వీడియో మీకు ఒక్క శాతం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ప్రోత్సాహం అవసరమైన మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు దీన్ని తప్పకుండా షేర్ చేయండి.
(16:02) అలాగే మీ అనుభవాలను మీ జీవితంలో జరిగిన సంఘటనలను కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని గుండెను తట్టిలేపే ఎమోషనల్ మరియు ఇన్స్పైరింగ్ వీడియోల కోసం మన గాలక్సీ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు జైహింద్.
No comments:
Post a Comment