ఉన్నతమైన వ్యక్తులు ఎప్పటికీ చేయని పనులు
Author Name:Srinivas Tenkurala
Youtube Channel Url:https://www.youtube.com/@srinivastenkurala6811
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tz8PjqsYVNE
Transcript:
(00:00) మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా చాలామంది ఉన్నతంగా ఎదగాలని ఉన్నతంగా ఉండాలని చాలా పెద్ద పొజిషన్ లో ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అలా ఉండాలి అంటే మన యొక్క ప్రవర్తన చాలా ఉపయోగమని చాలా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు మిత్రులారా అయితే ఉన్నతమైన వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో సారాంశం మిత్రులారా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను.
(00:25) మీరు కూడా ఉన్నతమైన వ్యక్తుల్లాగా ఆలోచించి వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి వాటికి దూరంగా ఉన్నారు అని తెలుసుకొని మీరు కూడా అలాంటి వాటికి దూరంగా ఉండండి మిత్రులారా ఉన్నతమైన వ్యక్తులు ఎప్పటికీ చేయని పనుల గురించి మీకు చెప్తాను మిత్రులారా వాటిని మీరు ఆచరించండి మీరు కూడా అలాగే చేయండి. థింగ్స్ హై క్లాస్ పీపుల్ నెవర్ డూ ఇవి చేయరంట మిత్రులారా ఉన్నతమైన వ్యక్తులు ఎప్పటికీ ఇలాంటి పనులు చేయరంట మీరు కూడా అలాంటి పనులు చేయకండి.
(00:49) ఆ పనులు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రులారా. సమాజంలో హై క్లాస్ లేదా ఉన్నతమైన వ్యక్తులు అంటే కేవలం కోట్ల రూపాయలు ఆస్తి లగ్జరీ కార్లు బ్రాండెడ్ బట్టలు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు మిత్రులారా నిజమైన ఐ క్లాస్ అనేది ఒక మనిషి ఆలోచన విధానం అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళ యొక్క ప్రవర్తన మరియు సంస్కారంలో ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి.
(01:09) ఎంత డబ్బు ఉన్నా సంస్కారం లేకపోతే వారిని ఎవరు గౌరవించరు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి మిత్రులారా. అదే సమయంలో రూపాయి లేకపోయినా కూడా ఉన్నతమైన విలువలు ఉంటే సమాజం వారి ముందు తలవంచుతుంది అన్న సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి. మరి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరిన వారు అందరి చేత గౌరవించబడే వ్యక్తులు తమ జీవితంలో ఎప్పటికీ చేయని ఆ పనులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం మిత్రులారా.
(01:32) ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం గాసిప్స్ అలాగే వాళ్ళు మాట్లాడరు మిత్రులారా. ఇతరుల గురించి చెడుగా ఎప్పుడు కూడా మాట్లాడరంట. అంటే సాధారణమైన వ్యక్తులు మనుషుల గురించి మాట్లాడుకుంటారు. ఉన్నతమైన వ్యక్తులు ఐడియాస్ గురించి మాట్లాడుకుంటారంట మిత్రులారా మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని ఐడియాస్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను మిత్రులారా ఉన్నతమైన ఆలోచనలు గల వ్యక్తులు ఎప్పుడూ ఒకరి వెనక కూర్చొని చాడీలు చెప్పడం ఇతరుల వ్యక్తి గత జీవితాలను విమర్శించడం వంటి పనులు చేయరంట మిత్రులారా.
(01:59) ఎవరినో తక్కువ చేసి మాట్లాడడం వల్ల తమ స్థాయి పెరగదని వారికి తెలుసు. వారు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం పై తమ లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెడతారంట మిత్రులారా మీరు కూడా అలా ఎదగండి. అలాగే ఇది మొదటి పాయింట్ మిత్రులారా రెండో పాయింట్ ఏంటంటే సమయాన్ని వృధా చేయాంట మిత్రులారా ఉన్నతమైన వ్యక్తులు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయాంట.
(02:19) డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మిత్రమా గుర్తుపెట్టుకో గడిచిన సమయం తిరిగి రాదని వారు బలంగా నమ్ముతారు ఉన్నతమైన వ్యక్తులు నమ్ముతారు. మీరు కూడా అలాగే నమ్మండి. అందుకే హై క్లాస్ పీపుల్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో గంటల తరబడి పనికిరాని రీల్స్ చూడడం అనవసరమైన వాదనలో దిగడం వంటి పనులు ఎప్పటికీ చేయరంట మిత్రులారా మీరు కూడా అలా చేయకండి ప్రతి నిమిషాన్ని తమ ఎదుగుదల కోసం లేదా తమ కుటుంబం కోసం ఉత్పాదకరంగా ఉండడం కోసం ప్రొడక్టివ్ ఎలా ప్రొడక్టివ్ గా ఎలా వాడుకోవాలో వాళ్ళ సమయాన్ని వాళ్ళకి తెలుసు మిత్రులారా మీరు
(02:52) కూడా ఆ సమయాన్ని తెలుసుకొని మీరు కూడా ప్రొడక్టివిటీ గా ఎదగండి ఉన్నతంగా ఎదగండి మిత్రులారా అలాగే మూడో పాయింట్ ఏంటంటే ప్రగల్పాల్ పడకడం లేదా షో అప్ చేయడం వాళ్ళకి రాదంట మిత్రులారా వాళ్ళు చేయారంట ఎప్పటికీ కూడా నిజానికి నిజమైన సింహానికి తాను సింహాన్ని గర్జించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఏమంటారు మిత్రులారా నిజమైన సింహానికి తాను సింహాన్ని గర్జించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు నమ్ముతారు మిత్రులారా అలాగే నిజమైన ఉన్నత స్థాయి వ్యక్తులు తమ దగ్గర ఉన్న డబ్బును లేదా బంగారాన్ని లేదా ఓదాను ఇతరులకు చూపించి అహంకారాన్ని ప్రదర్శించరండి మిత్రులారా
(03:26) వారి దుస్తులు వారి యొక్క ప్రవర్తన చాలా సరళంగా సింపుల్ చాలా ఎలిజెంట్ గా ఉంటాయంట మిత్రులారా వారి సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందంట మీరు కూడా మీ సక్సెస్ తోనే మాట్లాడండి మాట్లాడండి. ప్రపంచాన్ని ఎవరిని కూడా చిన్నగా చూడకండి. మీ సక్సెస్ మాత్రమే 10 మందికి చూసినప్పుడు వారే మీకు అద్దనకుండా మీకు విలువ ఇస్తారు మిత్రులారా మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగండి.
(03:49) అందుకోసమనే మిత్రులారా మీరు కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉన్నతమైన వ్యక్తులు పాటించే నాలుగో పాయింట్ ఏంటంటే పరిస్థితులను లేదా ఇతరులను నిందించడం వాళ్ళు చేయరంట మిత్రులారా పరిస్థితులను లేదా ఇతరులను నిందించడం బ్లేమ్ చేయడం వాళ్ళు చేయరంట అంటే వాళ్ళ ఓటమికి వేరే వాళ్ళు కారణం అని వాళ్ళు చూపించారంట మిత్రులారా జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నా అదృష్టం బాగా లేదనో మా నాన్న దగ్గర డబ్బు లేదనో ప్రభుత్వం బాగా లేదనో అంటూ ఇతరులపై నేపం నెట్టేస్తారు.
(04:20) కానీ ఉన్నతమైన మనస్తత్వం ఉన్నవారు తమ తప్పులకు పూర్తి బాధ్యత వహిస్తారు. ఓటము నుంచి పాఠాలు నేర్చుకుంటారే తప్ప ఎప్పుడు విక్టిమ్ కార్డ్ అంటే ప్లే చేయరు మిత్రులారా వేరే వాళ్ళ మీద బాధ్యతను వదిలేయరు. ఫెయిల్యూర్ గురించి ఫెయిల్యూర్ ఎదురైన వేరే వాళ్ళను బ్లేమింగ్ చెయ్యరంట మిత్రులారా ఉన్నతమైన వ్యక్తులు. మీరు కూడా ఉన్నతమైన వ్యక్తుల్లాగా ఆలోచించి మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా.
(04:44) అలాగే ఉన్నతమైన వ్యక్తులు పాటించే ఐదో పాయింట్ ఏంటంటే అగౌరవంగా ప్రవర్తించడం అంటే అగౌరవంగా ప్రార్తించడం అంటే వేరే వాళ్ళని చిన్నచూపు చూడడం లాంటిది చేయరండి మిత్రులారా ఒక మనిషి యొక్క అసలైన క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా తనకంటే తక్కువ ఓదాలో ఉన్నవారితో ఉదాహరణకు ఒక హోటల్ సర్వర్ లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లేదంటే ఒక డ్రైవర్ అతని దగ్గర అతను ఎలా ప్రవర్తిస్తాడో చూసినప్పుడు ఉన్నతమైన వ్యక్తులు ఎవరిని తక్కువ చేసి చూడరు మిత్రులారా వాళ్ళను చాలా బాగా చూసినప్పుడు మాత్రమే వాళ్ళ వారిని ఉన్నతమైన వ్యక్తులు అంటారు. ఒక డ్రైవర్ ని డ్రైవర్ లాగా
(05:17) చూడడం, ఒక సెక్యూరిటీ గార్డ్ ని చిన్నగా చూడడం, ఒక సర్వేర్ ని చిన్నగా చూడడం వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగరు మిత్రులారా ఉన్నతమైన వ్యక్తులు వారు కూడా మనుషులని గౌరవిస్తారంట వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మనుషులాగే చూస్తారంట మిత్రులారా. ఎవరిని తక్కువ చేసి చూడరంట వాళ్ళు. అందుకోసమని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కనీసం గౌరవాన్ని వాళ్ళు ఇస్తారంట.
(05:38) మీరు కూడా అలాగే గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే మర్యాద ఇవ్వడం వల్లే మనకు మర్యాద దక్కుతుందని వారు నమ్ముతారు మీరు కూడా అలాగే నమ్మండి. అలాగే ఉన్నతమైన వ్యక్తులు పాటించే ఆరో పాయింట్ ఏంటంటే నేర్చుకోవడం ఎప్పుడూ ఆపేయడంట మిత్రులారా. వాళ్ళు నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఆపేయడం అని వాళ్ళ డిక్షనరీలో ఉండదంట మిత్రులారా. నెవర్ స్టాప్ లెర్నింగ్.
(06:00) అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు అన్ని తెలుసు అనుకునేవాడు ఎప్పటికీ ఎదగలేడు. నాకు అన్ని తెలుసు అనుకునే వాడు ఎప్పటికీ ఎదగలేడు మిత్రులారా. అందుకోసమని. హై క్లాస్ పీపుల్ ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా హై క్లాస్ పీపుల్ ఎంత ఉన్నతమైన వ్యక్తులు ఎప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పుడు ఒక విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. మీరు కూడా అలాగే నేర్చుకుంటూనే ఉండండి.
(06:21) వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారంటే ఎప్పుడు కూడా పుస్తకాలు చదవడం మంచి విషయాలు వినడం తమ రంగంలో అప్డేట్ అవ్వడం వారి దినచర్యలో భాగమే జ్ఞానమే నిజమైన సంపదని వారు భావిస్తారు మిత్రులారా మీరు కూడా అలాగే భావించండి. ఉన్నతమైన జీవితం అనేది పుట్టుకతో రాదు. మనం అలవర్చుకునే అలవాట్లతో వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా ఈ రోజు నుంచే మీరు అనవసరమైన కబుర్లకు సమయాన్ని వృధా చేసి మీ యొక్క పనులకు అహంకారానికి స్వాస్ సమయాన్ని వృధా చేసే పనులకు అహంకారానికి స్వాస్తి చెప్పండి.
(06:50) మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగండి. మీ యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీ జీవితం ఆటోమేటిక్ గా అద్భుతంగా మారుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా మీరు ఈ వీడియోలో చెప్పిన ఈ సత్యాలను గౌరవించి వీటిని ఆచరణలో పెట్టి మీరు కూడా ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్
(07:20) చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు
No comments:
Post a Comment