అర్జునుడికి అవసరమైనప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అతనికి ఎందుకు ఇవ్వలేదు?
" శంఖభృన్నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః " విష్ణుసహస్రనామాలలోని అద్భుత నామాలు.
చక్రం అనేది బహుమతిగా ఇచ్చే ఒక జడ వస్తువు కాదు. అది విష్ణు అంశ. అది చైతన్యం. చక్రం ఒక షడ్భుజి మధ్యలో ఉంటుంది, దానికి పదహారు చేతులు ఉంటాయి. అది ఒక తేజోవంతమైన పురుష దైవ స్వరూపం.
విష్ణు పురాణం ప్రకారం, " దాని మూల స్వభావం అగ్ని తత్వం ". నిజానికి, విష్ణువు యొక్క ఇతర ఆయుధాలైన శంఖం, ఖడ్గం, ధనుస్సు మరియు గద కూడా జడ వస్తువులు కావు. మనం వాటిని చిత్రాలలో వస్తువులుగా చూసినప్పటికీ, అవి చైతన్యవంతమైన ఆయుధాలు. అవి భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు గాలి అనే పంచభూతాలకు ప్రతీకలు. విష్ణువు సర్వవ్యాపి, ఆయన చేతిలో పంచభూతాలు ఉంటాయి.
శంఖం, చక్రం, గద, నందకం పురుషదేవతలు. ఒక్క శాంగము/ధనుస్సు మాత్రం స్త్రీ దేవత పద్మంలా ఎర్రగా ఉంటుంది. ప్రకాశిస్తూ ఉంటుంది.
ఇది కాలరూపం ధనుశ్శాంతం.
విష్ణువు వాటిని చేతులలో పట్టుకుని ఉండరు అస్తమానూ, మనం చిత్రాలలో చూస్తూన్నట్లుగా, మోయవలసిన అవసరం కూడా లేదు. కేవలం తలచుకుంటే చాలు, అవి ఆయన చేతిలో ప్రత్యక్షమవుతాయి. అవసరాన్ని బట్టి అవి విష్ణువును అనుసరిస్తాయి.
ఇది మనం గజేంద్రమోక్షంలో చదివాము. అంబరీషోపాఖ్యానంలో చక్రం దూర్వాసుని వెంటబడి ముల్లోకాలూ పరిగెత్తించడం చదివాం.
శుభమస్తు
No comments:
Post a Comment