Monday, October 19, 2026

40 - 50 ఏళ్లు దాటిన వారు BP, SUGAR దెబ్బకు కంట్రోల్ అవుతుంది..? | CL Venkat Rao | Health Talks

40 - 50 ఏళ్లు దాటిన వారు BP, SUGAR దెబ్బకు కంట్రోల్ అవుతుంది..? | CL Venkat Rao | Health Talks

Author Name:V2K Health Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@V2KHealthPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dVVfo9lYxcc





Title: 40 - 50 ఏళ్లు దాటిన వారు BP, SUGAR దెబ్బకు కంట్రోల్ అవుతుంది..? | CL Venkat Rao | Health Talks

Author Name: V2K Health Podcast

Description: Watch► 40 - 50 ఏళ్లు దాటిన వారు BP, SUGAR దెబ్బకు కంట్రోల్ అవుతుంది..? | CL Venkat Rao | Health Talks

#v2khealthpodcast #clvenkatarao #wifeandhusband #healthtips #healthtipstelugu

*Welcome to V2K Health Point! 🩺❤️*

V2K Health Point is your trusted destination for *health awareness, expert doctor advice, health podcasts, natural remedies, nutrition, and healthy lifestyle tips.*

Our goal is to provide easy-to-understand and useful health information through *experienced doctors, medical experts, healthcare professionals, and informative health discussions.*

On this channel, you can find:

🔹 Expert Health Tips from Experienced Doctors
🔹 Doctor Interviews & Health Podcasts
🔹 Medical Awareness & Disease Prevention
🔹 Diabetes, Blood Pressure & Cholesterol Tips
🔹 Heart, Liver & Kidney Health
🔹 Thyroid, PCOS & Women's Health
🔹 Men's Health & Wellness
🔹 Pregnancy & Child Health Information
🔹 Weight Loss & Healthy Diet Tips
🔹 Nutrition & Immunity Tips
🔹 Natural Remedies & Home Health Tips
🔹 Yoga, Exercise & Fitness Tips
🔹 Healthy Lifestyle & Daily Wellness Tips
🔹 Common Health Problems, Symptoms & Precautions

At **V2K Health Point**, we believe that the right health information can help people make better and healthier lifestyle choices.

📌 *Subscribe to V2K Health Point* for informative health videos, expert doctor interviews, podcasts, natural health tips, nutrition advice, and wellness content.

🔔 Turn on the notification bell so you never miss our latest health updates!

*Disclaimer:* The information provided on this channel is for general health awareness and educational purposes only. It should not be considered a substitute for professional medical advice, diagnosis, or treatment. Always consult a qualified healthcare professional for your individual health concerns.

Transcript:
(00:02) హాయ్ ఆల్ వెల్కమ్ టు బి టుకే ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావ్ మాజీ సభ్యుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్ తో మాట్లాడి అంటే మనకి ఇప్పుడు ఎక్కువ కేసెస్ థైరాయిడ్ మీద వస్తున్నాయి. అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒకవేళ థైరాయిడ్ వస్తే ఎలా తగ్గించుకోవాలి నాచురల్ వే ఏమైనా ఉందా సర్ ని అడిగి తెలుసుకుందాం.
(00:20) హలో సార్ హలో సర్ ఇప్పుడు చూసుకుంటే కేసెస్ మోస్ట్లీ ఫిమేల్స్ అండ్ మేల్స్ కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చి సో వన్స్ థైరాయిడ్ వచ్చిందనుకో ఐదర్ వస్తే ఓవర్ వెయిట్ వచ్చేస్తారు. లేదు అనింటే వెయిట్ లాస్ అవ్వడం జరుగుద్ది. అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీసన్స్ ఏమై ఉండొచ్చు సార్ ఇప్పుడు థైరాయిడ్ అనగానే అసలు మనకి ఎవరు గుర్తుపట్టలేని లక్షణాలు ఉంటాయి.
(00:47) ఆ థైరాయిడ్ గ్రంధి అనేది మెడ ముందు భాగాన సీతాకోకు చిలుక ఆకారంలో ఉంటుంది. అది కనపడదు అది పెరిగినప్పుడు ఒక రౌండ్ షేపో అంటే మొత్తం పెరగదు సీతాకోక చిలుక ఆకారంలో ఉన్నా దాంట్లో చిన్న చిన్న గడ్డల రూపాన ఉంటాయి. లేదా మెడ ముందు భాగాన ఒక గడ్డ ఉంటుంది. ఇది విశేషం ఏంటంటే మనం గుటక వేసినప్పుడు ఆ గడ్డ ఉంటుంది కదా పైకి కిందకి కదులుతుంది. ఏదైనా మెడ ముందు భాగాన గుటక వేసినప్పుడు పైకి కిందకి కదులుతుంది అంటే అది థైరాయిడ్ కి సంబంధించిన గడ్డ అని మనం బండ గుర్తు గుడ్డి గుర్తు అసలు థైరాయిడ్ అనేది కొంతమందికి ఒక అపోహ
(01:32) ఉంది. నేను ఎవరనా ఫోన్ చేస్తే థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకో అంటే నాకు థైరాయిడ్ లేదండి అంటాడు. నేను మగాడిని కదా నాకు థైరాయిడ్ ఎందుకు వస్తది ఇది ఆడోళ్ళకి కదా అని వాడే చెప్తాడు. ఇంకోటి ఏమంటాడు నాకు మెడ ముందు ఏమి గెడ్డ ఏమ లేదండి ఎందుకు థైరాయిడ్ పరీక్ష చేయించమంటున్నావ అంటాడు. మెడ మీద ఎటువంటి వాపు గడ్డ లేకుండా కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
(02:00) థైరాయిడ్ అధికంగా పనిచేసే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దీన్నే వైద్య పరిభాషలో థైరోటాక్సికోసిస్ అంటారు. ఇది చాలా తక్కువ 100లో 2 శాతమ శాతం ఉంటారు చాలామందికి సమాజంలో ఉండేది థైరాయిడ్ గ్రంధి లోపము ఈ లోపానికి సంబంధించి మనకి అర్థం కాదు అనేక రకాలుగా బయటపడుతుంది. అసలు ఈ లక్షణాలను ఈ థైరాయిడ్ కి లింక్ పెట్టుకోలేరు. మ్ డాక్టర్లు కూడా దీని మీద అంత దృష్టి సారించరు.
(02:42) సమాజంలో సుమారుగా స్త్రీలలో 20% మందికి థైరాయిడ్ గ్రంధి లోపం ఉంటుంది. అదే పురుషుల్లో 10 శాతం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో శరీరానికి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవసరం పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆడపిల్ల రజస్వల అయినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అధికం కావలసిన అవసరం శరీరం అధికంగా ఉత్పత్తి చేయాలి. అట్లాగే గర్భవతి అయినప్పుడు బాలింతగా ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవసరం ఉంటుంది అధికంగా చేయాల్సిన అవసరం ఉంటుంది.
(03:16) అలాగే 45 సంవత్సరాలు పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన సమయంలో చాలామందికి ఈ థైరాయిడ్ లోపం అనేది దాపురిస్తుంది. మ్ కనుక స్త్రీలు అసలు ఏ లక్షణము లేకపోయినా సంవత్సరానికి ఒకసారి ఈ థైరాయిడ్ పరీక్షని మాస్టర్ హెల్త్ చెకప్ లో భాగంగా చేసుకోవడం మంచిది. టిఎస్హచ్ నే రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇక లక్షణాలు అంటూ కొన్ని ప్రస్పుటంగా ఉంటాయి.
(03:50) కానీ సమాజంలో చాలామందికి ఈ లక్షణాలకి థైరాయిడ్ కి లింక్ ఉన్నది అని తెలవదు. హమ్ ఇప్పుడు స్త్రీలలో ఆడపిల్ల 17 18 ఏళ్ళు వచ్చినా కూడా రజస్వలు అవ్వదు. లేదు రజస్వలు అయిన తర్వాత మూడు నెలలకి ఆరు నెలలకు గాని పీరియడ్స్ రావు. మ్ ఇక పీరియడ్స్ వచ్చినప్పుడు పొత్తి కడుపులో నొప్పి నరకయాతన లేదు కొంతమందికి పొట్టకి స్కానింగ్ చేస్తే అండకోశంలో నీటి పుడకలు ఇక తదుపరి ఘట్టం పెళ్లిఅయిన తర్వాత పిల్లలు పుట్టరు.
(04:24) మ్ పిల్లలు పుట్టని దంపతులు ఇద్దరూ లేడీ డాక్టర్ దగ్గరికో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళద్దరికీ చేయించేది ఏంటంటే ఇద్దరికీ షుగర్ పరీక్ష థైరాయిడ్ పరీక్ష ఇస్తారు. థైరాయిడ్ గ్రంధి లోపము వల్ల పురుషుడికి వీర్యకణాల సంఖ్య వీర్యకణాల చలనంపై ప్రభావం పడుతుంది. ఈ స్త్రీకి అండకోశంలో నీటి పుడగలు ఉండటము అండకోశమ నుంచి సకాలంలో అండము విడుదల ఓవం అంటే గుడ్డు విడుదల కాకపోవడం జరుగుతుంది.
(04:55) తర్వాత పీరియడ్స్ అసలు క్రమబద్ధంగా రావు. కొంతమందికి నెలలోనే మూడు సార్లు రెండు సార్లు రావటం కొంతమందికి మూడు నెలలు ఆరు నెలలు రాకపోవటం వచ్చినప్పుడు పొత్తి కడుపులో నొప్పి ఇక కొంతమందికి ఐదు రోజుల్లో కూడా కొద్దిగానే రక్తస్రావం జరుగుతుంది. కొంతమందికి విపరీతంగా రక్తస్రావం జరిగి వాళ్ళకి రక్తహీనత అపరిస్తుంది. ఈ రకంగా పీరియడ్స్ ఎవరికైనా సక్రమంగా రాని పక్షంలో 28 రోజులకో ఒకసారి సరిగ్గా రాకపోతే దాది థైరాయిడ్ గ్రంధి లోపం వల్ల రావచ్చు.
(05:35) తర్వాత ఓళ్ళు నొప్పులు కండరాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు దానికి పరిష్కారం మన సొంత వైద్యం మందుల షాప్ కి వెళ్లి నొప్పి టాబ్లెట్లు వాడటం కాదు నొప్పి టాబ్లెట్లు వాడితే ఇక మూత్ర పిండాలు మన సొంతం కాదు అయిపోయినట్టే కనుక ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఎవరికైనా ఉంటే థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి థైరాయిడ్ తో పాటు ఈ ఒళ్ళ నొప్పులవాళ్ళు కండరాల నొప్పులవాళ్ళు రక్తంలో యూరిక్ యసిడ్ అనే ఒక పరీక్ష చేయించుకోవాలి.
(06:06) యూరిక్ యసిడ్ ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటే కాలు బొటనవేలు దగ్గర నొప్పి ప్రారంభం అవుతుంది. అందరికీ అక్కడే ప్రారంభం అవుతుంది బొటనవేలు నొప్పి వాపుతో ప్రారంభం అన్ని కీళ్లకు పాకుతుంది. కనుక కండరాల నొప్పులు ఈ కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ యూరిక్ యసిడ్ తో పాటు షుగర్ అనేది మనకి ఏ లక్షణాలు ఉండవు.
(06:34) వారసత్వంగా అమ్మ నాన్న తాత అమ్మమ్మలకు ఉంటే అది వచ్చే అవకాశం ఉంది. అమ్మ నాన్నకు లేకపోయినా వారసత్వంగా లేకపోయినా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే 30 40 ఏళ్లకే మన ఆహారపు అలవాట్లు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల షుగర్ వచ్చేస్తాఉంది. షుగర్ కూడా ఏమి లక్షణాలు ఉండవు. షుగర్ తొలి లక్షణమే కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కావచ్చు.
(07:01) ఈ విధంగా థైరాయిడ్ కి శరీరం యొక్క పనితీరు వివిధ అవయవాల పనితీరు ముఖ్యంగా ఈ జననేంద్రియాల పనితీరు అట్లాగే కొంతమంది పురుషులకి మగధనం లోపిస్తుంది. ఈ మగధనము లోపించడానికి థైరాయిడ్ కి లింక్ ఉంది. మ్ ఆ వృషణాల నుంచి గోలికాయల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి కావాలి. మ్ అది సమపాళలో ఉత్పత్తి కాకపోతే వీర్యకణాల ఉత్పత్తి వీర్యకణాల చలనం అలాగే పిల్లలు పుట్టాలన్న కూడా ఇబ్బంది ఉంటుంది కనుక థైరాయిడ్ కి మగతనానికి పిల్లలు లేకుండా ఉండటానికి సంబంధం ఉంది.
(07:49) మ్ ఈ థైరాయిడ్ కి ముడిసరికి ఏంటి థైరాయిడ్ నుంచి హార్మోన్ ఉత్పత్తి అవ్వాలంటే అయోడిన్ అయోడిన్ మనకి ఎక్కడ లభిస్తుంది మన ఉప్పులో లభిస్తుంది. అవును అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలి. అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు కాకుండా వేరే ఉప్పు వాడితే అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయక థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి లక్షణాలు అవలక్షణాలు అన్నీ వస్తాయి.
(08:15) మనకు మార్కెట్ లో భారత కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉప్పు ప్రతి ఒక్కరు కూడా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పునే అమ్మాలి. రకరకాల కంపెనీలు ఉన్నాయి నా స్వీయ అనుభవంలో అది టాటా అయోడైజ్డ్ ఉప్పు అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు గత 30 సంవత్సరాలుగా అయోడిన్ కలిపి నాణ్యత ప్రమాణాలతో అందిస్తున్నారు గనుక ఏదో పిచ్చి కంపెనీ ఉప్పు వాడేకంటే టాటా అయోడైజ్డ్ ఉప్పు అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పుని తెచ్చి ఇది మాత్రమే విధిగా మన ఇంట్లో వాడితే థైరాయిడ్ లోపం వచ్చే అవకాశాలు తక్కువ కనుక అనుమానముతోనే పరీక్ష చేయించుకోవాలి గానీ లక్షణాలు వచ్చే వరకు నీ మెడ ముందు గడ్డ ఏర్పడే వరకు వేచి
(09:01) ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు ఏమాత్రం అనుమానం ఉన్నా ఒకసారి దీనికిఏమి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫీజ్ కట్టి లాబరేటరీకి వెళ్ళవలసిన అవసరం లేదు మనం సొంతంగా ఒక ప్రముఖ లాబరేటరీకి వెళ్లి నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి అనే హక్కు రోగికి ఉంటుంది మన పౌరులకు ఉంటుంది గనుక మనం సొంతం అడిగేందుకు దీనికి మళ్ళీ ఆయన రాసి ఇచ్చింద డాక్టర్ ఫీస్ ఎందుకు అవసరం లేదు కొంతమందికి తెలవదు.
(09:29) డాక్టర్ రాస్తే గాని లాబరేటరీలో చేయరనే ఒక అపోహ ఉన్నది కనుక మనందంతరగా మనం లాబరేటరీలకి వెళ్లి టెస్ట్లు చేసుకునే హక్కు మనకు పోర్లకు ఉందని గమనించాలి. సర్ నార్మల్ గా కొంతమంది మెడిసిన్స్ వాడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించారన్నమాట. ఏదనా హోమ్ రెమిడీ ఇంట్లోనే ఏదైనా చేసుకొని తగ్గించుకునే విధానం ఏమ ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
(09:51) అంటే మనం ఈ థైరాయిడ్ ఒకవేళ రాకుండా అండ్ వచ్చినా గాని ఇంట్లో ఏమనా చిన్న చిన్న చిట్కాలు ఏమనా ఉంటాయా సార్ నన్ను చాలా మంది అడుగుతారు సార్ థైరాయిడ్ రాగానే థైరోనార్ అని లేకతే థైరాయిడ్ టాబ్లెట్లు 25 మైక్రోగ్రామలు 50 మైక్రోగ్రామలు 75 100 వాడుతున్నాం కదా దీని బదులుగా హోమియోపతీ గాని ఆయుర్వేదం గాని చిట్కాలు గాని నాచురోపతీ గాని యునానిీ గాని ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంటారు.
(10:18) హమ్ అసలు ఈ టాబ్లెట్ వాడకుండా గృహ వైద్యాలు చిట్కాలు ఉన్నాయా అని అడుగుతారు ఇంతవరకు నమ్మశక్యమైన ప్రత్యామనాయ వైద్య విధానాలు అందుబాటులో లేవు. నాకు ఆయుర్వేదం నేను ఇంగ్లీష్ డాక్టర్ అయినా ఆయుర్వేదం అన్నా హోమియోపతీ అయినా ఆయుషు వైద్య విధానం అన్నా ప్రకృతి విధానం అన్నా నాకు అపారమైన నమ్మకం విశ్వాసం ఉన్నా కూడా థైరాయిడ్ గ్రంధి లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ టాబ్లెట్లు వాడడం తప్పనిసరి వాడని పక్షంలో అనేకమైన అనర్థాలకు దారి తీస్తుంది.
(10:55) అదృష్టం ఏంటంటే ఈ థైరాయిడ్ టాబ్లెట్లు ఖరీదు చాలా తక్కువ నిరుపేదలు కూడా అందుబాటులో ఉన్న వైద్యం కనుక ప్రయోగాలు చేయకుండా ఆయుష్యు వైద్య విధానంలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్న ఇంకా శాస్త్రీయత నిరూపణ జరగని కారణం వల్ల థైరాయిడ్ టాబ్లెట్లు ఇంగ్లీష్ మందులు అల్లోపతీ మందులే కొనుక్కుని వాడవలసిందిగా తప్పనిసరిగా కొంతమంది తెలివితేటలు ఎక్కువ టాబ్లెట్లు మొదలు పెడతారు మళ్ళీ ల్యాబ్ కి వెళ్తారు ల్యాబ్ కి వెళ్తే రిపోర్ట్ నార్మల్ ఆ భుజాలు ఎగరేసుకుంటూ ఆనందంగా సంతోషంగా నా థైరాయిడ్ తగ్గిపోయింది తగ్గిపోయింది అని వస్తారు. అది తగ్గిపోవడం కాదు నువ్వు
(11:40) థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతున్న కారణం వల్ల సాధారణ స్థితికి వచ్చింది. నార్మల్ వచ్చింది నీ జబ్బు తగ్గలేదు. డోసులు మారతాయి కొన్ని సందర్భాల్లో పెంచవలసిన అవసరం ఉంటుంది తగ్గించవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభిస్తే జీవితకాలం తప్పనిసరిగా వాడాలి కనుక మీకు దండం పెట్టి చెప్తున్నా ఒక్కసారి థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించిన తర్వాత మీరు మానొద్దు అలా మానటం వల్ల మళ్ళీ మూడు నుంచి ఆరు నెలల్లో నేను ఉన్నాను అని గుర్తు చేస్తూ మళ్ళీ మీ థైరాయిడ్త4 యధార్థత స్థితికి చేరుతుంది ఆ విధంగా మీరు నార్మల్ కి వచ్చిందంటే టాబ్లెట్ వాడటం
(12:28) వల్ల నార్మల్ ఉందని గమనించవలసిందిగా ప్రారంభించిన థైరాయిడ్ టాబ్లెట్ జీవితకాలం వాడవలసిందిగా మీకు దండం పెట్టి మీకు చెబుతున్నాను వాడండి ఈ రకంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండండి. సర్ అంటే ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ ఇది సో 50 60 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళు సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది కామెంట్ చేశారు దానికి మీరు ఏమంటారు సార్ ముఖ్యంగా స్త్రీలు సాధారణంగా 45 ఏళ్ళ వచ్చేసరికి పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి మ్ ఈ మహిళలు తెలిసో తెలవకో ఏమనుకుంటారంటే
(13:13) ముట్లు ఆగిపోయినాయి కదా ఇక శృంగారానికి దూరం అయిపోవాలేమో భర్తతో కలవకూడదేమో అని అనుకుంటారు. ఇది ఒక అపోహనే పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా ఎదేచ్చగా 90 సంవత్సరాల వరకు భార్యా భర్తలు కలిసి సహజీవనము శృంగారంలో రత్తిక్రీడలో ఆనందంగా పాల్గొనవచ్చు అయితే వయసు పెరిగిన కొద్దీ రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అల్లా వారానికి ఒకసారి అవుతుంది.
(13:48) తర్వాత 15 రోజులకు ఒకసారి అవుతుంది మూడు వారాలకు ఒకసారి నెలక ఒకసారి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి 90 ఏళ్ల వరకు నిస్సంకోచంగా మహిళలు పురుషులు కూడా శృంగార క్రీడలో రతి క్రీడలో పాల్గొనచ్చు ఇంకొక అనుమానం ఈ మధ్య డాక్టర్లు ఏదైనా చిన్న సమస్యతో తెల్లబట్టతో వెళ్తే నీకు గర్భసంచికి పుండుంది గర్భసంచి తొలగించేస్తాం నీకు ఇద్దరు పిల్లలు పుట్టేశరు కదా అని చెప్పి అనవసరమైన గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు ఇస్టిరెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు.
(14:30) మ్ ఎంత అన్యాయం అంటే పాతికేళ్లలో 30 ఏళ్లలో అనవసరంగా గర్భసంచి తొలగించేస్తున్నారు. గోటితో పోయేదాన్ని గర్భసంచికి పుండు వస్తే నీకు క్యాన్సర్ వస్తుందనే భయపెట్టి డాక్టర్లు గర్భసంచి తొలగిస్తున్నారు. అది పాపం చేయకూడదు. పాశ్చాత్య దేశాల్లో గాని అమెరికాలో గాని చిన్న వయసులో గర్భసంచి ఎవరూ తొలగించరు. మ్ అని డబ్బు ధనార్జన కోసం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో చిన్న వయసులోనే గర్భసంచి తొలగించి అన్యాయం చేస్తున్నారు మహిళా లోకానికి ఇంకొక దరిద్రం ఏంటంటే గర్భసంచితో పాటు అండకోశాలు ఉంటాయి కుడి పక్కోటి ఎడమ పక్కటి అవి రెండు
(15:17) కూడా తొలగిస్తున్నారు. కొంతలో కొంత అండకోశాలు ఓవరీను తొలగించకుండా ఉంచితే అంత నష్టం జరగదు. అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్లు అనే హార్మోన్లు ఉత్పత్తిఅయి మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేవి స్త్రీ హార్మోన్లు స్త్రీకి అవి కూడా తొలగిస్తున్నారు. కనుక ఎవరైనా గర్భసంచి తొలగించాలంటే ఆ డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
(15:44) ఉ అనుభవజ్ఞులైన గైనకాలజీ డాక్టర్ల దగ్గరికే వెళ్ళండి త్రీ డాక్టర్ అంటే లేడీ డాక్టర్ అంటే వెళ్ళబాకండి ఎండి గైనకాలజీ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్లి మ్ అవసరమైతే ఇప్పుడు మనం చీరలు కొనుక్కోవాలంటే నాలుగు షాపులు తిరుగుతున్నామా లేదా వాళ్ళ రోజుఉన్న పరిస్థితిని బట్టి వ్యాపార ధోరణలు చెలర ఎగుతున్న ఈ సమయంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏం చెప్తారో వినండి మళ్ళీ రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మూడో షాప్ అంటే మనం షాపింగ్ చేసిన విధంగా డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళవలసిన సమయం కలియుగం కల్తీల యుగం మోసాలు వ్యాపార ధోరణలు సేవాభావం తగ్గిపోయింది వ్యాపార ధోరణి
(16:26) పెరిగిపోయిన ఈ తరుణంలో షాపింగ్ చేయండి. అయిన తర్వాత చిన్న వయసులో ఎవరైనా గర్భసంచి తొలగిస్తాను అంటే దానికి అంగీకరించొద్దు. సరే ఏదైనా కారణం వల్ల గర్భసంచి తొలగించారు లేదు డాక్టర్ ధనాజన ధేయంగా తొలగించేశడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రతి క్రీడకు గర్భసంచికి లింక్ అనుకుంటారు. గర్భసంచి తొలగిస్తారు కానీ యోనిని అంటుకోరు. యోని యధావిధిగా ఉంటుంది.
(17:00) సంపర్కానికి రతిక్రీడలో పాల్గొనటానికి వినియోగించే యోని మార్గాన్ని అంటుకోరు. మ్ దాన్ని తొలగించరు. కనుక యోని మార్గం యధావిధిగా ఉంటుంది కనుక సంపర్కము రత్తిక్రీడలో యధావిధిగా పాల్గొనొచ్చు అయితే ఎవరికైతే అండకోశము ఓవరీ తొలగిస్తారో వాళ్ళకి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోదు తగ్గిపోతే భర్త వచ్చి దగ్గరిక వస్తే తోసేస్తారు నాకు ఇష్టం లేదు నాకు బాగోలేదు నా ఒళ్ళు బాగలేదు అని చెప్పి భర్తతో పాల్గొనటానికి శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి లోపించడానికి గల కారణం అండకోశాలు తొలగించడం
(17:46) కనుక ఈ హిస్టిరెక్టమీ గర్భకోశము తొలగించినా కూడా యధావిధిగా వివాహము జరిగినప్పుడు ఏ విధంగా రతిక్రియలలో పాల్గొంటారో అదే విధంగా పాల్గొనటానికి ఎటువంటి అవరోధము ఉండదు. మ్ అనేకమంది మగవారు సార్ నేను రిటైర్ అయిపోయాను నాకు షుగర్ ఉంది బీపి ఉంది గుండె జబ్బు ఉంది నా వయసు 60 దాటింది ఏ వయసు వరకు రతిక్రీడలో పాల్గొనొచ్చు అని అడుగుతుంటారు.
(18:21) మ్ 90 ఏళ్ల వరకు యదేచ్చగా మీరు పాల్గొనే అవకాశం ఉంది. అందువల్ల 60 ఏంటే వయసు అయిపోయిందని కాదు మరి భార్య సహకరించడం లేదు అని అంటారు. భార్యకి స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే సోయా చిక్కుళ్ళలో సహజ సిద్ధంగా స్త్రీ హార్మోన్లు ఉంటాయి. సోయా చిక్కుళ్ళ కూర మగవాడు తింటే ఆ స్త్రీ హార్మోన్లు మగవాడికి వచ్చి మగతనం తగ్గుతుంది కనుక భార్యనే తినిపించండి.
(18:57) ఎవరైనా మగవాడు విచ్చలివిడిగా తిరుగుతుంటాడు. ఆ భార్యని ఉండగానే అందమైన భార్య ఉండగానే బయట తిరుగుతుంటాడు. అలాంటి వారికి వాళ్ళ యొక్క ఆ కోరికలు తగ్గించడానికి తెలివిగల భార్య సోయా చిక్కుల ఉత్పత్తులు పెడితే ఆయన కంట్రోల్ లోకి వస్తాడు. మ్ ఆంబోతుని ఎలా అయితే మనం కంట్రోల్ చేస్తామో ఈ సోయా చిక్కుల ఉత్పత్తులని భర్తకు పెడితే కంట్రోల్ లో ఉంటాడు.
(19:28) ఎక్కడ పడితే అక్కడ బయట అలవాట్లు బయట స్త్రీలతో కాంటాక్ట్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మ్ సోయా చిక్కుళ్ళతో చేసిన సోయా చెంగ్స్ అంటారు మీల్ మేకర్ అంటారు. ఆ మీల్ మేకర్ పెట్టండి. సోయా చిక్కుళ్ళతో చేసిన పన్నీరు టోఫు అంటారు. ఈ టోఫు మహిళ తింటే కోరికలు కామవాంచలు పెరుగుతాయి. పురుషుడు తింటే బయట స్త్రీలతో ఉన్న కాంటాక్ట్స్ తగ్గిపోతాయి.
(20:04) అలాగే సోయా చిక్కుళ్ళను నానబెట్టి నానిన తర్వాత మిక్సీలో వేసి పాలు తయారు చేసి సోయాపాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసి కాసుకొని మనం పాలు ఎలా తాగుతున్నామో అలా తాగాలి. లేదా సోయా పిండి చేసి సోయా పిండితో పులకాలు చేసుకోవాలి. కనుక స్త్రీలో కోరికలు లేవు అంటే లేదే నీకు భార్య సహకరించటం లేదు రానివ్వటం లేదు అనే వాళ్ళు నీ భార్యకు సోయా ఉత్పత్తులు తినిపించు మ్ మగవాడికి ముక్కుతాడు వేయాలంటే నిన్ను కాకుండా బయట స్త్రీని స్పర్శించకుండా ఉండాలంటే ఆయనకి సోయా
(20:50) చిక్కుళ్ళు మొదలుపెట్టు తినిపించు ఆ విధంగా స్త్రీ హార్మోన్లు సహజ సిద్ధముగా కలిగి ఉన్న సోయాకుడు ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అనేకమైన అవలక్షణాలు స్త్రీలకు వస్తాయి. చర్మము పొడిగా అయిపోవటం తలనొప్పి రావటం నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఈ రకంగా ఇటువంటి లక్షణాలను కొంతమంది మరి చిరాకు, పరాకు తర్వాత హీట్ వేవ్స్ వస్తుంటాయి.
(21:21) ఆ హీట్ వేవ్స్ పొయ్యి దగ్గరికి వెళ్ళగానే అసలు ఆ పొయ్యి ఆ వేడికి తట్టుకోలేరు. అటువంటి వారు ఈ సోయా చిక్కుల ఉత్పత్తులు వాడటం వల్ల చక్కగా హార్మోన్లు అందుబాటులోకి వస్తాయి. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని స్త్రీ హార్మోన్ టాబ్లెట్లు ఇస్తారు. మ్ క్రీములు ఇస్తారు జెల్లీలు ఇస్తారు వాటన్ని బదులుగా సోయా చిక్కులు వాడటం ద్వారా స్త్రీకి తగ్గిన హార్మోన్ల స్త్రీ హార్మోన్ల శాతాన్ని సహజ సిద్ధంగా పెంచుకోవచ్చు.
(22:01) ఇక షుగర్ ఉన్న వాళ్ళకి ఓప ఏళ్ళు షుగర్ ఉంటే వాళ్ళకి సహజ సిద్ధంగా మగతనం లోపించడం అనేది సాధారణ పరిస్థితి కనుక షుగర్ ఉండలేది గనుక 10 ఏళ్ళ అయింది ఐదేళ్ళ అయింది నువ్వు షుగర్ టాబ్లెట్లు వాడుతున్నావ్ తగ్గటం సహజం. కొంతమంది తోటి సోదరుని అడిగితే ఏరా నీకు ఏంటి అనిఅంటే వాడుఏదో అబద్ధాలు చెప్తాడు. షుగర్ ఉంటే ఎంతో కొంత నరాల బలహీనత అనేది తద్యం కనుక ఆ చెప్పిన వాటలు నమ్మొద్దు ఇప్పుడు దానికి షుగర్ ఉంది మగతనం లోపించింది మగతనాల్లో రకరకాలు ఉన్నాయి.
(22:37) అసలు కోరికలు ఉండవు కొంతమందికి కొంతమందికి కోరికలు ఉంటాయి గట్టిపడదు ఈ గట్టిపడకపోవటాన్ని పురుషాంగం గట్టిపడకపోవటాన్ని ఆ ఈడి అంటారు. ఈడి అంటే మెత్తగా ఉంటుంది. పురుషాంగం మెత్తగా ఉండటం వల్ల యోని ప్రవేశం కష్టతరం అవుతుంది. తర్వాత కొంతమందికి పురుషాంగము స్త్రీ యోనిలో ప్రవేశించిన తర్వాత త్వరిత గతిన స్కలనం అవుతుంది.
(23:13) అంటే వీర్యం విడుదల అవుతుంది. దీన్ని శీఘ్ర స్కలనం అంటారు. గట్టిపడకపోవటాన్ని అంగస్తంభనం జరగకపోవటం అంటారు. త్వరగా విడుదల అవ్వటాన్ని శీఘ్రస్కలనం అంటారు. ఈ శీఘ్రస్కలనాన్ని వైద్య పరిభాషలో ప్రిమెచూర్ ఎజాక్ులేషన్ అంటారు. ఈ రెండు సమస్యలు ఉన్నవారు షుగర్ ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ లో కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి. టడలాఫిల్లు కలిగి ఉన్న మందులు రెడ్డీ లాబరేటరీస్ వారి ఒక ఉత్పత్తి టాజిల్ డిటిఏ జడ్జ్ ఎల్ఈ డి అనేది రాత్రిపూట వేసుకున్న తర్వాత ఒక రెండు గంటల్లో చక్కటి ప్రయోజనం
(24:02) లభిస్తుంది. ఈ టాబ్లెట్ కొంతమంది వాడిన వారికి తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి కండరాల నొప్పి వస్తుంది. లైంగిక ఆనందం పొందిన ఈ టాబ్లెట్ వల్ల ఒక 5 శాతం మందికి ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది గనుక దీంతో పాటే ఈ టాజిల్ డి రెడ్డి లాబరేటరీస్ వారి టాబ్లెట్ తో పాటు ఒక అల్ట్రాసెట్ అల్ట్రాసెట్ కూడా జాసన్ అనే కంపెనీ వారు తయారు చేసిన అల్ట్రాసెట్ వేసుకుంటే ఆ 105 మందికి ఏదైతే కండరాల నొప్పులు నడుము నొప్పి ఏవి వస్తాయో కొంతమంది తలనొప్పు కూడా వస్తుంది.
(24:45) ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటే షుగర్ ఉన్నవారికి పురుషాంగానికి రక్త ప్రవాహం తగ్గిపోతుంది. పురుషాంగం గట్టి గట్టిగా పొడుగ్గా లావుగా గట్టిగా ఇనప కడ్డీలా అవ్వాలంటే రక్త ప్రసరణం బాగా జరగాలి. ఆ రక్త ప్రసరణ బాగా జరగటానికి టాజిల్డి అనేది అత్యాధునికంగా వచ్చిన ఒక నూతన ఔషధం అంతకుముందు గతంలో అనేకమైన టాబ్లెట్లు ఉన్నాయి.
(25:19) ఆ టాబ్లెట్లు వాడుతూ వచ్చారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బీపీలు పెరగటం హార్ట్ ఎటాక్లు రావటం వాటిని సిల్డనాఫిల్ అనే మందు ఉంటుంది దాంట్లో ఆ సిల్డనాఫిల్ అనే టాబ్లెట్లు వాడటం హానికరం ఇప్పుడు నేను చెప్పిన టాజిల్ డీల్ లో సిల్డనాఫిల్ బదులుగా టెడలాఫిల్ అనే మందు ఉంటుంది. మ్ ఆ టడలాఫిల్ అనే మందు చాలా సురక్షితమైనది. ఈ టాజిల్ డీ వాడొచ్చా లేదా అని కొంతమంది అడుగుతుంటారు నాకు బైపాస్ ఆపరేషన్ అయింది గుండెకి స్టెంట్లు వేశరంటే ఒక ఆరు నెలలు అయిన తర్వాత వాడొచ్చు.
(25:58) మ్ తర్వాత పక్షవాతం వచ్చింది బీపీ కి మందులు వాడుతున్నా ఇతర ఇంగ్లీష్ మందులు వాడుతూ నీకు బైపాస్ ఆపరేషన్ అయినా స్టెంట్ అయినా ఆరు నెలలు ఆగు పక్షవాతం వచ్చి ఆరు నెలలు కోలుకున్నావ్ మందులు వాడుతున్నావ్ మందులతో పాటు ఇది వాడటం చాలా సురక్షితం ఇది రోజు వాడాలా అవసరానికే వాడాలంటే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే సరిపోతుంది.
(26:26) ప్రతిరోజు వాడవలసిన అవసరం లేదు. మరి యువతకు కూడా పనికొస్తుందండి కొంతమంది ఈ మధ్య 20 30 ఏళ్ళ వారికి వివాహం కాని వారికి కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. షుగర్ లేకపోయినా కూడా ఈ అంగస్తంభన జరగకపోవటం శీఘ్రస్కలనం జరగటం అనేవి జరుగుతుంటుంది. అయితే రాత్రిపూట తెలవకుండా లీక్ అయిపోతుంటుంది ముఖ్యంగా యువతకు మ్ అదేమి పెద్ద సమస్య కాదు దాన్ని స్వప్నస్కలనం అంటారు.
(26:59) ఈ దీనికి ఈ టాజిల్డి అనేది చాలా సురక్షితమైన మందు కోట్లాది మంది వినియోగిస్తున్నారు. దాని వల్ల ఎటువంటి అనర్థాలు గుండెపై గాని మెదడుపై గాని ఎటువంటి దుష్ప్రభావము ఉండదు దీన్ని మరి ఏ వయసు వారైనా వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉన్నది కనుక 45 50 అవ్వగానే స్త్రీకేమో పీరియడ్స్ ఆగిపోయినాయి నేనేమో 60 ఏళ్ళ వచ్చి రిటైర్ అయిపోయాను నాకు స్టెంట్ లేచారు బైపాస్ ఇన్ని సమస్యలు ఉన్నాయి షుగరు బీపీలు ఉన్నాయి మరి నేను ఈ దాంపత్య జీవితంలో పాల్గొనటానికి శృంగార జీవితానికి అర్హునా కాదా అనే అనుమానాలు ఎవరిని అడగాలో తెలవదు సిగ్గుపడుతుంటారు
(27:45) డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ గుండె డాక్టర్ని అడగరు లేదా మందులు ఇచ్చే డాక్టర్ని అడగరు కనుక 90 సంవత్సరాల వరకు మీ ఆరోగ్యం భౌతిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగా ఉన్నంతవరకు మీ దేహదారుం బాగున్నంతవరకు పౌష్టిక ఆహారాన్ని స్వీకరిస్తూ శృంగార జీవనం వల్ల రత్తిక్రీడలో పాల్గొనటం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటమే కాక మన ఆయుష్యు కూడా పెరుగుతుంది.
(28:16) వీళ్ళు అంత త్వరగా జబ్బుల బారిన పడరు కనుక అనేకమైన శృంగార జీవితం వల్ల పురుష హార్మోన్లు బాగా ఉత్పత్తి అవ్వటం స్త్రీ హార్మోన్లు బాగా ఉత్పత్తి అవ్వటం ఆ రత్తి క్రీడలో పాల్గొన్నప్పుడు ఎండార్ఫిల్ అని హ్యాపీ హార్మోన్స్ ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి వాటి ప్రభావం వల్ల పనితీరు మెరుగుపడుతుంది రిటైర్ అయిపోయినా 60 ఏళ్ళు దాటిన 70 ఏళ్ళు దాటిన నవయువకుల స్త్రీలు పురుషులు పని చేయాలంటే ఆనందంగా చలాకిగా చురుకుగా పని చేయాలంటే రత్తి క్రీడలో మీ వెసులుబాటుని బట్టి కనీసం రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి
(29:02) వారానికి ఒకసారి ఈ విధంగా శృంగార జీవితంలో పాల్గొనటం అనేది ఆరోగ్యకరం ఆనందదాయకం మీకు చక్కటి ఉల్లాసవంతమైన సుఖవంతమైన అదే కాదు గాఢ నిద్ర కూడా వస్తుంది. శృంగారము వల్ల గాఢ నిద్ర టాబ్లెట్లు వాడకుండా మా మధ్యము సేవించకుండా సజసిద్ధంగా చక్కటి నిద్ర కూడా మీ సొంతం అవుతుంది కనుక శృంగార జీవితం గురించి అనేకమందికి అనుమానాలు ఉంటాయి ఎవరిని అడగాలో తెలవదు సిగ్గుపడుతుంటారు ఇది సిగ్గుపడవలసిన అవసరం లేదు లైంగిక జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండవలసిన ఆవశ్యకత
(29:48) పురుషులకు స్త్రీలకు యువతీ యువకులకు కూడా ఉంది అమెరికా పాశ్చాత్య దేశాలలో వాళ్ళు సబ్జెక్ట్ గా స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ అవగాహన కల్పించి వారి అపోహలను తొలగించి ప్రతి ఒక్క పౌరుడు లైంగిక జీవనం గురించి పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో అవగాహన కలిగి ఉండటం అనేది విశేషం భారతదేశంలో లైంగిక క ఈ విద్య గురించి మాట్లాడితే ఏదో తప్పని పొరపాటని ఏదో బూతని ఈ విధంగా భావించి అమ్మ చెప్పదు నాన్న చెప్పడు అక్క చెప్పదు చెల్లెలు చెప్పదు గురువు చెప్పడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి కనుక ఇది కూడా లైంగిక
(30:37) విద్య అనేది ఒక భాగము కావలసిన విద్యా విధానంలో భాగము కావలసిన అవసరం ఉందని వైద్య విద్య నిపుణలు భావిస్తున్నారు. సర్ ఇప్పుడు కూడా బీపి అంటే ఏదనా చిన్న ఇష్యూ జరిగిన నాకు బీపి ఉంది అదిదని చెప్పాడ ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో బీపి రావడానికి మెయిన్ కాసెస్ ఏంటి అంటే షుగర్ లాగే బీపి కూడా జెటికల్ గా మన ఫ్యామిలీ లో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటదా సార్ బీపి అనేది వారసత్వంగా ఏమి రాదు కానీ ఫ్యాషన్ అన్నాం అది ఫ్యాషన్ కాదు ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తది.
(31:12) ఉమ్ బాగా రేజ్ అయిపోతుంటారు. గవర్నమెంట్ ఆఫీస్ లోనో ప్రైవేట్ ఆఫీస్ లోనో బాస్ ఉంటాడు. మ్ చిన్న తప్పుకు కూడా ఎగిరెగిరి పడతాడు. ఆవేశం తెచ్చుకుంటాడు. తిట్టేస్తుంటాడు. అద్దు అదుపు లేకుండా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టేస్తారు. చేసింది అతి చిన్న తప్పు రావలసిన సమయం కంటే ఐదు నిమిషాలు లేట్ గా వచ్చాడు ఏం కొంపలు మునిగిపోతాయి ఐదు నిమిషాలు లేట్ గా వస్తే బాబు రేపటి నుంచి టైం కి రా నాన్న అనొచ్చు.
(31:41) ఉమ్ దానికి అంత ఆవేశం తెచ్చుకుని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు అంటే ప్రతి చిన్నదానికి అతిస్పందన మ్ సాధారణంగా ఎవరు కూడా అంత స్పందన ఉండదు ఆ బీపి ఉన్నవాడికి బీపి రైజ్ అయిపోద్ది. బీపి రైజ్ అయినాక తిట్టడం మొదలెడితే ఇంకా ఇంకా ఇంకా పెరిగిపోద్ది. కొంతమంది అయితే అసలు వాళ్ళకి బీపి ఉన్నట్టు తెలవదు. మ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు.
(32:06) ఉమ్ తర్వాత ఈ బీపి కి కారణం ఏంటంటే మనం దక్షిణ భారతదేశంలో పచ్చళ్లు ఎక్కువ తింటాం. ఇవాళ ఇంట్లో అయినా గాని హోటల్ కి వెళ్ళినా కూడా రోటి పచ్చడి అన్నా ఉండాలి నీలవ పచ్చడి అన్నా ఉండాలి కొంతమంది అయితే రెండు కలిపి ఈ రెండిటికి తోడు ఇంకోటి ఊరమిరపకాయ అని ఉంటది దాని నిండా ఉప్పు ఉంటది. అట్లాగే కొంతమంది ఎండు చేపలు తింటారు. ఎండు చేపలు ఉప్పు వేస్తే గాని నిలవ ఉండదు.
(32:36) ఇలా ఉప్పు అధికంగా తినటం వల్ల ఉన్న బీపి ఇంకా అధికంగా అయిపోతుంది. శారీరక శ్రమ చేస్తే చెమట పడుతుంది చెమట ద్వారా కొంత సోడియం బయటికి పోతుంది. హమ్ ఇవాళ్ళు ఎక్కడ చూసినా పల్లెటూర్లో గతంలో ఏస అంటే ఏదో లగ్జరీ అనుకునేవారు ఇవాళ ఏసీ లగ్జరీ కాదు ఎవరి ఇంటికి వెళ్ళినా అక్కడ టీవీ ఏస ఫ్రిడ్జ్ ఈ మూడిటితో పాటు బైక్ లేని ఇల్లు ఏదైనా ఉన్నాయా అసలు లేదు తెల్లకార్డు పేదవాడిని అని చెప్పి మోడీ గారు ఇచ్చిన ఉచిత బియ్యం తెచ్చుకునే ప్రతివాడికి ఉన్నాయి కనుక ఏసీలకు అలవాటు పడటం కాయకష్ట షటం తగ్గిపోవటం అన్ని పనులకు యాంత్రీకరణ ఒక వస్తువుని నేల మంచి తీసి
(33:20) లారీలో పెట్టాలంటే ఇంతకుముందు మోసి పైకెత్తేవాడు ఇప్పుడు ఒక పరికరం తీసేసి అక్కడ పెట్టేస్తా ఉంది. అవును కనుక ప్రతి పనికి యాంత్రీకరణ వల్ల శారీరక శ్రమ తగ్గటం వల్ల కూడా ఈ బీపి పెరగటానికి కారణం కొంతమంది బీపి ఉందని తెలవక ఎవరనా ఆఫీసలో పట్టుకొని తిడతాడు. తిట్టి తిట్టి తిట్టి బీపి ఇంకా పెరిగిపోయి అక్కడ కుప్ప కూలిపోతాడు.
(33:45) కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి ఈ బీపి అధికంగా ఉండి మెదడులో ఉండే రక్తనాళము చిట్లటం వల్ల మాట పడిపోతుంది మూతి వంకరపోతుంది కాలు చెయ్యి పడిపోతుంది వెంటనే కుప్పకూలిపోతాడు. అటువంటి పరిస్థితి కూడా దారి తీసే అవకాశం ఉంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోకపోతే మనకు బీపి ఉన్నది అని తెలవదు. ఎవరైనా ప్రతి చిన్నదానికి ఇంట్లో పిల్లల మీద గాని భార్య మీద గాని మన కింద పని చేసే ఉద్యోగస్తులతో లేదు ఎక్కడికైనా వస్తువు కొనటానికి వెళ్లి కూరగాయలాడితో తగాదా మ్ లేకపోతే మనం ఆటో దిగినా ఆటో వాడితో తగాదా ప్రతి చిన్నదానికి తగాదా పడుతున్నాడు రేజ్ అయిపోతుంటాడు.
(34:30) అటువంటి వారు బీపి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్ ఇక వారసత్వంగా మాత్రం రాదు. కానీ కొంతమంది చిన్న వయసులోనే పిల్లలు కూడా బీపి వచ్చే అవకాశం ఉంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైతే మూత్రపిండ వ్యాధులు ఉంటాయో మూత్రపిండ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కరికి బీపి అధికంగా ఉండటం అనేది జరుగుతుంది. మ్ పుట్టుకతో కొంతమందికి మూత్రపిండానికి రక్తం సరఫరా చేసే రక్తనాళం కుచ్చించుకుపోయి ఉంటుంది.
(35:02) మ్ అక్కడ అడ్డంకు ఉండటమో లేకపోతే సన్నగా ఉండటం వల్ల మూత్రపిండానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగని కారణం వల్ల మ్ బీపి పెరుగుతుంది. అంటే కొంతమందికి మూత్రంలో ప్రోటీన్ మాంస కృత్తులు పోయి మూత్ర విసర్జన సమయంలో నురుగు వస్తుంది. మ్ మూత్రంలో నురుగు వచ్చిందంటే మీరు యూరిన్ టెస్ట్ చేయించుకుంటే ప్రోటీన్ మీకు తెలవకుండా పోతుంది. మ్ అలా ఈ ప్రోటీన్ పోయే వాళ్ళకి మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి బీపి పెరగటం అనేది ఉండటం అనేది సాధ్యం కొంతమందికి బీపి వల్ల తలపూటు వస్తుంది.
(35:44) మ్ తలనొప్పి వస్తుంది. అది తలనొప్పి బీపి వల్ల అనుకోకుండా ఆ షాప్ కి వెళ్ళిపోయి మందుల షాప్ లో తలనొప్పి టాబ్లెట్లు కొనుక్కొని మూత్రపిండాలను పాడు చేసుకుంటుంటారు. ఉమ్ తలనొప్పి రోజు వస్తుంది అటువంటి వారు వెంటనే బీపి చెకప్ చేయించుకోవాలి. సరే బిపి చెకప్ ఏంటి చెకప్ లో కూడా ఒక కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ బిపి ఆపరేటర్స్లు వచ్చినయి.
(36:14) మ్ డాక్టర్లు నర్సులు అందరూ కూడా ఎలక్ట్రానిక్ తగిలించేసి ఎలక్ట్రానిక్ దాంట్లో చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ బిపి ఆపరేటర్స్ కరెక్ట్ గా రాదు ఓకే పాదరసము మెర్క్యురీ ఉన్న పూర్వకాలం నుంచి ఒక స్టాండ్ నుండి ఉంటుంది అటువంటి బీపి ఆపరేటర్స్లే కరెక్ట్ రీడింగ్ ఇస్తాయి ఈ చేతికి కట్టుకొని బ్లీప్ సౌండ్ తో వచ్చే ఎలక్ట్రానిక్ బిపి ఆపరేటస్లు ప్లస్ 20 గాని మైనస్ 20 గాని ఉంటే కేవలం రఫ్ వాల్యూ వస్తుంది కానీ ఖచ్చితమైన బిపి రీడింగ్ రాదు [గొంతు సవరించుకోవడం] అలాగే బీపీ ని కూర్చోబెట్టి చూస్తారు పడుకోబెట్టి చూస్తారు కొన్ని సందర్భాల్లో
(36:59) నిలబెట్టి కూడా చూస్తారు. ఒక్కసారి బీపి ఎక్కువ ఉన్నంత మాత్రాన మందులు వాడకూడదు. ఎందుకంటే చాలామంది హాస్పిటల్లో ప్రవేశించగానే ఆ వాతావరణం చూడగానే లేకతే డాక్టర్ రూమ్లోకి రాగానే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది టెన్షన్ పెరిగితే బీపి పెరుగుతుంది. ఉమ్ ఏ రకమైన మానసిక ఒత్తిడి దేనికైనా గురైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినా ఉదాహరణకు ఉద్యోగం కోసం వెళ్తారు సర్టిఫికెట్లు సంకన పెట్టుకొని వెళ్తారు అసలు ముందు బయట కూర్చుని ఉండగానే లోపలికి వెళ్తా ఉంటారు వస్తుంటారు వెళ్ళినాడిని అడుగుతుంటారు ఏమ అడిగారు ఏమ అడిగారు నిన్న అని వాడుఏదో అడిగారులేని పోతుంటాడు వాడు
(37:39) ఎందుకంటే వాడు సరిగ్గా చెప్పలే చెప్పకుండా వాడు పోతాడు ఇక వీడు ఈ టర్న్ ఇంకా ఈ రెండో మూడో ఉందనగానే గుండె వేగం పెరుగుతా ఉంటది ఈ గుండె వేగము టెన్షన్ పెరిగితే బీపి పెరుగుతుంది. ఇక ఆఖరోడు ఇక నెక్స్ట్ వీడినే పిలుస్తారు. పిలిచేమంది ఇంకా పెరుగుతుంది. కాళ్ళు లోపలికి పెడతాడు గుండె వేగంగా కుట్టుకుంటుంది ఒంటి మీద చెమటలు పడతాయి అక్కడికి వెళ్లి కూర్చోండి అని అనగానే కూర్చోగానే చెమటలు నోట అమ్మట మాట రాదు నాలిక ఎండిపోతుంటుంది.
(38:11) అప్పుడు వాళ్ళు నిదానంగా నీ పేరేంటి ఊరేంటి అని కొంచెం కంఫర్ట్ లెవెల్స్ చేస్తున్నారు చాలా మంది ఇంటర్వ్యూలో అనుభవజ్యులు కొంతమంది డైరెక్ట్ గా సబ్జెక్టు అడిగాడంటే వీడు టెన్షన్ కి గురవుతారు. కనుక టెన్షన్ గుండె వేగం పెరిగే ఏ పనైనా గబగబా మెట్లెక్కి వచ్చాం గబ గబా మెట్లెక్కి వస్తే గుండె వేగం పెరుగుతుంది తద్వారా బీపీ కూడా పెరుగుతుంది.
(38:35) దాన్ని పట్టుకుని మందులు వాడకూడదు. తర్వాత బీపి కూడా బరువు అధికంగా ఉండటం వల్ల బీపి అధికంగా ఉంటుంది. కనుక ముందు మనము కొన్ని మార్గాలు సహజ సూత్రాలు పాటించవలసిన అవసరం ఉంది. బరువు పెరగటానికి కారణం మన థైరాయిడ్ గ్రంధి లోపం ఉన్నప్పుడు బరువు పెరగొచ్చు. థైరాయిడ్ రక్తపరక్ష చేయించి థైరాయిడ్ లోపు ఉంటే థైరాయిడ్ టాబ్లెట్లు వాడి బరువు తగ్గితే బీపి తగ్గుతుంది.
(39:02) అట్లాగే మనవంతు కృషిగా ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు అధికంగా ఉండే వస్తువులు మానేయాలి. చాలామంది మనకు పెద్దలు నేర్పించిన అలవాటు ఏంటంటే పెరుగు అన్నంలోన మజ్జిగ అన్నంలో ఉప్పు వేస్తాం ఎందుకు పూర్వకాలం మనం సైకిల్ తొక్కేవాళ్ళం ఎండకు తిరిగేవాళ్ళం ఏసీలు ఉండేవి కాదు కనుక ఎండకు వెళ్ళినప్పుడు మనం ఉష్ణ మండలంలో ఉంటాం గనుక ఎండక వెళ్ళినప్పుడు చెమట పట్టి చెమటలో సోడియం పోతుంది గనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు వేసుకోవాలని చెప్పి పెరుగు అన్నంలో మజ్జిగ అన్నంలో ఉప్పు వేసుకోమనేవారు లేకపోతే పెరుగు అన్నం మధ్యగ అన్నంతో నిలవ పచ్చడో రోటి పచ్చడినో మనం నంజుకొని
(39:48) తింటుంటారు దాంతో కలిపి తింటుంటారు. ఆ విధంగా మనకు కావాల్సిన సోడియాన్ని సమకూర్చడానికి మన పూర్వీకులు చేశారు. ఇవాళ స్కూళ్లు, కాలేజీలు, బస్సులు ఎక్కడ చూసినా అన్ని ఏసీనే కదా అసలు సూర్య కిరణాలు కూడా తగిలే అవకాశం లేదు. సూర్యోదయానికి ముందుకు డ్యూటీకి వెళ్తారు. సూర్యాస్తమం అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు.
(40:13) ఆఫీసలో కారిడార్లో కాలు ఎట్టినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు టాక్సీ ఏసి కారిడార్లో కాలు పెడితే ఏసి క్యాంటీన్ కి వెళ్తే ఏసి సినిమాకి వెళ్తే ఏసి ఇంతకుముందు సినిమాకి వెళ్తే టూరింగ్ ాకీసులు రేకులు షెడ్లు ఉండాయి. కనుక ఏస అధికంగా వినియోగించడం వల్ల చెమట పట్టే అవకాశాలే తగ్గిపోయినాయి. ఉ అందువల్ల ఈ బీపి కొంత అధికంగా ఉండటానికి కారణం అది ఉంటుంది.
(40:38) కనుక మనం చెమటపట్టే వ్యాయామం పొద్దున్నే నడక [గొంతు సవరించుకోవడం] యోగ ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటం వల్ల సైకిల్ తొక్కటం వల్ల చెమట పడితే చెమట ద్వారా కొంత శరీరంలో ఉండే సోడియం బయటకి పోయి బీపి ఆటోమేటిక్ గా నియంత్రణ జరుగుతుంది. ఉమ్ మనం ఉప్పు పెరుగు మజ్జిగలోనే కాకుండా రోటి పచ్చళ్లు చేసుకోండి ఇంట్లో ఉప్పు తగ్గించి వాడండి.
(41:09) అలాగే ఉప్పు వినియోగం తక్కువ చేయాలి. మ్ ఇంట్లో అందరికీ కొంచెం ఉప్పు అంటే ఇష్టం ఎందుకంటే ఉప్పు రుచిని ఇస్తుంది. ఉప్పు వేసుకోకపోతే చప్పగా ఉంటుంది. బీపి ఉన్న వాళ్ళ కోసం ముందుకు ఉప్పు తక్కువ వేసి మళ్ళీ వేరే కావాలని లేదంటే టేబుల్ మీద అయోడిన్ కలిగి ఉన్న ఉప్పుని టేబుల్ మీద పెట్టుకోండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకోండి జనరల్ గా ఏసలో ఉంటూ కాయ కష్టమ చేయని వారందరూ కూడా తక్కువ ఉప్పు తినటం మంచిది.
(41:39) ఉప్పు అనేది సోడియం అనేది ఈ సోడియం క్లోరైడ్ మనక కేవలం ఉప్పే కాకుండా మనకు లభించే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు వాటిల్లో కూడా సోడియం ఉంటుంది గనుక వాటి ద్వారా మనకు లభించే సోడియం సరిపోతుంది. ప్రత్యేకంగా మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదని శాస్త్ర పరిశోధనలు వెలడిస్తున్నాయి. మరి బీపీ కి టాబ్లెట్ వాడాలా అదేర్ ఆహార నియమాలు పాటించాను.
(42:10) ఉప్పు తగ్గించాను వ్యాయామం చేస్తున్నాను చెమట పడుతుంది అయినా తగ్గటం లేదు అటువంటప్పుడు బిపి టాబ్లెట్ డాక్టర్ ఇచ్చిన బీపి టాబ్లెట్లు వాడాలి. రకరకాల టాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ రోజుల్లో ఎక్కువమంది టెల్ మీ సార్టాన్ 40 అనేది ఎక్కువమంది వాడుతున్నారు. మ్ ఏ టైం అప్పుడు వేసుకోవాలంటే బీపీ ని ఉదయము టిఫిన్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి.
(42:36) ఉమ్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. తర్వాత చాలామంది పని వత్తుడులో మర్చిపోతారు. మ్ దానికి మీకు నేను చెప్పే చిట్కా ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా పర్సులో ఒక రెండు బిపి టాబ్లెట్లు పెట్టుకోండి. లేదు ఆఫీసులో మీరు వాడే మందుల కిట్ట ఒకటి పెట్టుకోండి ఒక వారం రోజులు మందులు అట్లాగే సూట్కేస్ సర్దుకునే సమయంలో అడావిడి అడా రైల్ టైం అయిపోద్ది ఫ్లైట్ విమాన టైం అయిపోద్దిఅని అడావిడిగా ప్రయాణం అవుతుంటారు సూట్కేస్ కనుక సూట్కేస్ లో ఒక వారం రోజుల మందులు ఆఫీసులో ఒక వారం రోజుల మందులు ఎందుకు పర్సులో రెండు టాబ్లెట్లు పెట్టుకుంటే మర్చిపోవటం అనేది సహజం అలా
(43:15) గుర్తున్నప్పుడు వేసుకోవడం మర్చిపోవడం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఓకే బిపి టాబ్లెట్ మీ ఇష్టం వచ్చినట్టు గుర్తొచ్చినప్పుడు వేసుకోవడం మిగతా సమయంలో మానేస్తే దాని ప్రభావము మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లి కోమాలోకి వెళ్లి కాలు చెయ్యి పడిపోయి మూతి వంకరపోయి మాట కూడా సరిగ్గా రాదు. ఇదే కాకుండా బీపి ప్రభావం వల్ల హార్ట్ ఎటాక్ గుండెపోటు కూడా వచ్చి మరి చిన్న వయసులోనే మరణాలు సంభవించే అవకాశం ఉంది.
(43:50) కనుక బీపి అని చెప్పేసి మీరు అశ్రద్ధ చేసి మందులు సరిగా వాడకపోతే ప్రమాదం దాపురించి ఉంది. ఇంకా కొంతమంది బీపి టాబ్లెట్ వాడుతూ డాక్టర్ చెప్పాడు కంట్రోల్ ఉందని మానేస్తారు. నువ్వు బిపి టాబ్లెట్ వాడబట్టి నియంత్రణలోకి వచ్చింది మానగానే మళ్ళీ పెరుగుతుంది. కనుక ఒక్కసారి బిపి టాబ్లెట్ వాడటం ప్రారంభించిన తర్వాత డోసు మిల్లీగ్రాములు పెరగటము తరగటం కొంతమందికి ఉదయంతో పాటు రాత్రి కూడా వేసుకోవాల్సిన అవసరం రెండుసార్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
(44:28) కొంతమందికి ఒక టాబ్లెట్ కాకుండా రెండు రకాల టాబ్లెట్లు పెడతారు. ఇవి డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. ఈ బిపి టాబ్లెట్లు మాత్రం మీరు మందుల షాప్ కి వెళ్లి నాకు ఒక బిపి టాబ్లెట్ ఇవ్వు అని అడిగి తీసుకోవద్దు. ఎందుకంటే ఎంత పరిమాణంలో ఇవ్వాలి ఏ రకమైన బిపి టాబ్లెట్ ఇవ్వాలి అనేది డాక్టర్ మాత్రమే నిర్ధారణ చేయాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అంటే మీకు గుండె డాక్టర్ అందుబాటులో ఉంటే కార్డియాలజీ డాక్టర్ ని సంప్రదించి ఈ యొక్క బిపి టాబ్లెట్లు ప్రారంభించండి.
(45:02) కార్డియాలజీ డాక్టర్ మాకు బోర్డ్లో లేడు అప్పుడు జనరల్ మెడిసిన్ ఎండి చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎటువంటి బిపి టాబ్లెట్ వాడాలి అనేది మీరు ప్రారంభించండి. కొన్ని రకం ట బిపి టాబ్లెట్లు వాడితే పాదాలకు వాపు వస్తది. కాళ్ళ వాపులు వస్తాయి. అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో టెల్ మీ సార్టాన్ 40మిగ్రమలు గాని 20 మిగ్రమలు గాని అత్యధికంగా రోగులు డాక్టర్లు కూడా వాడటం అనేది విశేషం ఇది బిపి టాబ్లెట్ వాడుతూ నా ఇష్టారాజ్యం కింద ఉప్పు ఎక్కువగా వాడతాను వ్యాయామం
(45:46) చేయను బరువు తగ్గనంటే ఎంత డోసులు పెంచుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ విధంగా చిన్న వయసులో బీపి వస్తే తప్పనిసరిగా మూత్రపిండాల వ్యాధులు ఏమన్నా ఉన్నాయని తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష రక్తంలో క్రియాటినిన్ పరీక్ష పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా ఈ బీపీ కి అసలు మూల కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే వాళ్ళ మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి చాలా సర్వసాధారణం ఈ రాళ్ళు మనకి తెలవకుండా పొట్టలో ఉండిపోతాయి నొప్పి రావాల్సిన అవసరం లేదు.
(46:25) ఎప్పుడో ఒకసారి నొప్పి వచ్చిందని తీసుకుంటే లోపల రాళ్ళు ఉన్నట్టు తెలుస్తాయి. ఈ రాళ్ళ వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. మూత్రపిండము పాడైపోయి ఉన్న మూత్రపిండము బాగా పని చేసే మూత్రపిండాన్ని అంటే కూసే గాడిద మేసే గాడిదిని ఎలా పాడు చేస్తుందో ఈ చెడిపోయిన మూత్రపిండాన్ని మనం పూర్తిగా బయటకి తీసేయపోతే పని చేసేదాన్ని కూడా చెడగొడుతుంది.
(46:53) కనుక మూత్రపిండంలో రాళ్లుు ఉండటం వల్ల మనకు తెలవకుండా ఒక మూత్రపిండం పాడైపోతే దాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించకపోతే బాగా పనిచేసే మూత్రపిండం కూడా చెడిపోతుంది. కనుక రాళ్ళ వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోయి తద్వారా ఈ బీపి కూడా పెరిగే అవకాశం ఉంది కనుక మూత్రపిండాల జబ్బులకు బీపి కి అవినాభావ సంబంధం ఉన్నది బీపీ ని మనము గౌరవించి మాత్రలు సకాలంలో వాడకపోతే దాని దెబ్బ మామూలుగా ఉండదు కొట్టిందంటే కొట్టింది మెదడును కొడతది మెదడును కొడితే నిన్ను వికలాంగుణ చేస్తది కాలు కాలు చెయ్యి కుంటుకుంటూ మూతి వంకరపోయి మాట
(47:40) సరిగ్గా రాని పరిస్థితికి దారి తీస్తుంది లేదా ఎక్దం చాతీలో నొప్పి చెమట పడుతుంది హార్ట్ ఎటాక్ వస్తుంది హాస్పిటల్కి రాకముందే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకుపోతుంది కనుక బీపీ ని తేలికగా తీసుకోవద్దు బరువు సమపాళలో ఉండాలి శారీరక శ్రమ చేయకపోయినా ఉదయము సాయంత్రము యోగ ప్రాణాయామము వ్యాయామము ధ్యానము చేయటం ద్వారా బీపి రాకుండా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి మీ అందరికీ నేను దండం పెట్టి చెబుతున్న బీపి టాబ్లెట్ ఒక్కరోజు అన్నం మానినా పర్వాలేదు టిఫిన్ మానినా పర్వాలేదు ఒక్కరోజు కూడా బీపి టాబ్లెట్లు
(48:26) క్రమము తప్పకుండా ప్రతిరోజు వేసుకోండి మీ సూట్కేస్ లో ఉండాలి మీ ఆఫీస్ లో ఉండాలి ఈ బిపి టాబ్లెట్లు మీ పర్సులో కూడా రెండు పెట్టుకుంటే మర్చిపోయినా వెళ్ళగానే వేసుకునే అవకాశం ఆఫీస్ కి వెళ్లి తిట్టటం తిట్ల దండకం మొదలు పెట్టిన తర్వాత నీ యొక్క ఆఫీసలో పని చేసేవాళ్ళని అప్పుడు అర్థంవుతుంది. ఎందుకు నేను ఈరోజు తిడుతున్నాను అంటే బిపి టాబ్లెట్ వేసుకొని కారణం వల్ల అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కూడా ఆవేశము తెచ్చుకుంటున్నానని గుర్తు రాగానే ఆ పర్సులోనూ అక్కడున్న బిపి టాబ్లెట్ వేసుకుంటే ప్రశాంతంగా నీ యొక్క కింది స్థాయి ఉద్యోగులకు
(49:07) మనస్థాపం చెందకుండా మనశాంతితో నీ లక్ష్యాలు సాధించడానికి ఒక ఉన్నతాధికారిగా ఒక ప్రభుత్వాధికారిగా చక్కగా గా పనితీరు నిర్వహించవచ్చు తప్పకుండా సార్ మీరు ఏదైతే చిట్కాలు చెప్పారో ఏవైతే అపోహలు ఉన్నాయో నాకు తెలిసి ఈ వీడియో ద్వారా వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయి అనుకుంటున్నాను అండ్ చెప్పడం కూడా ఎంత చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు

No comments:

Post a Comment