Monday, October 26, 2026

ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు ఎలా తీయాలి? | ఈ పద్ధతులు చేస్తే సమస్యలు తప్పవు | Doctor Warning

ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు ఎలా తీయాలి? | ఈ పద్ధతులు చేస్తే సమస్యలు తప్పవు | Doctor Warning

Author Name:Natural Arogyam

Youtube Channel Url:https://www.youtube.com/@NaturalArogyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I3HfGX0JZ3U





Title: ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు ఎలా తీయాలి? | ఈ పద్ధతులు చేస్తే సమస్యలు తప్పవు | Doctor Warning

Author Name: Natural Arogyam

Description: ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు ఎలా తొలగించాలి? ఏ పద్ధతి సురక్షితం? ఏ పద్ధతులతో చర్మ సమస్యలు రావచ్చు? ఈ వీడియోలో డాక్టర్ ప్రైవేట్ పార్ట్స్ హెయిర్ రిమూవల్, వ్యక్తిగత పరిశుభ్రత, షేవింగ్, ట్రిమ్మర్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్, వాక్సింగ్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి అంశాలపై వివరించారు.
ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ వెంట్రుకలను తొలగించేటప్పుడు చర్మం మీద irritation, redness, itching, cuts లేదా ఇతర సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
ఈ వీడియోలో:
Private Parts Hair Removal
Pubic Hair Hygiene
Razor ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు
Trimmer ఉపయోగం
Hair Removal Creams
Waxing వల్ల వచ్చే సమస్యలు
Laser Hair Removalపై అవగాహన
Private Parts Hygiene Tips
సరైన underwear మరియు hygiene habits
పురుషులు, మహిళలు తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలు
గమనిక: వ్యక్తిగత చర్మ పరిస్థితి, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్ ఉంటే వైద్య నిపుణుడిని సంప్రదించండి.

#PrivatePartsHygiene #HairRemoval #PubicHair #IntimateHygiene #TeluguHealth #HealthTips #DoctorAdvice #HairRemovalTips #PersonalHygiene #SumanTV
Private Parts Hair Removal Telugu

Transcript:
(00:02) ప్రైవేట్ పార్ట్స్ పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ రోమాలు ఉంటాయి వెంట్రుకలు ఉంటాయి. వాటి శుభ్రత గురించి చాలామందికి అవగాహన లేదు. తల్లిదండ్రులు చెప్పరు పిల్లలకి మరి స్కూలు కాలేజీలో అధ్యాపకులు చెప్పరు మరి ఎలా తెలుసుకోవాలి ఏదో వాళ్ళకి తెలిసిన విధంగా స్నేహితుల ద్వారా నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా చేస్తావ అని ఏదో తెలిసి తెలవని పరిజ్ఞానంతో ఈ యొక్క వెంట్రుకలు రోమాల యొక్క శుభ్రత గురించి సరైన అవగాహన నేటి యువతీ యువత యువతీ యువకులకు గాని
(00:47) పెద్దవాళ్ళకు గాని లేదు. మనకి ఎక్కడ ఏ విధంలో కూడా లైంగిక విజ్ఞానంలో ఈ పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ ఉండే వెంట్రుకల యొక్క శుభ్రత గురించి అవగాహన కల్పించే అంశాలే లేవు పాఠ్యాంశాలు అంతకంటే లేవు ఇవి వెంట్రుకలు తొలగించుకోవడానికి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి వీటిలో ఏది మంచిది ఏది చేయదు ఏది చేయకూడనిది రకరకాల మార్గాల్లో ఒకటి ఎలక్ట్రాలిసిస్ అంటారు.
(01:23) ఈ ఎలక్ట్రాలసిస్ అనేది చాలా ఎక్కువ సమయం పడుతుంది మిషన్ తో తీస్తారు ఇది అంత ఆచరించదగ్గ విషయం కాదు ఇది మంచిది కాదు ఎలక్ట్రాలసిస్ చేయించుకోవడం మంచిది కాదు. ఇక రెండోది హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడితే కొంతమందికి చర్మం మీద రియాక్షన్లు వస్తాయి. అక్కడ కాలిపోయినట్టు బొబ్బలు వస్తాయి. అది దాని వల్ల ఉన్న ఇబ్బంది ఇక మూడోది ట్రిమ్మర్ ఉంటుంది.
(02:03) మనం ఏదైతే ట్రిమ్మర్ గడ్డానికి వెంట్రుకలు తల వెంట్రుకలు ట్రిమ్ చేసుకుంటామో దాన్ని ట్రిమ్మర్ ని ఉపయోగించుకోవచ్చు ట్రిమ్మర్ ని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఆ వెంట్రుకలు రోమాలు తొలగించుకోవడానికి మంచిదే అది ఇక నాలుగోది వాక్సింగ్ అనేది ఉంది. వ్యాక్సిన్ ఎవరూ కూడా ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న వెంట్రుకలు తీయటానికి ఉపయోగించకూడదు చాలా నొప్పితో కూడుకున్నది వ్యాక్సిన్ చేసిన తర్వాత అక్కడ పుండ్లు పడతాయి వ్యాక్సిన్ మంచిది కాదు ఇక ఇంకో పద్ధతి లేజర్ తో వెంట్రుకలు తొలగించడం ఇది శాశ్వతంగా వెంట్రుకలు పోతాయి
(02:52) కానీ ఇది శాశ్వతంగా తొలగినా ఇది లేజర్ అనేది మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. లేజర్ కిరణాలతో ప్రైవేట్ పార్ట్స్ లో వెంట్రుకలు తొలగించడం కొంతమందికి భయం అమ్మో లేజర్ కిరణాలు అక్కడ వేస్తున్నారు దీనివల్ల పిల్లలు పుట్టరేమో వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుందేమో అండకోశం నుంచి అండాలు విడుదల కావేమో అని అనుమానం ఉంటుంది.
(03:22) ఈ లేజర్ ఏదైతే వెంట్రుకలు తొలగించడానికి అదునాతన చికిత్సల ద్వారా వాడుతున్నారో అది చాలా సురక్షితము. దాని ప్రభావము పిల్లలు పుట్టటానికి ఎటువంటి సంబంధం లేదు దానివల్ల వీరకణాల ఉత్పత్తి తగ్గదు అండకోశం నుంచి అండాల ఉత్పత్తి కూడా తగ్గదు ఇక సాంప్రదాయ పద్ధతి షేవింగ్ చేయటం రేజర్ పెట్టి షేవింగ్ చేస్తారు. అయితే గడ్డం గీసుకోవడానికి వాడిన రేజర్ ని ప్రైవేట్ పార్ట్స్ వెంట్రుకలు తొలగించడానికి వాడకూడదు వేరే వేరే ఉండాలి.
(04:03) షేవింగ్ చేసిన తర్వాత అక్కడ మాయిశ్చర్ మాయిశ్చరైజర్ అని దొరుకుతాయి మార్కెట్ లో మాయిశ్చరైజర్ అని దొరుకుతుంది దాన్ని రాయటం అనేది శ్రేష్టం తర్వాత కొంతమంది మనం హెయిర్ కటింగ్ చేసినట్టు తల వెంట్రుకలు కట్ చేసినట్టు ఈ ప్రైవేట్ పార్ట్ చుట్టూ ఉన్న వెంట్రుకలు కూడా కట్ చేస్తారు సిజర్ పెట్టి అంటే పొడుగు తగ్గిస్తారు. అది కూడా మీ సౌకర్యాన్ని బట్టి అది కూడా ఉపయోగించొచ్చు కత్తిరి ఉపయోగించి కత్తిరితో కట్ చేయొచ్చు.
(04:44) ఇది కాకుండా ఒక చిట్కా ఉంది. సహజ సిద్ధంగా మనకు లభించే పదార్థాలు ఉపయోగించడం ద్వారా ఆ వెంట్రుకలు పోతాయి. అదేంటంటే కొబ్బరి నూనె పసుపు శెనగపిండి శెనగపిండి నలుగు పిండి అంటారు. దాంట్లో ఈ మిశ్రమంలో అలోవేరా జెల్లు, రోజ్ వాటర్ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె పసుపు శనగపిండి అలోవేరా జెల్లు రోజ్ వాటర్ ఇవన్నీ కలిసి ఒక కప్పులో మిశ్రమం చేసి దాన్ని స్నానానికి ముందు ఈ ప్రైవేట్ పార్ట్స్ మీ
(05:31) దగ్గర ఉండే చుట్టూ ఉండే వెంట్రుకల మీద రాస్తే వెంట్రుకలు లు రాలిపోతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది సహజ సిద్ధమైన చిట్కా. ఈ వెంట్రుకలు ఉండటం వల్ల ఏంటి సమస్య అక్కడ చెమట పడుతుంది. తర్వాత చెమట పట్టిన తర్వాత వాసన ఈ వాసన వల్ల లైంగిక సంబంధాలు దెబ్బతింటాయి. రతి క్రీడలో పాల్గొనాలంటే ఆసక్తి ఉండదు. ఆ ప్రాంతము వాసనతో కూడినప్పుడు భార్యా భర్తల మధ్య అంత ఆసక్తికరంగా రతిక్రీడ సాగదు ఈ చెమటపట్టి వాసన ఉన్న ప్రాంతంలో
(06:18) అక్కడ దురద మొదలవుతుంది. దురద మొదలైతే గీకుతారు గోకుతారు ఈ దురద చెమట వాసన ఈ దురదకి కారణం ఏంటి అంటే అక్కడ ఫంగస్ పాచి ఈ ఫంగస్ రావటం వల్ల దురద పుట్టి గోకటం వల్ల గోకిన తర్వాత అక్కడ పుండ్లు ఏర్పడతాయి. చర్మము ఎర్రగా అయిపోతుంది. కందిపోతుంది. చిన్న చిన్న పొక్కులు, గుల్లలు, సగ్గడ్లు వస్తాయి. ఈ విధంగా చెమట పట్టకుండా వాసన లేకుండా అక్కడ ఫంగస్ లేకుండా శుభ్రంగా ఉండాలంటే వెంట్రుకలు ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది మనం ఉపయోగించే డ్రెస్సులు కూడా చాలా కీలక
(07:05) పాత్ర పోషిస్తాయి మనం వాడే అండర్వేరు కాటన్ది మాత్రమే వాడండి సిల్క్ ది ఎట్టి పరిస్థితిలో వాడొద్దు అలాగే మనం వాడే ప్యాంట్లు కాటన్ గాని టెరీ కాటన్ గాని పర్వాలేదు సిల్క్ ప్యాంట్లు వద్దే వద్దు జీన్ ప్యాంట్లు అసలే వద్దు జీన్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళకి అక్కడ గాలి ఆడదు పురుషులు స్త్రీలు ఈ జీన్ ప్యాంట్ల వల్ల ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టటము గాలి ఆడకపోవటము వాసన అనేక రకమైన సమస్యలకు కారణ కారణమే జీన్ ప్ాంట్స్
(07:51) అలాగే మహిళలు పీరియడ్స్ కి మూడు నాలుగు రోజుల ముందు వెంట్రుకలు శుభ్రం చేసుకుంటే వాళ్ళు పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్ వాడాలి గనుక శానిటరీ ప్యాడ్ వాడటానికి పీరియడ్స్ నెలసరి సమయంలో అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆ సమయంలో వెంట్రుకలు శుభ్రంగా తీసేస్తే మంచిది. నెలకి రెండు సార్లు ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉండే వెంట్రుకలను శుభ్రం చేసుకోవడం అనేది మంచిది ఇవి సహజ సిద్ధంగా మనవాళ్ళు స్నేహితుల దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో
(08:36) నేర్చుకున్న విధానాలు మనము వాడే బట్టలు చాలా కీలకము సిల్క్ వాడొద్దు అలాగే జీన్ ప్యాంట్స్ వాడద్దు రాత్రిపూట ఇంటికి రాగానే పురుషులు గాని స్త్రీలు గాని వెంటనే అండర్వేర్ డ్రాయర్ తీసేసి ప్రైవేట్ పార్ట్స్ కి చక్కగా గాలి తగిలే విధంగా స్త్రీలైతే నైటీ ధరించండి పురుషులైతే లుంగీ గాని లేదా పైజామా అండర్వేరు ఇంటికి వచ్చిన తర్వాత ఉండటం మంచిది కాదు రాత్రిపూట కూడా ఎవ్వరూ అండర్వేర్ వేసుకుని
(09:24) పురుషులు గాని స్త్రీలు గాని నిద్రపోవటం అనేది మంచిది కాదు అక్కడ ప్రైవేట్ పార్ట్స్ కి ఎంత ఎక్కువ గాలి వస్తే అంత ఆ ప్రదేశము ఆరోగ్యవంతంగా చర్మము చక్కగా కాంతివంతంగా నిగనిగలాడుతూ చర్మ సమస్యలు లేకుండా ఉంటుంది. ఉంది.

No comments:

Post a Comment