🔥ప్రపంచంలో Absolute Truth అనేది ఎక్కడా లేదు, ఉండదు కూడా. ఉన్నదల్లా Convenient గా మనం design చేసుకున్న భ్రమలు మాత్రమే. "నువ్వు నమ్మే అబద్ధం, నేను నమ్మే అబద్ధం". దీన్ని కొంచెం లోతుగా, విశ్లేషిద్దాం.
అసలు మనిషికి "నిజం" ఎందుకు కావాలి?
నిజం కావాల్సింది జ్ఞానం కోసం కాదు, Ego బతకడం కోసం. మనిషి మెదడుకి "నాకు తెలీదు" అనే శూన్యంలో ఉండడమంటే భయం.. రేపు ఏమవుతుందో, అసలు నేను ఎవరినో తెలీని ఆ అభద్రతా భావం, ఒక Black Hole లాంటిది. ఆ భయాన్ని cover చేసుకోవడానికి మెదడు ఏదో ఒక narrative ని పట్టుకుని తీరాలి. అలా పట్టుకున్న ఆ Comfortable కథకే కాస్త Makeup వేసి, దానికి "నిజం" అనే బోర్డు తగిలిస్తాడు.
💴ఉదాహరణకు, ఒక గుంపు అంతా కలిసి ఒక కాగితం ముక్క మీద బొమ్మ వేసి, దీని వాల్యూ వెయ్యి రూపాయలు అని నమ్మారు అనుకో. అది అబద్ధమే కదా? కాగితానికి Value ఎక్కడుంది? కానీ అందరూ నమ్మేసరికి అది Economic Truth అయిపోయింది. రేప్పొద్దున్న అదే గుంపు, "లేదు లేదు, ఇది చెల్లదు" అన్నారనుకో, నిన్నటి దాకా జీవితాలని శాసించిన ఆ నిజం, ఈ రోజు మళ్లీ చెత్త కాగితం (అబద్ధం) అయిపోతుంది. Demonetization లో జరిగిందదే కదా! అంటే ఇక్కడ నిజం ఏది? ఆ కాగితమా? కాదు. కేవలం మనుషుల collective agreement. ఒక అబద్ధాన్ని ఎక్కువ మంది, ఎక్కువ కాలం నమ్మితే.. దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరే "సమాజం ఒప్పుకున్న నిజం".
మనం రోజూ చూసే debates, గొడవలు, పాలిటిక్స్, మతాలు.. ఇవన్నీ ఏంటి? వాస్తవం కోసమా? కాదు. "నేను నమ్మే అబద్ధం, నువ్వు నమ్మే అబద్ధం కంటే గొప్పది" అని నిరూపించుకోవాలనే తాపత్రయం.
💡నువ్వొక ideology ని నమ్ముతావు. ఎందుకు? అది నీ పెరిగిన వాతావరణానికి, నీ conditioning కి, నీ comfort zone కి సరిపోయింది కాబట్టి. దాన్ని నువ్వు "నా నిజం" అంటావు. నేను ఇంకో దాన్ని నమ్ముతాను. దాన్ని "నా నిజం" అంటాను.
కానీ లోతుగా చూస్తే, నా నిజం.. నా బతికే పద్ధతిని justify చేయడానికి, నేను వాడుకునే ఒక ముసుగు. నీ నిజం.. నీ ego ని defend చేసుకోవడానికి నువ్వు వాడుకునే ఇంకో ముసుగు. ఇద్దరు మనుషుల మధ్య Argument జరుగుతున్నప్పుడు, అక్కడ నిజానికి నిజానికి మధ్య fight జరగట్లేదు. రెండు భయపడిన Ego ల మధ్య survival game నడుస్తోంది.
😨దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? The Fear of Identity Crash.
మనిషి తన Identityని కొన్ని నమ్మకాల మీద నిర్మించుకుంటాడు. "నేను ఫలానా కులం, "ఇది నా దేశం, ఇది నా దేవుడు, ఇది నా నైతికత". ఇవన్నీ నువ్వు పుట్టకముందు ఎక్కడో ఎవరో రాసిన Script లు. ఆ Script ని బట్టీ పట్టి, అదే Reality అని నువ్వు భ్రమపడుతున్నావు. ఒకవేళ ఇవన్నీ వట్టి కల్పితాలు, నీ Convenience కోసం నువ్వే అల్లుకున్న అబద్ధాలు అని నీకు తెలిసిపోతే? నీ identity కుప్పకూలిపోతుంది. "నేను" అనే పునాది కదిలిపోతుంది. ఆ కదిలిపోవడం ఇష్టం లేక, మెదడు తనను తాను కాపాడుకోవడానికి ఆ అబద్ధాల చుట్టూ LOGIC అనే కంచెలు కడుతుంది.
🧠అసలు మనం "నిజం" అని దేన్ని అంటాం?
మన ఇంద్రియాలు మనకు ఏది చూపిస్తే దాన్ని. కానీ మన కళ్ళు చూసేది ఒక Limited spectrum of light ని మాత్రమే. మన చెవులు వినేది ఒక Limited frequency of sound ని మాత్రమే. ఈ అరకొర data ని base చేసుకుని, మన మెదడు లోపల ఉన్న మన పాత జ్ఞాపకాలని వాడి ఒక బొమ్మ గీస్తుంది. ఆ బొమ్మనే మనం "ప్రపంచం" అని, "నిజం" అని feel అయిపోతున్నాం. అసలు నువ్వు చూస్తున్నదే సగం Data, దానికి నువ్వు ఇచ్చే interpretation నీ స్వార్థం. ఇందులో నీకు "నిజం" ఎక్కడ దొరుకుతుంది?
The moment you conclude, you become blind. అంటే నిజం అనే దానికి shape ఉండదు. అది ఒక definition లో ఇమిడేది కాదు. "ఇదే నిజం" అని నువ్వు ఒక మాట అన్నావు అంటే, అక్కడే దాన్ని Limit చేసేసావు. ఎప్పుడైతే ఒక దాన్ని limit చేసావో, అది అప్పుడే అబద్ధంగా మారిపోయింది.
🤯అయితే ఇదంతా FAKE ఆ? మనం బతుకుతున్నది అంతా మోసమేనా? అనే ప్రశ్న start అవుతుందిప్పుడు.. అక్కడే ఉంది అసలైన Twist. ఇదంతా ఒక మోసం అని, మెదడు ఆడుతున్న ఒక survival game అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా రియలైజ్ అవుతావో.. అప్పుడు నీకు నీ అబద్ధాల మీద, పక్కవాడి అబద్ధాల మీద కోపం రాదు. ఒక రకమైన జాలి, ఒక ప్రశాంతత వస్తుంది. "అరే, వీడు తన Convenience కోసం అల్లుకున్న ఒక Storyని, నిజం అని గుడ్డిగా నమ్ముతున్నాడే" అని నవ్వొస్తుంది.
😭ఎవడైనా నీ దగ్గరికి వచ్చి తన "నిజం" గురించి గొంతు చించుకుని అరుస్తుంటే, వాడి మాటలు నీకు వినపడవు. వాడి వెనుక తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి భయపడుతూ ఏడుస్తున్న వాడి Ego మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు నువ్వు వాడితో Argue చేయవు, కేవలం Observe చేస్తావు.
So, నువ్వు "నిజం" కోసం వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వెతికేవాడు కూడా ఒక అబద్ధమే. వాడు కూడా ఒక Conditioned ప్రొడక్ట్ ఏ. Think About it..
-PRATIKULA VEDAM
http://youtube.com/post/Ugkxrhov65XjL0Wjz1AcYnm2U7AZnCArc_OF?si=VaCKC5sEAYJJGczf

No comments:
Post a Comment