Wednesday, October 21, 2026

Gaslighting Explained: మానిప్యులేటర్ల మైండ్ గేమ్స్! 🧠|GreeshmasGuidance

Gaslighting Explained: మానిప్యులేటర్ల మైండ్ గేమ్స్! 🧠|GreeshmasGuidance

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4FL5ua78EJ8





Title: Gaslighting Explained: మానిప్యులేటర్ల మైండ్ గేమ్స్! 🧠|GreeshmasGuidance

Author Name: Greeshma’s Guidance

Description: In Episode 2 of our "Toxic Relationships" series on Greeshma's Guidance, uncover the dark psychology of Gaslighting, how manipulators play mind games with your reality, and practical ways to break free.

మీ పార్ట్‌నర్ మిమ్మల్ని అనుమానిస్తున్నారా? gaslighting ,emotional manipulationఅంటే ఏంటో, టాక్సిక్ రిలేషన్ షిప్ నుండి బయటపడటం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

ఈ వీడియోలో, గ్యాస్‌లైటింగ్ ఎలా జరుగుతుందో మరియు ఇతరులు మీ మనసును ఎలా నియంత్రిస్తారో వివరిస్తాను. తరచుగా మీ జ్ఞాపకశక్తిని లేదా ఆలోచనలను తప్పు అని నిరూపించడం ద్వారా ఎదుటివారు మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో ఇందులో చూడవచ్చు.

ఇటువంటి మానసిక వేధింపుల నుంచి బయటపడటానికి అవసరమైన బౌండరీస్ మరియు స్వీయ-అవగాహన గురించి చర్చిస్తాను. మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, మీ వాస్తవికతను మీరు ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇలాంటి మరిన్ని మానసిక ఆరోగ్య చిట్కాల కోసం Greeshma’s Guidance ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారా? కామెంట్స్‌లో తెలియజేయండి.

00:00 introduction
01:12 Denying Reality & Direct Lie
02:15 Trivializing & Emotional Shaming
03:16 Countering, Diverting & Memory Blaming
04:08 Using Allies & Social Gaslighting
05:00 Hiding Things & Creating Chaos
05:46 rules to come out
07:03 conclusion


🔔 Subscribe to @GreeshmasGuidance for more mental health tips, relationship guidance, and self-care in Telugu!

#GreeshmasGuidance #GaslightingTelugu #ToxicRelationshipTelugu #RelationshipAdviceTelugu #MindControl #MentalHealthTelugu

Transcript:
(00:08) నేను అసలు ఈ మాట అనలేదు నువ్వే ఊహించుకుంటున్నావ్ నీకు మతిమరుపు ఎక్కువైపోయింది. నువ్వు ప్రతి చిన్నదానికి ఓవర్ యక్టింగ్ చేస్తున్నావ్. నీకే ఏదో మానసిక సమస్య ఉంది. మీ పార్ట్నర్ మీతో రోజువారి గొడవల్లో ఈ మాటలు తరచుగా అంటున్నారా జాగ్రత్త. మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నిశశబ్దంగా మీ మెదడును తినేసే సైక్లాజికల్ వేధింపైన గేస్ లైటింగ్ కి గురవుతున్నారు.
(00:34) ఎదుటివారు తమ తప్పును తమ మోసాన్ని కప్పి పుచ్చుకోవడానికి మీ జ్ఞాపక [గొంతు సవరించుకోవడం] శక్తిని మీ ఆలోచనా శక్తిని మీ మానసిక స్థిరత్వాన్ని మీరే అనుమానించేలా చేసే ఒక భయంకరమైన మైండ్ గేమ్ ఇది. దీంట్లో ఎదుటివారు ఎంత ప్రశాంతంగా అర్థం చెప్తారంటే నిజం మీ కళ్ళ ముందే ఉన్నా మీరే తప్పు అనుకునేలా మిమ్మల్ని మారుస్తారు. గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం.
(00:58) ఈరోజు మన టాక్సిక్ రిలేషన్షిప్ సిరీస్ ఎపిసోడ్ 2 లో మనిపులేటర్లు మీ బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేస్తారు. వాళ్ళు వాడే ట్రిక్స్ ఏంటి మరియు ఆ మైండ్ ట్రాప్ నుండి పూర్తిగా బయటపడి మీ ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు మనం క్లియర్ గా చూడబోతున్నాం. గేస్ లైటింగ్ ట్రిక్ నెంబర్ వన్ ద విజువల్ బ్లైండ్ స్పాట్ అండ్ డైరెక్ట్ డినై ఇది చాలా షాకింగ్ గా ఉంటుంది.
(01:24) మీ కళ్ళ ముందే ఒక సంఘటన జరుగుతుంది. లేదా మీ ఫోన్ లో ఒక మెసేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దాన్ని ఆధారాలతో సహా వాళ్ళ ముఖం మీద నిలదీస్తారు. కానీ ఎదుటి వ్యక్తి ఎలాంటి భయం లేకుండా ఎలాంటి మొహమాటలు లేకుండా మీ కళ్ళలోనికి నేరుగా చూసి అసలు అలా జరగనే లేదు నువ్వు పగటి కలలు కంటున్నావని పచ్చి [గొంతు సవరించుకోవడం] అబద్ధాన్ని ఎలాంటి మొహమాటము లేకుండా కొట్టి పడేస్తారు.
(01:48) వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తారంటే మనం నిజంగానే తప్పు చూసామేమో లేదా మనకే మతిమరుపు వచ్చిందేమో అని మన ప్రూఫ్స్ ని మనమే అనుమానించడం స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకు నిన్న వాళ్ళు చెప్పిన మాటను ఈరోజు మార్చేసి నేను ఆ మాట ఎప్పుడూ అనలేదు నీకే వినికిడి లోపం ఉంది అంటారు. నిజాన్ని కూడా పచ్చి అబద్ధంగా నమ్మించడమే గేస్ లైటింగ్ లో మొదటి మరియు అత్యంత మోసపూరితమైన స్టేజ్.
(02:18) గేస్ లైటింగ్ ట్రిక్ నెంబర్ టూ ద ఎమోషనల్ షేమింగ్ అండ్ ఇన్వాలిడేషన్. మీరు ఒక తప్పు వల్ల హర్ట్ అయి మీ బాధను మీ [గొంతు సవరించుకోవడం] కోపాన్ని వారి ముందు వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు దానికి క్షమాపణ చెప్పరు. దానికి బదులుగా నువ్వు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు నీకు సెన్స్ ఆఫ్ హ్యూమన్ లేదు జోక్స్ అర్థం చేసుకోలేవు. ప్రతి చిన్నదానికి ఏడవడం నీకు పెద్ద మానసిక అలవాటయపోయింది అని మీ ఎమోషన్స్ ని తక్కువ చేసి మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా లేదా పిచ్చిదానిలా ప్రాజెక్ట్ చేస్తారు.
(02:49) దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా నేను బాధపడటం కూడా తప్పేమో నేనే ఎందుకు ప్రతిదానికి ఇలా ఫీల్ అవుతున్నాను అనిపించేలా మీ బ్రెయిన్ ని వాళ్ళు పూర్తిగా వాష్ చేస్తారు. చివరికి మీ మనసులో ఎంత భయం ఎంత క్షోభం ఉన్నా బయటపడితే నన్ను చూసి అందరూ నవ్వుతారేమో నన్ను ఓవర్ యాక్టర్ అంటారేమో అని భయపడి నోరు మూసుకొని ఆ నరకాన్ని భరించడం స్టార్ట్ చేస్తారు.
(03:14) మీ కన్నీళ్లకు విలువ లేకుండా చేయడమే ఈ ట్రిక్ ఉద్దేశం. గేస్ లైటింగ్ ట్రిక్ నెంబర్ త్రీ ద గ్రేట్ డైవర్షన్ అండ్ మెమరీ టాంపరింగ్ మీరు వాళ్ళ పాత తప్పును లేదా ప్రస్తుత సమస్యను ఆధారాలతో సహా నిలదీసినప్పుడు వాళ్ళు ఆ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం చెప్పరు. దానికి బదులుగా ఏ ముందు వెనకాలేని రెండేళ్ల క్రితం ఎప్పుడో జరిగిన వేరే విషయాన్ని తవ్వి తీస్తారు.
(03:41) సరే నీతో మాట్లాడి వేస్ మరి రెండేళ్ల క్రితం నువ్వు మా నాన్నగారి ముందు నన్ను ఎలా అవమానించావు ఆ రోజు నువ్వు చేసిన తప్పు గురించి ఎందుకు మాట్లాడావు అని ఆ టాపిక్ ని కంప్లీట్ గా వేరే డైరెక్షన్ కి మార్చేస్తారు. దీంతో మెయిన్ ప్రాబ్లం పక్కకు పోయి వాళ్ళ పాత గొడవ గురించి మనం డిఫెండ్ చేసుకోవడంలో మన ఎనర్జీని మొత్తం డ్రైన్ అయిపోతుంది.
(04:02) ఫైనల్ గా గొడవకి మీరే కారణం అని తేలిపోతుంది. విన్నర్ ఎప్పుడు ఆ మనిపులేటర్ అవుతాడు. గేస్ లైటింగ్ ట్రిక్ నెంబర్ ఫోర్ ద సైక్లాజికల్ ఐసోలేషన్ త్రూ థర్డ్ పార్టీస్ ఇది గేస్ లైటింగ్ లో మోస్ట్ విత్ స్టెప్. వాళ్ళు కేవలం మీ ముందే మిమ్మల్ని తక్కువ చేయడం కాదు. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూడా రహస్యంగా ఈ మధ్య తను బాగా నెగిటివ్ అయిపోతుంది.
(04:30) చిన్నదానికే అరుస్తుంది. డిప్రెషన్ లో ఉంది. మైండ్ సరిగ్గా పని చేయట్లేదు నేనే సద్ది చెప్తున్నాను అని లీక్స్ ఇస్తుంటారు. ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ కూడా పాపం అతడు లేదా ఆమె నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నాడో చూడు నువ్వే బాగా కోపంగా ఉంటున్నావేమో అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు కంప్లీట్ గా డిఫెన్స్ లో పడిపోతారు.
(04:52) నాకు నిజంగానే ఏమైనా అయిందా అని మీ మీద మీకే అసహ్యం వేస్తుంది. మీ మైండ్ ని వాళ్ళు 100% హ్యాక్ చేసి తమ చేతుల్లోనికి తీసుకున్నట్లే. [సంగీతం] గేర్స్ లైటింగ్ లో మనం చాలాసార్లు గుర్తించని మరో ప్రమాదకరమైన ద హిడెన్ కేవోస్ కొన్నిసార్లు మనిపులేటర్లు మీ ఇంపార్టెంట్ వస్తువులు అంటే కారు, తాళాలు, పత్రాలు, మనీ వాళ్లే కావాలని దాచి పెడతారు.
(05:20) ఆ తర్వాత మీరు వాటి కోసం వెతుకులాడుతుంటే నువ్వే ఎక్కడో పడేసి నా మీద నెత్తుతున్నావా నీకు మతిమరుపు విపరీతంగా పెరిగిపోయింది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని మీ బ్రెయిన్ ని కావాలని కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రతిరోజు ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ నేను లేకుండా నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు నీకు లోకం తీరు తెలియదు అని ఒక మానసిక బానిసత్వాన్ని మీపై రుద్దుతారు.
(05:46) ఇదే గేస్ లైటింగ్ అసలు నైజర్ హౌ టు బ్రేక్ ఫ్రీ అయితే మైండ్ గేమ్ ని ఎలా బ్రేక్ చేయాలి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి హియర్ ఆర్ ద త్రీ మోస్ట్ పవర్ఫుల్ గోల్డెన్ రూల్స్ నెంబర్ వన్ రైట్ ఇట్ డౌన్ జర్నలింగ్ చేయండి. గొడవ జరిగిన ప్రతిసారి వాళ్ళు మాట్లాడిన మాటలు జరిగిన విషయాలను డేట్ మరియు టైం తో సహా ఒక డైరీలో రాయండి. మీ జ్ఞాపక శక్తి 100 శాతం కరెక్ట్ అని మీకు మీరే ప్రూఫ్ ఉంచుకోండి.
(06:24) రెండోది డోంట్ ఆర్గ్యూ అండ్ ప్రూవ్ వాదించడం ఆపియండి గేస్ లైటింగ్ చేసేవారితో వాదనకు దిగడం అంటే గోడతో తలబాదుకోవడం వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీకు తెలిసినప్పుడు ఓకే మీ అభిప్రాయం నేది నా నిజం నాకు తెలుసు అని సైలెంట్ గా అక్కడి నుండి వచ్చేయండి. వాళ్ళ నుంచి వాలిడేషన్ కోరుకోకండి. నెంబర్ త్రీ టస్ట్ యోగకర్ మీ సిక్సెస్ ని నమ్మండి.
(06:55) ఎదుటివారి మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే నిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ మైండ్ ను మీరు నమ్మడం మొదలు పెడితే ఏ గ్రేస్ లైటింగ్ మిమ్మల్ని టచ్ చేయలేదు. ఫ్రెండ్స్ మీ ఆలోచనల మీద మీ జ్ఞాపక శక్తి మీద మీకున్న నమ్మకాన్ని ఎవరికోసం ఏ బంధం కోసం పోగొట్టుకోకండి. మీ రియాలిటీ మీదే మీ నిజం మీరే. ఈ కేస్ లైటింగ్ ట్రిక్స్ లో మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఫేస్ చేసిన సిచువేషన్ ఏంటో కింద కామెంట్స్ లో ఓపెన్ గా షేర్ చేయండి.
(07:28) మీ కామెంట్స్ చదివి చాలా మందికి ధైర్యం వస్తుంది. మన టాక్సిక్ రిలేషన్షిప్ సిరీస్ లోని తదుపరి ఎపిసోడ్ మంచివాళ్ళే టాక్సిక్ భాగస్వాముల వలలో ఎందుకు పడతారు లవ్ బాంబింగ్ డార్క్ సీక్రెట్స్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గ్రీస్మస్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి.
(07:49) ఈ మైండ్ గేమ్స్ లో చిక్కుకొని సతమతం అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మీ ఆలోచనలకి మీ జీవితానికి మీరే మాస్టర్ టేక్ కేర్ అండ్ స్టే స్ట్రాంగ్

No comments:

Post a Comment