PRATIKULA VEDAM
1 hour ago (edited)
🤴🏻ఒక చక్రవర్తి తన గుర్రం మీద వెళ్తుంటే, దారిలో ఒక బిచ్చగాడు అడ్డుపడి, "నా చేతిలో ఉన్న ఈ చిన్న చిప్పను నీ దగ్గర ఉన్న దాంతో నింపుతావా?" అని అడిగాడు. చక్రవర్తి నవ్వి తన భటులతో ఆ చిప్పలో బంగారు నాణేలు పోయమన్నాడు, కానీ నాణేలు పడగానే అందులో మాయమైపోతున్నాయి. తన పరువు పోతోందని చక్రవర్తి తన ఖజానాలో ఉన్న వజ్రాలు, రత్నాలు అన్నీ తెచ్చి ఆ చిప్పలో పోయించినా అది ఖాళీగానే ఉంది. అలిసిపోయిన చక్రవర్తి, "అసలు ఈ చిప్ప దేనితో తయారైంది?" అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు నవ్వి, "ఇది మనిషి ego తో, ఆశలతో తయారైంది చక్రవర్తీ.. దీనికి bottom ఉండదు, నువ్వు ప్రపంచం మొత్తాన్ని ఇందులో వేసినా ఇది ఎప్పటికీ నిండదు" అని చెప్పాడు.
👣మనం లైఫ్ లో ఏ పని చేసినా, ఏ profession లో ఉన్నా అందులో 90% డబ్బు కోసం, మిగతా 10% సొసైటీ లో గుర్తింపు కోసం, అందరి ముందు Buildup ఇవ్వడం కోసం చేస్తుంటాం. ఈ రెండూ మనకి happiness, satisfaction ఇస్తాయని మన నమ్మకం. మరి ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల మంది దగ్గర, కొన్ని వేల కోట్ల డబ్బులున్నా, వాళ్ళ మాటతో ఎన్నో పనులు జరిగిపోతున్నా, సొసైటీలో ఎంతో గుర్తింపు ఉన్నా, వాళ్ళకి పూర్తి ఆనందం ఎందుకు రావడం లేదు అనేది నీ అసలు ప్రశ్న.
🤯నువ్వు అడిగిన ఈ ప్రశ్నలోనే ఒక పెద్ద flaw ఉంది. మనం డబ్బు, Societyలో validation కోసం పాకులాడేది ఆనందం కోసం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజం ఏమిటంటే, మనం పరిగెడుతుంది ఆనందం కోసం కాదు, మన లోపల ఉన్న ఒక లోతైన Emptiness నుంచి escape అవ్వడానికి.
👀😎నీకు కళ్లు మంటగా ఉంటే Eye drops వేస్కుని, కళ్ళకి Rest ఇవ్వకుండా, Expensive Sun glasses పెట్టుకుని, ఆ కళ్ళకి ఇంకా ఒత్తిడినిస్తున్నావ్. అంటే ఇక్కడ మనం చేస్తున్నదేంటంటే, మనల్ని మనం తట్టుకోలేక, మనతో మనం ఒంటరిగా ఉండలేక, External గా వస్తువులని, bank balance ని, పక్కోడి చూపుల్ని పోగుచేసుకుంటున్నాం.
🤔ఒక middle class వాడికి ఒక అద్భుతమైన ఆశ ఉంటుంది.."నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే, నా life set అయిపోతుంది" అని. ఆ illusion లో వాడు బతికేస్తాడు. కానీ ఒక Billionaire Tragedy ఏంటో తెలుసా? వాడి దగ్గర వంద కోట్లు ఉన్నాయి, కానీ వాడి లోపల ఇంకా ఏదో తెలియని వెలితి. వాడి illusion అప్పటికే బద్దలైపోయింది. డబ్బుతో ఆనందం రాదు అని వాడికి తెలిసిపోయింది. అందుకే వాళ్ళు ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. Mars మీదకి వెళ్లాలని, కొత్త Social Media Platforms కొనేయాలని, సినిమాలో హీరో అయిపోవాలని, రాయకీయాల్లో అధికారం సంపాదించాలని.. ఎందుకంటే వాళ్ళు తమను తాము మర్చిపోవడానికి కొత్త distractions కోసం desperation లో వెతుకుతున్నారు.
💧మేడ మీద ఉన్న water tank కి ఒక పెద్ద బొక్క ఉందనుకో. నువ్వు చిన్న పైపుతో నీళ్ళు నింపితే ఎంత waste అవుతుందో, పెద్ద Motor పెట్టి నింపినా, అంతే waste అవుతుంది. ఇక్కడ Ego, లేదా 'నేను' అనే feeling ఒక "అంతులేని అగాధం" లాంటిది. దానికి ఎంత validation ఇస్తే, దానికి అంత ఆకలి పెరుగుతుంది.
💰ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా physical గా ఉంటుంది. And Validation అనేది ఎప్పుడూ కూడా బైట నుంచి దొరికేది. కానీ నీకు కావాల్సిన Satisfaction అనేది? Strictly Psychological. అంటే నీ లోపల నుంచి దొరికేది. ఒక Physical వస్తువుతో ఒక Psychological emptiness ని ఎలా నింపుతావు? ఇది Exact గా ఎలాంటిదంటే, నీకు విపరీతంగా ఆకలి వేస్తుంటే, ఎవడో వచ్చి నీ bank account లో పది లక్షలు credit చేసినట్టు. పైసలైతే వచ్చాయి, కానీ ఆకలి తీరిందా? లేదు.
🤵🏻మనిషిని ఇంగ్లీష్ లో HUMAN BEING అంటాం. కానీ మనం Being లో ఉండం, ఎప్పుడూ Becoming లోనే ఉంటాం. అంటే మనం HUMAN BECOMING ఐపోయాం. ఇప్పుడు ఉన్న దాంతో Satisfaction ఉండదు, "రేపటి నేను" మీద investment చేస్తుంటాం. నువ్వు చేస్తున్న 90% డబ్బు వేట, 10% buildup అనేది, నిన్ను నువ్వు ఒక Market product లాగా తీర్చిదిద్దుకోవడం. పక్కోడి కళ్ళల్లో నీకు నువ్వు గొప్పగా కనిపిస్తే, ఆ Reflection ని చూసి నువ్వు మురిసిపోతున్నావు. అంటే, నీకు నీ Original face మీద నమ్మకం లేదు, పక్కోడి కళ్ళు, అనే అద్దంలో కనిపించే Makeup Face మాత్రమే ఇష్టం.
😊నువ్వు ఆనందం కోసం వెతుకుతున్నంత కాలం, అది దొరకదు. ఎందుకంటే, "వెతుకుతున్న వాడే" అసలు problem. నీ లోపల ఉన్న ఆరాటం, "నేను ఇంకా ఏదో అయిపోవాలి", "నేను ఇంకా prove చేసుకోవాలి" అనే పిచ్చి తగ్గితే తప్ప, ఈ Rat Race కి End ఉండదు. డబ్బు కేవలం ఒక అవసరం, అది ఒక tool లాగా వాడుకోవడానికి మాత్రమే. కానీ అదే నీ existence కి meaning ఇస్తుంది అనుకుంటే, అంతకంటే పెద్ద కామెడీ ఇంకొకటి లేదు.
👑Happiness is not something you acquire by adding things to your life. True happiness is the relief you get when you start dropping your illusions, your need for validation, and your dependency on tomorrow. కోటీశ్వరుడైనా, బిచ్చగాడైనా, తన లోపలున్న "I am incomplete" అనే జబ్బుని address చెయ్యకపోతే, ఇద్దరి బ్రతుకుల్లో ఏడుపు మాత్రం అదే.
- PRATIKULA VEDAM
https://youtube.com/post/UgkxztVIysundovg3_p6gAQdhJYXSRIBX_kw?si=_TmzFQVYJFD2FTf5

No comments:
Post a Comment