🎻🌹🙏 సాకారం - నిరాకారం..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు కన్నులు మూసుకుంటాం... ఎందుకు???
🌿కొందరు భగవంతుని ఉపాసనను ఒక విగ్రహాన్ని ముందుంచుకొనో, ఒక పఠాన్ని పెట్టుకొనో చేస్తారు. అంటే ఒక రూపాన్ని దర్శిస్తూ చేస్తారు. ఇలా చేయటంలో ఆ విగ్రహమే పరమాత్మ అనే భావం అనుకోకుండానే వచ్చేస్తుంది.
🌸ఆ విగ్రహాన్ని భగవంతునిగా భావించి సేవలు చేస్తారు. ఎలాంటి భావం వస్తుందనో ఏమో.. భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించటంతో బాటు రెండు కన్నులు మూసుకుంటాం. ఎందుకు...
🌿నిజంగా భగవంతుడు ఆ విగ్రహం కాదు, ఆయన నీలోనే ఉన్నాడు. కన్నుల ముందున్న విగ్రహాన్ని గాక నీలోనే ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి, గ్రహించటానికి కన్నులు మూసుకొని బుద్ధిని(జ్ఞాననేత్రాన్ని) తెరువు అని చెప్పటమే...
🌸మనం కొలిచే రూపమే పరమాత్మయనే నమ్మకం ప్రబలటంతో కొన్ని రూపాలను ద్వేషించే స్థితి కూడా వస్తుంది. మూఢత్వం పెరిగిపోతున్నది. నిజంగా పరమాత్మకు ఆకారం లేదు. రూపం లేదు. అది నిరాకారం.
🌿నిరాకార తత్త్వాన్ని కన్నులు చూడలేవు కనుక కన్నులు చూడగల రూపాన్ని కన్నుల ముందుంచుకొని ఉపాసన చెయ్యటం ఒక ఉపాయంగా మనకు పురాణాలలో సూచించారు....
🌸కాని ఎల్లకాలం అదే పట్టుకు ప్రాకులాడ కూడదు, మనం నదిని దాటటానికి పడవను ఏర్పాటు చేశారు. కాని ఎల్లకాలం ఆ పడవను మనతో తీసుకు వెళ్ళాలనుకోరాదు.
🌿నది దాటేంత వరకే దాని అవసరం, అలాగే నిరాకార నిర్గుణ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించేంత వరకే ఈ సాకారోపాసన చెయ్యాలి గాని అదే లక్ష్యంగా చెయ్యరాదు. నీ దృష్టి విగ్రహం మీద నుండి నిరాకార పరమాత్మ వైపుకు మళ్ళాలి.
🌸వినాయకచవితి నాడు నిరాకారమైన మట్టికి ఒక ఆకారం కల్పిస్తాం. ఆ విగ్రహాన్ని పత్రితో పూజిస్తాం, మరునాడు జల్దిలో కలుపుతాం. ఎందుకు...!? నిరాకార తత్త్వాన్ని సాకారం చేసి పూజించి, తిరిగి నిరాకారంగా మార్చేందుకే... నిరాకారమే నిత్యం, సత్యం..స్వస్తి....🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment