Tuesday, December 13, 2022

మానవుడు నిత్య జీవితంలో ఆపత్తి .. సంపత్తి ..ప్రపత్తి.. అనే మూడు విధాలైన సంఘర్షణ కు లోనవుతాడు.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

మానవుడు నిత్య జీవితంలో ఆపత్తి .. సంపత్తి ..ప్రపత్తి..  అనే మూడు విధాలైన సంఘర్షణ కు లోనవుతాడు. 

ఏమి చెప్పినా ఎలా చెప్పినా నీలో ఉన్న స్వరూప జ్ఞానం మేల్కొల్పడానికే ..

విషయోప భోగ ఇచ్చ .. ప్రియాప్రియములకు లోబడి ఉండుట ... మృత్యు భయం 
వలన 

సమయోచిత ప్రజ్ఞ చే ... భయ అవశేషం మిగలకుండా ఎలా ఆచరించాలో చెపుతారు గురువు అది ఆపత్తి. 

తీవ్ర ముముక్షుత్వం మేల్కొనేలా చెయ్యటమే సంపత్తి. 

అహంకారం త్యాగం చెయ్యకుండా సంపత్తి నీకు ప్రాప్తించదు .. గురువు సంపద కారకుడు. 

నీకు ఈశ్వరునికీ అభేధ స్థితి ప్రపత్తి భగవంతుడు తప్ప నా అన్నవాడు మరొకడు లేడు. 

ఆపత్తి.. సంపత్తి .. ప్రపత్తి ఈ మూడింటిలో గురువు బంధువు. 

నాలుగవ మేనులో .. తురీయ స్థితిలో మేల్కొలిపేవాడు నిజబంధువు. .. మహా కారణ స్థితిలో మేల్కొలుపుతాడు. 

మహాభినిష్క్రమణ స్థితికి మానవుడు చేరాలి ... మృత్యు భయంతో కాదు .. మృత్యుం జయుడవై నిర్గమించాలి. 

గురువు దారి చూపుతాడు కాబట్టి నిజబంధువు. 

సంకల్పం.. సంకల్పాతీతం - శూన్యం.. శూన్యాతీతం - కాలం .. కాలాతీతం .. ఇవి మూడూ మౌనవ్యాఖ్యగా ... ఈశ్వరీయ మౌనంలో .. కాలుడే గురువై వచ్చి ఈ మూడు స్థితులు దాటిస్తారు. 

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
గురుగీత -34

జై  గురుదేవ 🙏

No comments:

Post a Comment