Tuesday, December 20, 2022

"మీ"మాటల తీరు" ఎలా ఉండాలి?" ఎలా ఉంటే బాగుంటుంది!

 *🚩🚩🚩🚩🚩🚩" "మీ"మాటల తీరు" ఎలా ఉండాలి?" ఎలా ఉంటే బాగుంటుంది! 
      ❤️❤️❤️
👍సమర్పణ: Mazumdar Bangalore. 87925-86125.
       🙏🙏🙏
🚩ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషా దోషం, భావ దోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే    "ప్రజ్ఞను" సంతరించుకోవాలి. 

🚩అది "అభ్యాసం " చేత ఆధ్యాత్మికం చేతనే వస్తుంది.      అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి మీ మాట ద్వారా వారికి, తృప్తి, శాంతినివ్వాలి.

🚩"మాట "  ఎంత శక్తిమంతమయినదంటే ‘‘కడుపున్‌ రంపపు కోత కోయునది గాకుండినన్‌’’ అంటారు. 

🚩ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే ,"గాయం"  బాధ కన్నా ఒక "అనరాని మాట"  అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ. 

🚩రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. అది వర్ణనాతీతము.

🚩అందుకే " మాట" ఎంత గొప్పదో మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి.

🚩"  మనం మాట్లాడిన మాట, వదిలిన బాణము, జరిగిపోయిన కాలము విలువ, వదులుకున్న అవకాశాలు, తిరిగి తెచ్చుకోలేము.  అందుకే మాట్లాడేటప్పుడు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి,  మాట్లాడాలి.

🚩" 3 అంగుళాల నాలిక, 6 ఆరడుగుల మనిషి ని, బాధ పెట్టే టట్టు చేస్తుంది.

🚩" మనం మాట్లాడే తీరును బట్టి, ప్రాణము కాపాడుకోవచ్చు! అలాగే
మరొక విధంగా పరుషంగా మాట్లాడితే, ప్రాణాలు పోవచ్చు.

🚩" మాటలే మనిషికి  శత్రువు.   మాటలే మనిషికి స్నేహితుడు,
విచ్చుకునే మాట్లాడితే మిత్రుడు చుట్టూ ఉంటారు.   ఆదుపు తప్పి , మాట్లాడితే శత్రువులు బాగా పెరుగుతారు.   కాలక్షేపం కొరకు నేను మాట్లాడను.
ఎంతటి కష్ట ప్రసంగాలల్లో చెడు మాట్లాడను.  

🚩" మీ మాట తీరు బాగుండాలి.  " గుహ్యమైన " మాటతీరు ద్వారా పుణ్యం కూడా సంపాదించాలి ,  ఆనందం కూడా సంపాదించాలి.

🚩" మీకు ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా దొరుకుతారు.
కానీ "అప్రియమైన " సరే సరైన విషయ పరిజ్ఞానముతో చెప్పే వారు నేడు చాలా "దుర్లభము".

🚩 " సొల్లు చెప్పే 100 మంది కన్నా, " సొల్యూషన్" ఒకడు చెప్పేవాడు  మిన్న.

🚩 "మీరు ప్రేమతో, చిన్న చిరునవ్వుతో, ఆప్యాయంగా, ఉన్నది ఉన్నట్లు, పూర్తిగా విన్న తర్వాత, తెలివి గా, ఆలోచించి, మనసు విప్పి,
అర్థం చేసుకుంటూ, మాట్లాడటం అలవాటు చేసుకోండి!

🚩" ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడవలసి వస్తే, " "మౌనం "వహించాలి.

🚩" నీకు  అసలైన విషయం  తెలియనప్పుడు " మధ్యలో వచ్చి మాట్లాడకు, మౌనం" వహించు.

🚩" నోరు జారిన "మాట" ఎగిరిపోయిన పక్షి లాంటిది.   చెప్పవలసిన విషయం సూటిగా చెప్పలేని వారు "వాసనలేని పుష్పగుచ్చం" వంటి వారు.

🚩" మీ మాట్లాడే తీరు, మీ మాటలు చెబుతాయి మీ స్వభావం  ఏమిటో?

🚩" మీ మాటకు మంచి విలువ" ఉండాలి అంటే ,నీ నాలుక ను నీ ఆధ్వర్యంలో ఉంచుకో!

🚩" మీ మనసులోని మాటను, ఏ భేషజాలు, హిపోక్రసీ, లేకుండా చెప్పాలి.   మీ మాట కరెక్ట్  గా ఉన్న భావాలు ఆప్యాయంగా ఉండాలి సుమా!

🚩" నీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం మీ వెనకే అని గుర్తించండి!

🚩" ఈ "నోటి మందబుద్ధి"  నుండి  "బుద్ధి వైకల్యం" గల మాటలు వద్దు.   అసంబద్ధమైన  అసలు మాటలు పనికిరావు.

🚩"కుప్త్తం గా, స్పష్టం గా మాట్లాడలేని  వారు, ఎక్కువగా మాట్లాడుకు, మక్కువ చూపుతారు.
ప్రతి పదం ఆచి,తూచి మాట్లాడు.  అర్థవంతమైన మాటలు మించిన "ధర్మం" ఎన్నడూ లేదు.

💐" మీ అందం కన్నా, మీ మాట తీరు ప్రధానము- తీయనైన మాటలతో కటిక విషము నైన  అమ్మ వచ్చునేమో కానీ, కానీ కట్టుబడిన మాటలతో మీరు తేనె కూడా అమ్మలేరు. అని తెలుసుకోండి!

🥁" మన మాట మన సంపదకు మూలము.
ఆ సంపద ద్వారా మనము" మానవ సంబంధాలను" మెరుగుపరుచుకోవచ్చు.

🌹" మీరు మాట్లాడే మాటలకు శత్రువులు ఏర్పడతారు ( మీ మధ్య "దూరము "ఏర్పడును).,
అదే మీ మాటలకు స్నేహితులు ఏర్పడతారు
( మీ మధ్య "స్నేహ సంబంధాలు" మెరుగుపడతాయి)

☔" ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి! మీ ఇల్లు స్వర్గము అవుతుంది.

☂️" మీ కోపము హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానము చెప్పకండి!  తాత్కాలిక మౌనము ప్రధానము.

💧" ఒక మనిషి మరొక మనిషికి గుర్తుంది పోయేలా చేసే విషయము మాట.  మరి ఆ మాటను మనసుకు చేసే గాయములా చేయకండి.

🏵️" మీ మనసులో "కత్తులు" దాచుకొని ( తేనె పూసిన కత్తిలా) పైకి చిరునవ్వు నటిస్తూ, మాటలతో" పువ్వులు" రాల్చే,  మనుషులుగా ఉండకండి.

🌼" మీ మాటలతో ఎదుటివారికి "విసుగు" రాకుండా చూడండి!

🚩" ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని,
పంతాలు, పట్టింపులు, కొట్లాటలు, తగాదాలు,
ప్రతీకారముల జోలికి పోకండి!

🕉️" మీ మాటలలోని చమత్కారమును మీ భాష ద్వారా " మీకు గల "భాషా పటుత్వాన్ని" రంగరించి తెలియపరిచిన
" హృదయ రంజకరము" గా మారును.

🛕" మీరు ఒక కవిగా స్పందించి, మాటే మంత్రములా" చమత్కార బాసు రంగా" ముచ్చటించండి.


❤️సమర్పణ & సేకరణ: 
"Mazumdar Bangalor"
" ఇంక ఆలస్యము ఎందుకు? మీ మదిలో ఇంకా ఏమైనా, మాటలు గల" సన్మోహస్తాలను" ఉంటే తెలియజేయండి!
🚩🚩🚩🚩🚩🚩🚩

No comments:

Post a Comment