Thursday, December 8, 2022

సారస్వత మహర్షి గురించి తెలుసుకుందాం...

 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹ఈ రోజు 83వ సారస్వత మహర్షి గురించి తెలుసుకుందాం...🌹

🌸సారస్వత మహర్షి దధీచి మహర్షి కొడుకు. సరస్వతీ నది ఇతణ్ణి పెంచి ధధీచి వల్ల వరాలు పొందింది. అన్ని నదులలోకి పవిత్రమైన నదిగా, దాంట్లో స్నానం చేసిన వాళ్ళ పాపాలు పోయి పవిత్రులయ్యేలా వరం పొందింది.

🌿దధీచి మహర్షి గురించి మనం ఇంతకు ముందే తెల్సుకున్నాం కదా ! అలాంటి గొప్ప మహర్షి కొడుకంటే ఇంకా ఎంత గొప్పవాడో మరి..!

🌸దేవతలు దధీచి మహర్షి ఎముకలతో చేసిన ఆయుధాల్లో రాక్షసులందర్నీ చంపిన తర్వాత ఒక్కసారిగా కరువు ఏర్పడి ప్రజలందరు వలస వెళ్ళిపోవడం మొదలు పెట్టారు.

🌿సారస్వతుడు సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమంలో వేదపారాయణ చేస్తూ, తన తపశ్శక్తితో కరువుని పోయేలా చేశాడు. పన్నెండు సంవత్సరాలు ఏడిపించి వదిలిన ఈ కరువు వల్ల శిష్యులు, గురువులు చెల్లాచెదరయిపోయారు.

🌸మళ్ళీ ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకి చేరుకుని వేదాధ్యయనం మొదలు పెట్టారు. కాని పన్నెండు సంవత్సరాలు వదిలెయ్యడం వల్ల చెప్పేవాళ్ళకి, చెప్పుకునేవాళ్ళకి కూడా కష్టమయిపోయింది.

🌿ఒక శిష్యుడు తిరుగుతూ తిరుగుతూ, సరస్వతీ నదీ తీరంలో వేదఘోష విని అక్కడ సారస్వత మహర్షి వేదం నేర్పించడం చూసి మిగిలిన ఋషులకి చెప్పాడు. ఋషులందరూ అక్కడికి చేరారు. తమ దగ్గరకొచ్చి తమకి కూడ వేదం నేర్పమన్నారు.

🌸సారస్వతుడు గురువు దగ్గరికి వారే వచ్చి నేర్చుకోవడం ధర్మంగాని, గురువు నా దగ్గరికి రావడం ధర్మం కాదన్నాడు. ఋషులు మరి మేము వృద్ధులము నీవు బాలుడవు ఇది దోషం కాదా! అనడిగారు.

🌿వేదాల్లో చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకోకూడదనేం లేదు. ఇది గురుశిష్య సంబంధం మాత్రమే అన్నాడు సారస్వతుడు. అప్పుడు ఋషులు, శిష్యులు కూడా బారులు బారులుగా వచ్చి గురుశుశ్రూష చేస్తూ వేదం చదువుకున్నారు.

🌸ఈ రకంగా సారస్వతుడు లోకంలో కరువు బాధని పోగొట్టి, వేదాల్ని కూడా మళ్ళీ ఉద్ధరించాడు. ఇదీ సారస్వతుడి కథ..!!...

🌿రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాం ..స్వస్తి.....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment