Sunday, May 10, 2026

 *🕉️ ఓం నమో భగవతే శివ కేశవ శనీశ్వరాయ నమః 🕉️*

*🙏 శివాయ గురు లింగ పరమాత్మనే నమః 🙏*

*🐂 ఈ జన్మ శివార్పితం మరో జన్మ శివ శాసనం 🐂*

*ధర్మో రక్షతి రక్షతి అనే సూక్తి అందరికీ తెలిసిందే* 
 *మనం ధర్మాన్ని రక్షిస్తే*
*ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దాని అర్థం.* 

 రక్షించటం అంటే కత్తి కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు ఆచరించదగినది అని దాని అర్థం 

 అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు. ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలో బోలేడు సందేహాలు.ఆధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి.

 దీనికి ఉదాహరణ మన పురాణాలలో ఇద్దరు 
గొప్ప వ్యక్తుల గురించి చెబుతాను చదవండి 

 రామాయణంలో జటాయువు 
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు "నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడేను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు".

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు, అప్పుడు మృత్యువు వచ్చింది. జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! అతని కోరిక లో న్యాయం ధైర్యం సంకల్ప బలం ఉన్నది
 మరణం జటాయువు తాకలేకపోతోంది, 
అది నిలబడి వణుకుతూనే ఉంది.
మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది,
 ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

 మహాభారతంలో భీష్ముడు 
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వుతున్నారు!

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.

అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?

అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. 
కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.ఇంత తేడా ఎందుకు? 

ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దానివలన దుశ్శాసనుడుకు  ధైర్యం ఇచ్చాడు.  దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. 
కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. 

ఏడుస్తూ, అరుస్తూ, అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు.ద్రౌపదిని రక్షించలేదు.

ఫ్రెండ్స్ దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!

ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. 

ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు .
నిజం అనేది  కలత చెందుతుంది,కానీ ఓడిపోదు

కాబట్టి ఫ్రెండ్స్ తప్పు చేస్తున్నారు అంటే 
 ఆ తప్పు వల్ల నలుగురికి మంచి జరుగుతుంద లేదా అని  సూక్ష్మంగా ఆలోచించండి అందులో మంచి చెడు భగవంతునకు నివేదించండి. 
తప్పు అనిపిస్తే ఖండించండి వారికి నిధనం గా తెలియజేయండి అలా చేస్తే మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోతారు అని సంశయ ఇంచకండి. తప్పును సమర్థిస్తే మనం భగవంతుడు దగ్గర తప్పించుకోలేం. 
 మన కర్మల బట్టి ఆ బంధం ఉండాలో వెళ్లాలో 
ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ బంధం మనతో ఎన్నాళ్ళు ఉండాలని రాసి ఉందో ఎవరికి ఎరుక 
 ఆ రాసిన ఆ భగవంతుడికే ఎరుక 
 ఆ బంధం దూరమవుతుందని ఆలోచించి తప్పులను సమర్థిస్తే పరమాత్మను మీ హృదయంలో ప్రతిష్ఠించు కోలేరు 
ఆ తండ్రి పాదాలచెంత చోటుకు దూరం అవుతారు 

*🙏 ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏*

No comments:

Post a Comment