ఆశయం ఉంది కానీ ఆచరించే దమ్ము లేదా నీకు | From Ambitious to Unstoppable | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sOH8Mjo1G9Q
Transcript:
(00:02) [సంగీతం] మీరు ఒక అద్భుతమైన ప్రపంచంలో బ్రతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి మీ మైండ్ నిండ అన్ని ప్లాన్లే ఉంటాయి. రేపు అచ్చేయాలి వచ్చేడది ఆ స్థాయికి వెళ్ళాలి జీవితంలో ఒక రేంజ్ లో సెటిల్ అయిపోవాలి అని. అసలు మీకున్న ఆశయాలు చూస్తే హిమాలయాల కంటే పెద్దవిగా ఉంటాయి. కానీ నిజం చెప్పమంటారా సాయంత్రం అయ్యేసరికి మీ చేతుల్లో ఏముంటుంది ఒక ఫోన్ ఉంటుంది.
(00:30) ఆ ఫోన్ ని చూసి చూసి మీ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి ఉంటాయి. ఇక రేపు చూసుకుందాంలే అని చెప్పేసి ఒక దరిద్రపు సాకు కూడా మీ దగ్గర ఉంటుంది. సో మొత్తం మీద మీ రోజంతా వేస్ట్ చేసుకుంటారు. సో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో మోసం చేస్తుంది ఎవరు? వాళ్ళు ఎవరో కాదు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. పొద్దున పోటేమో చాలా కోరికలు ఉంటాయి. మధ్యాహ్నానికి అవి జీవిత లక్ష్యాలుగా మారిపోతాయి.
(00:54) సాయంత్రానికి రేపు చూసుకుందాంలే అని చెప్పేసి ఒక సాకు కూడా మీకు మీరే చెప్పుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే జీవిత లక్ష్యాలు ఉండటం గొప్ప అని చెప్పేసి అనుకుంటారు కానీ లాహిరి మహాశయులు తత్వశాస్త్రం ప్రకారం ఆచరణ లేని ఆశయం ఒక మానసిక రోగం అన్నారు. మీరు ఒక పెద్ద కారు కొనాలనో లేకపోతే ఒక గొప్ప ఉద్యోగం సాధించాలనో గదిలో కూర్చొని ఊహించుకుంటారు.
(01:18) అలా ఊహించుకున్నప్పుడు మీ బ్రెయిన్ కి ఒక కిక్ వస్తుంది. నిజంగానే ఆ పని సాధించేసినంత డోపమైన్ మీ మైండ్ లో రిలీజ్ అయిపోతుంది. దాంతో ఒక సుఖమైన నిద్ర వచ్చేస్తుంది మీకు కాకపోతే దీన్నే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటారు. అంటే కలలు కంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకునే ప్రాసెస్ ఇది. కానీ మీకు ఆశయం ఉంది ఆ ఆశయాన్ని మోసే క్రమ శిక్షణ లేదు. మీరు అద్భుతమైన సన్నాహాలు చేసుకుంటున్నారు అంటే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకుంటున్నారు పుస్తకాలు కొంటారు, టైం టేబుల్స్ వేసుకుంటారు ఎన్నో చేస్తారు కానీ ఆచరణ విషయానికి వస్తే మాత్రం [సంగీతం] మీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎందుకో తెలుసా
(01:55) ప్లాన్ వేయటానికి లేకపోతే ఒక జీవిత లక్ష్యాన్ని సెట్ చేసుకోవడానికి మనిషి అనేవాడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందులోనూ జీవిత లక్ష్యాన్ని సెట్ చేసుకొని నేను సాధిస్తే ఎలా ఉంటాను అని చెప్పేసి ఊహించుకున్నప్పుడు మనిషి ఎంతో ఆనంద పడతాడు. కానీ రియాలిటీలో కష్టపడాలి కదా మరి ఆ పని కోసం అప్పుడు మీకు కాళ్ళు వనుకుతాయి.
(02:18) అందులోనూ మీకు మీరే సాకులు చెప్పుకుంటూ ఉంటారు. పనిని వాయిదా వేస్తూ ఉంటారు. లాహిరి మసయులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. బాహ్యమైన ఆడంబరాలు అందులోనూ బాహ్యమైన ఆలోచనలు మనిషిని కేవలం బంధిస్తాయి. శూన్యంలోకి నెట్టేస్తాయి అని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళాలనుకునే సైనికులు లాంటివారు కానీ ఇంట్లోనే కూర్చొని కత్తిని ఎలా తిప్పాలో పుస్తకాలు చదువుతున్నారు.
(02:42) అదే మెయిన్ ప్రాబ్లం. బయట వాతావరణం బాలేదనో ఈరోజు మూడు లేదనో సాకులు వెతుక్కుంటారు. మరి కత్తు ఎప్పుడు తీస్తారు యుద్ధంలో ఎప్పుడు దూకుతారు నిజం ఏంటంటే మీకంటే వయసులో చిన్నవాళ్ళు మీకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మీకున్నంత పెద్ద పెద్ద ఆలోచనలు లేకపోవచ్చు.
(03:03) కానీ వాళ్ళ దగ్గర ఒక చిన్న అలవాటు ఉంది. అది ప్రతిరోజు పని చేయడం. మీరు మాత్రం మీ రూమ్ లో కూర్చొని నేను ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తాను అని పగటికలకు అంటున్నారు. ఈ గ్యాప్ ఉందే ఆలోచనకి ఆచరణకి మధ్య ఉన్న ఈ దూరం ఇదే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ బద్ధకం మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రోజుల్లో అందరికీ ఒక విచిత్రమైన జబ్బు పట్టుకుంది. అదే అతిగా ఆలోచించడం.
(03:30) ఓవర్ థింకింగ్ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు వేల మంది గురువులు లక్షల కొద్ది కొటేషన్లు కోట్లాది వీడియోలు వాటన్నిటిని మీరు చూస్తారు అందులోనూ మీరు వాటన్నిటిని చూసిన తర్వాత జ్ఞానం పెరుగుతుంది అనుకుంటారు కదా లేదు మీ అహంకారం పెరుగుతుంది. మీరు విషయాల గురించి మాట్లాడటం మొదలు పెడతారు. నేను అది చేయగలను ఇది చేయగలను అని చెప్పేసి పక్కనున్న వాడికి క్లాసులు ఇస్తారు.
(03:54) కానీ లోపల మాత్రం ఏమీ ఉండదు. అంతా శూన్యం. లాహరి మాసలు ఒక సంసార జీవిగా ఉంటూనే అత్యంత ఆధ్యాత్మిక స్థితి సాధించారు. ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద ప్రసంగాలు నమ్మలేదు. నిజమైన సాధనను మాత్రమే నమ్మారు. ఆయన ఏమన్నారో తెలుసా మాటలు కేవలం గాలి తరంగాలు అవి మిమ్మల్ని మార్చలేవు. కేవలం యాక్షన్ మాత్రమే మిమ్మల్ని మారుస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు రోజంతా ఫోన్ స్క్రీన్ చూస్తూ ఇతరుల విజయాలను చూసి మురిసిపోతారు లేకపోతే కుళ్లుకుంటారు.
(04:24) ఆ తర్వాత ఏం జరుగుతుంది కాలం గడిచిపోతూ ఉంటుంది. అలా కాలం గడిచిపోయిన తర్వాత సాయంత్రానికి ఒక అపరాధ భావం. ఈరోజు కూడా నేను నా జీవితాన్ని మార్చుకోలేకపోయాను అని నిజం మాట్లాడుకుందాం. మీ బద్ధకానికి మీరు పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ టైం. సోమవారం నుంచి డైట్ స్టార్ట్ చేస్తాను. వచ్చే నుంచి కొత్త ప్రాజెక్ట మొదలు పెడతాను. ఈరోజు వాతావరణం బాలేదు.
(04:45) రేపు పొద్దున్న లేచి దుమ్ము లేపుతాను అని చెప్పేసి ఇలాంటి నాటకాలు వేస్తూ ఎవరిని మోసం చేస్తున్నారు మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. లహరి మసయాల దగ్గర ఎంతో మంది శిష్యులు వచ్చి స్వామి మాకు సంసార బాధ్యతలు ఉన్నాయి, ఆఫీస్ పనులు ఉన్నాయి. సాధన చేయడానికి సమయం దొరకట్లేదు అని సాకులు చెప్పేవారు. ఆయన నవ్వి ఒకే ఒక్క మాట చెప్పేవారు సమయం దొరకదు సమయాన్ని సృష్టించుకోవాలి.
(05:11) కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం శ్వాసపై దృష్టి పెట్టడానికి నీకు సమయం లేదా అని అన్నారు. పరిస్థితులు ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండవు. మీరు అనుకునే ఆ మంచి రోజు క్యాలెండర్ లో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడైతే మీ కంఫర్ట్ జోన్ వదిలి ఒక్క అడుగు ముందుకు వేస్తారో అదే పర్ఫెక్ట్ టైం. కానీ మీ మనసు ఏం చేస్తుందో తెలుసా? మీకు సుఖాలని అలవాటు చేస్తుంది. కష్టపడటం దానికి నచ్చదు.
(05:34) శ్రమ అంటే దానికి భయం. అందుకే అది మిమ్మల్ని రేపు అనే ఒక మాయా ప్రపంచంలో బందిని చేసింది. ఆ రేపు అనేది ఒక ఎండమావి అది ఎప్పటికీ రాదు కానీ కనిపిస్తుంది. ఈ సమాజం మిమ్మల్ని ఒక భ్రమలో బ్రతికేలా చేస్తుంది. ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఏంటో తెలుసా రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవడం. ఒక్క రీల్ వైరల్ అయితే చాలు సెలబ్రిటీ అనుకుంటున్నారు.
(05:56) కానీ అది సక్సెస్ కాదు అది కేవలం ప్రమాదం. నిజమైన సక్సెస్ అనేది ఒక నిశశబ్దమైన ప్రాసెస్. సమురా యోధులు యుద్ధ భూమిలో ఒక్కే ఒక్క సెకనులో శత్రువుల తల నరుకుతారు కానీ ఆ ఒక్క సెకండ్ విజయం వెనుక వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రతి రోజు ఎవరికీ తెలియకుండా చేసిన సాధన ఉంటుంది. మీరు ఆ ఒక్క సెకండ్ గ్లామర్ ని చూస్తున్నారు కానీ ఆ వెనుక ఉన్న వేలాది గంటల నిశశబ్ద క్రమ శిక్షణని చూడటం లేదు.
(06:24) లాహిర మసేలు బోధించిన క్రియాయోగం కూడా ఇంతే. రోజు చేసే ప్రాణాయామం రోజు చేసే శ్వాస సాధన పైకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి పక్కనున్న వాడు నిన్ను చూసి నవ్వొచ్చు రోజు గంటలు గంటలు కూర్చొని ఏమి సాధిస్తావు అని చెప్పేసి కూడా అడగొచ్చు కానీ ఆ చిన్న సాధనే లోపల ఒక మహా సముద్రాన్ని క్రియేట్ చేస్తుంది మీరు ఆ చిన్న పనిని చేయడానికి కూడా బద్దకిస్తున్నారు ఎందుకంటే మీకు ఫలితం వెంటనే కావాలి ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టంట్ సక్సెస్ మీకు కావాలి ఈ ఆతృతే మిమ్మల్ని ఎటు కాకుండా చేస్తుంది.
(06:57) చాలా మంది ఏమంటారంటే మాకు చాలా ఆశలు ఉన్నాయి ఆశయాలు ఉన్నాయి కానీ ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఆశలు కేవలం మీ అహాన్ని సంతృప్తి పరచడానికే పనికొస్తాయి. మీ అహంకారాన్ని కామ్ డౌన్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. మీరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటారు. కానీ ఒక్క ఇటుక్కు కూడా ఎత్తడానికి మీ ఒళ్ళు సహకరించదు. ఇదేనా మీ ఆశయం.
(07:20) లాహేరి మహాసయుల జీవితాన్ని ఒకసారి చూడండి. ఆయన ఒక అకౌంటెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లల్ని పోషిస్తూనే లోపల ఒక మహాయోగిలా బ్రతికారు. ఆయన ఎప్పుడూ తన బాధ్యతల నుండి పారిపోలేదు అలాగని బద్ధకంతో కాలం వృధా చేయలేదు. ఆయన ఏమన్నారో తెలుసా నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు ఆ పని ఎంత నిశశబ్దంగా ఎంత నిబద్ధతతో చేస్తున్నావు అనేదే ముఖ్యం.
(07:45) కానీ మీరు ఏం చేస్తున్నారు? ఆఫీసులో పని సరిగ్గా చేయరు. ఇంట్లో బాధ్యతలు తీసుకోరు. పైగా నాకు ఆధ్యాత్మికత కావాలి నాకు సక్సెస్ కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడతారు. మీ బద్ధకాన్ని దాచడానికి మీరు వేసుకునే వేషాలే ఇవన్నీ సమస్య ఎక్కడుందో తెలుసా మీ ఆలోచనలు మీ చేతుల్లో లేవు అదే పెద్ద సమస్య ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు ఈ బద్ధకం ఈ వాయిదా వేసే గుణం మీ జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా దీని వెనుక ఒక అసలైన సైకాలజీ ఉంది.
(08:14) అదేంటంటే మెదడు మిమ్మల్ని ఆడిస్తున్న ఒక నీచమైన ఆట అనమాట. లాహిరి మాసేయులు క్రియాయోగ శాస్త్రం ప్రకారం మనసు ఎప్పుడు చంచలమైనదే దానికి ఎప్పుడు తక్షణ సుఖం కావాలి అంటే ఇన్స్టంట్ గ్రాఫికేషన్ అన్నమాట. మనసు అనేది ఎప్పుడూ చీకటి బద్ధకం నిద్ర వైపు లాగుతుంది. ఎందుకంటే అక్కడ ఏ శ్రమ ఉండదు కాబట్టి మీరు ఒక పెద్ద పుస్తకం చదవాలి అనుకోగానే మీ మెదడు అలసిపోతుంది.
(08:42) అదేఇగ్ర లో రీల్ స్క్రోల్ చేయమంటే మీరు గంటలు గంటలు ఎలా గడిపారో కూడా మీకు తెలియకుండానే గడిచిపోతాయి. ఎందుకంటే రీల్స్ చూస్తున్నప్పుడు మీ మైండ్ కి ఏ కష్టము లేదు. కానీ ఒక కొత్త పని నేర్చుకోవాలంటే బ్రెయిన్ కష్టపడాలి. కొత్త న్యూరాక్స్ కనెక్ట్ అవ్వాలి. అలా కష్టపడటం మీ మనసుకి నచ్చదు. అందుకే అది మిమ్మల్ని ఏదో ఒక సాకుతో ఆ పని చేయకుండా ఆపేస్తుంది.
(09:04) మీరు దానికి లొంగిపోతున్నారు. మీరు మీ మనసుకి బానిసలుైపోయారు. అదే పెద్ద సమస్య. లహరీ మసేలు తన శిష్యులకు శ్వాస మీద నియంత్రణ ఎందుకు నేర్పించారో తెలుసా? ఎందుకంటే శ్వాస చంచలంగా ఉంటే మనసు చంచలంగా ఉంటుంది. మనసు చంచలంగా ఉంటే బద్ధకం, సాకులు, భయాలు మిమ్మల్ని రోల్ చేస్తూ ఉంటాయి. అంటే వాటి ఆధీనంలోకి మిమ్మల్ని లాగేసుకుంటాయి.
(09:30) మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా మీకు ఆ పని వల్ల వచ్చే లాభం కంటే ఆ పనిని ప్రారంభించడానికి అయ్యే కష్టం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మీ సౌకర్యాన్ని ప్రేమిస్తున్నారు. మీ గమ్యాన్ని కాదు. మీరు కష్టాన్ని చూసి భయపడుతున్నారు. లాహిరీ మహాశయులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. భయం బద్ధకం అనేవి నీ ఆత్మకి పట్టిన తుప్పు లాంటివి.
(09:53) క్రియ అనే అగ్నితో వాటిని కాల్చేయాలి అని క్రియ అంటే యాక్షన్ మీరు పని చేసి ఆ భయాన్ని ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవాలి కానీ మీరు ఆ అగ్నిని రగల్చడానికి కూడా భయపడుతున్నారు. మీరు తుప్పుతోనే బతకడానికి అలవాటు పడిపోయారు. ఇంకా నిజం మాట్లాడాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. అదేంటో తెలుసా నాకు అన్ని విషయాలు తెలుసు అనే అహంకారం యూట్యూబ్ లో ఒక వీడియో చూడగానే మీరేదో జీవితాన్ని మార్చేసే పెద్ద జ్ఞాని అయిపోయినట్లు ఫీల్ అవుతారు.
(10:24) కానీ లాహరి మాజీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఆయన హిమాలయాల్లో తన గురువైన బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అప్పటికే ఎంతో లౌకిక జ్ఞానం ఉంది. కానీ బాబాజీ ఆయనకి ఏం చెప్పారో తెలుసా? నీ తలనిండ ఉన్న ఈ పుస్తకాల జ్ఞానాన్ని ఈ పాత ఆలోచనల్ని పక్కన పెట్టు అవన్నీ నీకు బద్ధకాన్ని సాకులను మాత్రమే నేర్పించాయి అని మీ సమస్య కూడా సరిగ్గా ఇదే మీ తలనిండ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది.
(10:50) కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సున్నా మీరు ఒక పనిని ప్రారంభించే ముందే దాని గురించి వందల రకాలుగా ఆలోచిస్తారు. అది వర్కవుట్ అవుతుందా అవ్వదా జనాలు ఏమనుకుంటారు నా వల్ల అవుతుందా? ఈ ఆలోచన వలయంలోనే మీ ఎనర్జీ అంతా అయిపోతుంది. పని మొదలుపెట్టేసరికి మీ దగ్గర ఓపిక ఉండదు. లాహిరి మహాసేయులు బోధించిన క్రియా యోగంలో అత్యంత కీలకమైన సూత్రం ఏంటో తెలుసా నిశ్శబ్దం ఆయన ఎప్పుడూ తన ఆధ్యాత్మిక అనుభవాలని బయటకు చెప్పుకోమని చెప్పలేదు.
(11:19) ప్రగల్భాలు పలికేవాడు ఎప్పటికీ సాధన చేయడు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒక చిన్న ఐడియా రాగానే 10 మందికి ఫోన్లు చేసి చెప్తారు నేను ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను అని చెప్పేసి సోషల్ మీడియాలో స్టేటస్ లు పెడతారు. ఆ స్టేటస్ లకు వచ్చే లైక్లు కామెంట్లు చూసి మీ మనసు మురిసిపోతూ ఉంటుంది. పని చేయకుండానే మీకు ఒక సెలబ్రిటీ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది.
(11:43) దీన్నే సైకాలజీలో మెంటల్ మాస్టర్బ్యూషన్ అంటారు. అంటే పని చేయకుండా విజయం సాధించకుండా కేవలం ఆలోచనలతోనే తృప్తి పడిపోవడం. ఇది మీ బద్ధకాన్ని 100 రెట్లు పెంచుతుంది. మీరు మీ ఆశయాలని మీ అహంకారాన్ని పోషించుకోవడానికి వాడుకుంటున్నారు కానీ మీ జీవితాన్ని మార్చుకోవడానికి కాదు. అసలు మీ బద్ధకానికి కారణం మీ చుట్టూ ఉన్న కంఫర్టే ఆ విషయం చాలా మందికి తెలియదు.
(12:07) పడుకోవడానికి ఏసీ గది చేతిలో స్మార్ట్ ఫోను ఆర్డర్ చేస్తే ఇంటికవచ్చే ఫుడ్ అన్ని సవ్యంగా ఉన్నప్పుడు మీ మెదర్ ఎందుకు కష్టపడుతుంది లహరి మాసేలు రైల్వే అకౌంట్ ఆఫీసుల్లో ఒక సాధారణ ఉద్యోగిగా పని చేసేవారు. ఆయనకి ఎన్నో కష్టాలు ఉండేవి తక్కువ జీతం పెద్ద కుటుంబం అయినా సరే ఆయన రాత్రిలో నిద్రపోకుండా గంటల తరబడి సాధన చేసేవారు.
(12:30) ఎందుకో తెలుసా ఆయనకు తెలుసు ఈ లౌకికమైన కంఫర్ట్స్ అన్ని తాత్కాలికమైనవి అని కానీ మీరు చిన్న చిన్న కంఫర్ట్ జోన్స్ ని పట్టుకొని వేలాడుతున్నారు. ఒక రోజు నెట్టు రాకపోతే పిచ్చెక్కిపోతారు. ఒక పూట తిండి లేకపోతే అల్లాడిపోతారు. ఇంత బలహీనమైన మనసును పెట్టుకొని మీరు ప్రపంచాన్ని జయిస్తామంటే నవ్వొస్తుంది నాకు బద్ధకం అనేది మీ ఒంట్లో లేదు అది మీ విలాసవంతమైన అలవాట్లలో ఉంది.
(12:54) ఆ అలవాట్లను బద్దలు కొట్టనంత కాలం మీరు సత్యం వైపు ఒక్క అడుగు కూడా వేయలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి బద్ధకం అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు. మీరు ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల నుండే అది పొడుతుంది. పొద్దున అలారం మురుగినప్పుడు మీరు దానికి నిద్ర లేవకుండా ఆ అలారాన్ని ఆఫ్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు అనవసరంగా ఫోన్ స్క్రీన్ చేయడం వరకు మీరు మీ మనసుకి లొంగిపోతూ వస్తున్నారు.
(13:22) లాహరి మహసేలు ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. నువ్వు నీ మనసును జయించకపోతే అది నిన్ను ఒక బానిస కంటే హీనంగా చూస్తుంది అని. మీరు సరిగ్గా అదే బానిసత్వంలో ఉన్నారు. మీ కళ్ళముందు జీవితం కరిగిపోతుంది. కాలం కరిగిపోతుంది. కానీ మీరు మాత్రం ఇంకా సరైన మూడు కోసం వెతుకుతున్నారు. ఈ దరిద్రపు స్థితి నుండి బయటపడటం ఎలాగో ఇప్పుడు చూద్దాము.
(13:45) ఇప్పటివరకు సమస్య ఏంటో చూసాం అది ఎందుకు వస్తుందో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలైన మందు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ బద్ధకాన్ని ఈ వాయిదా వేసే రోగాన్ని ముక్కలు ముక్కలు చేయాలంటే లహరి మహాసయులు గారు చెప్పిన క్రియాయోగం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. అదేంటంటే అదే చిన్న అడుగు మీరు ఒకే రోజులో మారిపోవాలని చెప్పేసి ప్లాన్లు వేయకండి. రేపటి నుంచి ఉదయంనాలుగు గంటలకు లేచి 10 కిలోమీటర్లు పరిగెత్తి 14న్నర గంటలు చదివేస్తాను అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పకండి.
(14:15) ఇలాంటి ప్లాన్లు ఒక్కరోజు కూడా నడవవు. లాహరి మహసేయులు తన శిష్యులకి క్రియాయోగాన్ని ఒకేసారి గంటలు గంటలు చేయమని చెప్పలేదు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మాత్రమే చేయండి. కానీ దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదలకండి అనేవాళ్ళు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రతిరోజు కేవలం ఒకే ఒక్క శాతం మెరుగుపడటం అన్నమాట. మీరు పుస్తకం చదవాలనుకుంటే రోజుకి ఒక పేజీ చదవండి.
(14:38) వ్యాయామం చేయాలనుకుంటే రోజుకి ఐదు పుషఅప్స్ తీయండి. ఆ చిన్న పనిని చూసి మీ మెదడు భయపడదు సాకులు వెతకదు. అందులోనూ మీరు కూడా ఏంటంటే మీ మనసుని మోసం చేయండి అంటే ఐదు పుషప్ లే కదా ఒక పేజీఏ కదా అని చెప్పేసి ఏదో ఒక పని చేస్తూ మీ అలవాట్లని మార్చండి. మీకు తెలుసా నిజమైన విజేతలకు అలాగే జీవితంలో ఓడిపోయిన వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఏంటో చరిత్రలో అద్భుతాలు సృష్టించిన విజేతలు కూడా మొదట్లో బద్ధకస్తులుగా ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా నీరసం వస్తూ ఉంటుంది.
(15:08) వాళ్ళకి కూడా కొన్ని రోజులు అసలు పని చేయాలనిపించదు. కానీ వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది దాని పేరే నిబద్ధత కమిట్మెంట్ [సంగీతం] అహరి మహాశయులు ఒక అద్భుతమైన సూత్రాన్ని బోధించారు నువ్వు సాధన చేస్తున్నప్పుడు నీకు శూన్యంగా అనిపించొచ్చు విసుగు రావచ్చు కానీ ఆ విసుగుని దాటి కూర్చోవడమే అసలైన తపస్సు అని మనసు చెప్పే మాటలు వినడం ఆపడమే ఆ అధిగమించే మార్గం అన్నమాట నాకు ఈరోజు చేయాలనిపించట్లేదు అని చెప్పేసి మీ మనసు అనగానే నీకు అనిపించినా అనిపించకపోయినా నాకు అనవసరం నేను ఈ పని చేసి తీరుతా అని మీరు మీ మనసుకు ఎదురు తిరగాలి.
(15:43) మీరు మీ భావోద్వేగాల కంటే మీ కర్తవ్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. మీరు ఒక పని చేయాలంటే మీ మూడుతో సంబంధం లేకుండా ఆ పని చేయాలి అనే సంకల్పం చాలా ముఖ్యం. మోటివేషన్ కోసం ఎదురు చూడకండి. మీ పని మీరు మొదలు పెడితే ఆ వేగమే మీకు ఆటోమేటిక్ గా మోటివేషన్ ఇస్తుంది. కాకపోతే చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఒకేసారి పెద్ద కొండని ఎక్కాలని చూస్తారు.
(16:08) ఆ కొండ సైజు చూసి భయపడి ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుండిపోతారు. లహరి మసేల్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడిగాడు స్వామి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది? నాకు ఎన్ని జన్మలు పడుతుంది అని ఆయన నవ్వి నువ్వు వచ్చే జన్మల గురించి ఆ తర్వాత మోక్షం గురించి ఆలోచించడం ఆపు ఈ క్షణంలో నువ్వు తీసుకునే శ్వాస మీద దృష్టి పెట్టు అన్నారు అంటే భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్లే బద్ధకం వస్తుంది.
(16:32) మీరు మీ లక్ష్యాలని చిన్న చిన్న ముక్కలుగా విరగగొట్టండి. మీరు ఒక పెద్ద బిజినెస్ పెట్టాలా ఈరోజు ఒక చిన్న కాల్ చేయండి లేదా ఒక పేజీ రీసెర్చ్ చేయండి. మీరు ఒక పెద్ద ఎగ్జామ్ రాయాలా ఈరోజు కేవలం ఒకే ఒక్క పేరాగ్రాఫ్ చదవండి. ఒక చిన్న పనిని పూర్తి చేసినప్పుడు మీ మైండ్ కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నేను ఈ చిన్న పనిని చేయగలిగాను కదా అని చెప్పేసి రేపు ఇంకో చిన్న పని చేయగలను అని మీ బ్రెయిన్ మిమ్మల్ని నమ్మడం మొదలు పెడుతుంది.
(16:57) దీన్నే క్రియాశక్తి అంటారు. దయచేసి శక్తిని మర్చిపోమాకండి. చిన్న చిన్న విజయాలే కాలక్రమేణ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాయి. పెద్ద పెద్ద ప్లాన్లు వేసి ఫెయిల్ అవ్వడం కంటే చిన్న చిన్న అడుగులు వేసి గెలవడం 100 రెట్లు మేలు. నిజం మాట్లాడుకుందాం. మీరు రోజులో ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారు రీల్స్ అని షాట్స్ అని వెబ్ సిరీస్ లని వీటన్నిటికీ మీ దగ్గర టైం ఉంటుంది.
(17:21) కానీ మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న పని చేయడానికి మాత్రం టైం ఉండదు. లాహరి మాసేయులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. బాహ్య ప్రపంచంలోని ఆకర్షణలు నీ శక్తిని లాగేస్తాయి. అంతర్గత సాధన నీకు శక్తిని ఇస్తుంది అని. మీరు మీ ఫోన్ ని ఒక గంట పక్కన పెట్టలేరా? మిమ్మల్ని మీ జీవిత లక్ష్యానికి దూరం చేసే అలవాట్లను కొన్ని రోజులు మీరు అది కూడా జీవితంలో సక్సెస్ అయ్యేంత వరకు పక్కన పెట్టలేరా ఒకవేళ మీరు సక్సెస్ అయిన తర్వాత ఆ అలవాట్లు మీ జీవితంలోకి మళ్ళీ రావనుకోండి అది వేరే విషయం కానీ చాలా మంది ఏంటంటే ఈ పనులు ఏవి చేయరు కానీ సక్సెస్ మాత్రం కావాలి అలా అయితే ఎలా వస్తుంది బద్ధకాన్ని జయించాలంటే
(17:56) మొదట మీ చుట్టూ ఉన్న చెత్తను క్లీన్ చేయాలి మీ కళ్ళ ముందున్న ఆ అనవసరమైన ఆకర్షణాలను తొలగించాలి మీ గదిని ప్రశాంతంగా ఉంచుకోండి మీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టండి ండి ఏకాగ్రతతో రోజుకి కనీసం అరగంట అయినా నిశశబ్దంగా పని చేయడం నేర్చుకోండి. ఆ అరగంట మీ జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో మీరే చూస్తారు. కానీ ఆ అరగంట క్రమశిక్షణ పాటించే దమ్ము మీకు నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే మాత్రం ఉందని కామెంట్ చేయండి.
(18:23) లాహరి మాసేలు క్రియాయోగంలో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. నువ్వు చేసే పనిని ఒక పూజలా చేయి అని మీరు చదువుతున్నారా ఉద్యోగం చేస్తున్నారా లేదా ఇల్లు క్లీన్ చేస్తున్నారా ఏదైనా సరే ఆ పని చేస్తున్నప్పుడు మీ మైండ్ మొత్తం అక్కడే ఉండాలి. వేరే పని చేస్తూ వేరే విషయాలు ఆలోచిస్తే అది మల్టీ టాస్కింగ్ అని చెప్పేసి మీకు మీరు పేరు పెట్టుకోవచ్చేమో కానీ ఆ పని మాత్రం మీరు సరిగా చేయలేరు.
(18:48) ఎందుకంటే మీరు వేరే విషయం గురించి ఆలోచిస్తూ ఈ పనిని పరిపూర్ణంగా చేయలేరు. అది వాస్తవం. మీరు చేసే ప్రతి చిన్న పనిని ఎంతో శ్రద్ధతో నిబద్ధంగా చేయడం అలవాటు చేసుకోండి. పక్కనఉన్నవాడు మిమ్మల్ని చూసి వీడేంటి ఎంత పిచ్చోడిలా పని చేస్తున్నాడు అనుకోవాలి. ఇలాంటి అంకిత భావం ఉన్నప్పుడే బద్ధకం మీ దరి చేరడానికి భయపడుతుంది.
(19:09) క్రియేటివిటీ అనేది కూర్చుంటే రాదు. కష్టపడి పనిలోకి దూకితే వస్తుంది. మీరు మీ మనసుకు యజమాని అవ్వాలా లేకపోతే బానిసలా మిగిలిపోతారా అనేది మీ నిర్ణయం. ఆ నిర్ణయం కూడా మీ చేతుల్లోనే ఉంది. సరే ఇప్పటివరకు అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. లాహిరీ మహాశయుల తత్వం ప్రకారం నిజమైన యోగి అంటే అడవుల్లోకి పారిపోయేవాడు కాదు సమాజంలో ఉంటూ బాధ్యతలు మోస్తూ తన లోపలి క్రమ శిక్షణను కాపాడుకునేవాడే అసలైన వీరుడు.
(19:40) మీరు కూడా ఒక మోడరన్ సమురాయిలా బ్రతకాలి. దానికి మీరు చేయాల్సిన మొదటి పని మీ మార్నింగ్ రొటీన్ మార్చుకోవాలి. ఉదయం లేవగానే ఫోన్ పట్టుకొని బెడ్ పైనే గంటలు గంటలు టైం వేస్ట్ చేయకండి. ఆ మొదటి గంట మీ మైండ్ ని డిస్ట్రాక్ట్ చేస్తే ఈ రోజంతా బద్ధకంగానే సాగుతుంది. ఉదయాన్నే లేచి సైలెంట్ గా కూర్చోండి ఈ రోజుని ప్లాన్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు అందులోనూ ఈ పని చేయకపోతే ఆ తర్వాత పని ఆగిపోతుంది అనే ఒక భయం మీలో మొదలవుతుంది.
(20:09) కాబట్టి ఈ పనిని పూర్తి చేయడానికి మీకు ఒక చిన్న మోటివేషన్ దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఈరోజు నేను నా లక్ష్యం వైపు ఒక్క అడుగైనా వేశనా లేకపోతే నా బద్ధకానికి లొంగిపోయానా అని ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ లేకపోతే మీరు ఎప్పటికీ మారలేరు. మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఏ దేవుడు వచ్చి మీ పనులు చేయడు.
(20:31) మీ జీవితానికి 100% బాధ్యత మీరే. ఈ నిజాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే మీ లైఫ్ అంత త్వరగా ట్రాక్ లోకి వస్తుంది. రిస్క్ లేకపోతే లైఫ్ లేదు. కష్టపడకుండా కంఫర్ట్ జోన్ లో కూర్చుంటే చచ్చిన సెవంతో సమానం. నువ్వు బతికున్నప్పుడే నీలోని బద్ధకాన్ని అజ్ఞానాన్ని చంపేయాలి. లేకపోతే అవి నిన్ను బతికుండంగానే శవంగా మార్చేస్తాయి. మీరు మారడానికి ఏ గురువో ఏ వీడియోనో అవసరం లేదు.
(20:58) మీ లోపల ఉన్న ఆ చిన్న నిశశబ్ద సత్యాన్ని పట్టుకుంటే చాలు. చివరిగా ఒక మాట మనం ముసలి వాళ్ళం అయిపోయి చనిపోయిన తర్వాత మన గురించి నలుగురు ఏమనుకోవాలో మనం ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. పాపం ఈయన జీవితంలో ఎన్నో సాధిద్దాం అనుకున్నాడండి కానీ ఏమి సాధించకుండానే చనిపోయాడు అని చెప్పేసి అనుకోవాలా లేకపోతే వీడు మామూలోడుఅని కాదండి బాబోయ్ వీడు ఎంత మొండోడు అంటే వీడు జీవితంలో అనుకున్నవన్నీ సాధించాడు అని అనుకోవాలా ఛాయిస్ మీదే ఈ వీడియో గనుక మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం కచ్చితంగా సత్యాగ్రహి అని చెప్పేసి కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ
(21:32) సభ్యులకు షేర్ చేయండి బాయ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment