Thursday, June 11, 2026

🚨 The Carb Trap: Why 80% of Indians are Silently Starving | UnfoldwithPK.Telugu

🚨 The Carb Trap: Why 80% of Indians are Silently Starving | UnfoldwithPK.Telugu

Author Name:UnfoldwithPK.Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@UnfoldwithPK_Telugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-0ifDPGDZz4



Transcript:
(00:00) మన ఇండియాలో ఉన్నటువంటి ఒక చేదు నిజం ఏంటంటే మన దేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఈ మక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ అనేది దాదాపు 80% మందిలో ఉంది. మన శరీరంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ని స్టోర్ చేసుకోగలం కానీ ఈ ప్రోటీన్ సంగతి ఏంటి ఈ ప్రోటీన్ మన శరీరంలో నిల్వ ఉండే అవకాశం అస్సలు లేదు. అందుకోసమే ఈ ప్రోటీన్ ప్రతిరోజు ప్రతి పూట మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
(00:26) మేము బాగానే తింటున్నామ అని మీరు అనుకోవచ్చు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మీరు తింటున్నటువంటి ఈ అన్నం పప్పు కూరగాయలు మీ కడుపు నింపుతున్నాయి కానీ మీ కండరాలు మాత్రం కాదు. ఈ వీడియోలో మన శరీరానికి ప్రోటీన్ ఎందుకు అంత అవసరం మనం ఎంత తినాలి? మన దేశంలో ఉన్నటువంటి ఈ దాల్ డామినెన్స్ ఏంటి? సామాన్యులు అతి తక్కువ ఖర్చుతో ప్రోటీన్ తినడం ఎక్కువగా ఎలా పెంచుకోవచ్చు అలాగే ఈ రాబోయే 10 ఏళ్లలో మన దేశంలో రాబోతున్నటువంటి ఈ ప్రోటీన్ ఎకానమీ విలువ ఎంత ఇవన్నీ డేటా ఆధారంగా ఈ వీడియోలో తెలుసుకుందాం.
(01:02) ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చిన్న చిన్న చేంజెస్ ద్వారా మన హెల్త్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పికే. ప్రోటీన్ అనేది మన శరీరానికి అవసరమైనటువంటి ఒక బయోలాజికల్ ఇంపరేటివ్ అంటే ఇది లేకుండా శరీరం తనను తాను ఇది నిర్మించుకోలేందు. మన కండరాలు, ఎంజైమ్స్, చర్మం, ఈ యాంటీబాడీస్ అన్నీ ఈ ప్రోటీన్ల ద్వారానే తయారవుతాయి.
(01:33) ఇక ప్రోటీన్ యొక్క మూడు ముఖ్యమైన విధులు గురించి మాట్లాడుకుంటే ఇందులో మొదటిది స్ట్రక్చరల్ గ్రోత్. కణజాలాలు అలాగే కండరాల మరమత్తుకి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఇక రెండవది ఆకలి నియంత్రణ గ్రిలిన్ అనే ఒక హార్మోన్ని ని తగ్గించి మన కడుపు నిండుగా ఉండే విధంగా చూస్తుంది. తద్వారా మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాం. ఇక మూడవది ఇమ్యూన్ డిఫెన్స్ వైరస్లు బ్యాక్టీరియాలతో పోరాడే ఈ యాంటీబాడీస్ పూర్తిగా ప్రోటీన్లతోనే నిర్మించబడతాయి.
(02:01) ఇక ప్రోటీన్ అవసరాల గురించి మాట్లాడుకుంటే ఈ ప్రోటీన్ విషయంలో అందరికీ ఒకే కొలత వర్తించదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి పాత లెక్కల ప్రకారం మన శరీరానికి ఒక కిలో బరువులో 0.8 gల ప్రోటీన్ అవసరం ఉంటుంది. కానీ మన ఇండియన్స్ బాడీ టైప్ ను బట్టి అలాగే దేశ పరిస్థితులను బట్టి ఐసిఎంఆర్ఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2020 లో ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మనకు 0.
(02:31) 83గల ప్రోటీన్ అవసరం. అంటే 1 కిలో బరువుకి 0.83గల ప్రోటీన్ అవసరం ఉంది. ఉదాహరణకు ఒక సగటు మేల్ బరువు 65 కిలోలు అనుకోండి వాళ్ళకి రోజుకి కనీసం 54 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉదాహరణకి ఒక స్త్రీ బరువు 55 కిలోగ్రమ అనుకోండి వారికి 46గల ప్రోటీన్ అవసరం అంటే రోజుకి ఇక గర్భిణి స్త్రీలు అంటే 17 గ్రాములు ఎక్స్ట్రాగా తీసుకోవాలి.
(02:57) అలాగే ఎదుగుతున్న పిల్లల్లో కూడా కనీసం ఇంతే రేషియోలో వాళ్ళ బరువుకు తగ్గట్టుగా ప్రోటీన్ అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రోజుకి 50 గ్రాముల ప్రోటీన్ తిన్నంత మాత్రాన మన బాడీ దాన్ని కంప్లీట్ గా అబ్జర్బ్ చేసుకోలేదు. అందుకోసమే మన ప్రోటీన్ క్వాలిటీ అండ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్.
(03:18) మన భారతదేశంలో దాదాపు 93% మందికి ఈ ప్రోటీన్ అనేది మనక ఎంత అవసరమో కనీస అవగాహన కూడా లేదు. యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2013 లోడిఐడబల్ఏఎస్ అంటే డైజెస్టబుల్ ఇండిస్పెన్సిబుల్ అమినో యసిడ్ స్కోర్ అనే ఒక గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా చెప్పాలంటే మొక్కల ద్వారా వచ్చే ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్ ప్రోటీన్ కన్నా జంతువుల ద్వారా వచ్చే ప్రోటీన్ అంటే గుడ్లు పాలు అలాగే అదర్ డైరీ ప్రొడక్ట్స్ ఇంకా మాంసం వీటిని మన పేగుల్లో 100% అబ్సర్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఈ
(03:58) ప్లాంట్ బేస్ ప్రోటీన్స్ లో కొన్ని ఎసెన్షియల్ అమినో యసిడ్స్ మిస్ అవుతాయి. శాఖహారుల్లో దీన్ని ఎలా బాలెన్స్ చేసుకోవాలో ఈ వీడియో చివర్లో చెప్తాను. మన దేశంలో కేవలం 1.7% మంది మాత్రమే ఈ ప్రోటీన్ మీద సరైన అవగాహనతో అన్ని రకాల వనరుల్ని వాడుకోగలుగుతున్నారు. మిగిలిన వారంతా తీవ్రమైనటువంటి ప్రోటీన్ లోపంలో ఉన్నారు.
(04:22) దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిన ప్రోటీన్ లోపం మాత్రం అలాగే ఉంది. దీనికి ప్రధాన కారణం సీరియల్ లాకిన్. మన రేషన్ వ్యవస్థ ద్వారా మనం రైస్ అలాగే గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీని వల్ల కడుపు నిండుతుంది కానీ మన శరీరానికి అవసరమైనటువంటి లైసిన్ అనే ఒక ఎసెన్షియల్ అమినో యసిడ్ అందడం లేదు. ఇక పప్పుల భ్రమ మీరు నమ్ముతారా 83% మంది పప్పు ద్వారా ప్రోటీన్ అందుతుందని భావిస్తారు.
(04:48) కానీ నిజం ఏంటంటే ఒక కప్పు కందిపప్పులో 7 నుంచి 9 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అందుతుంది. మన శరీరానికి కావల్సినటువంటి 60గ్రమల ప్రోటీన్ ని ఈ పప్పుల ద్వారా తీసుకోవడం అనేది దాదాపు కుదరని పని. ప్రభుత్వం ఈ లోపాన్ని సరి చేయడానికి పోషణ అభియాన్ ద్వారా కోట్లాది మంది పిల్లల న్యూట్రిషన్ ని ట్రాక్ చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు కనీసం 12గ్రమల ప్రోటీన్ అలాగే ఉన్నత పాఠశాలలోని పిల్లలకు 20గ్రమల ప్రోటీన్ ని మధ్యాహ్నం భోజనంలో అందించాలి.
(05:23) కానీ ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది. సైన్స్ ప్రకారం కోడి గుడ్లు అనేవి ఒక ముఖ్యమైన అలాగే చౌకైనటువంటి ప్రోటీన్ సోర్స్ ఒక గుడ్డులో అన్ని రకాల అంటే తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమినో యసిడ్స్ ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన అలాగే రాజకీయ కారణాల వల్ల ఈ మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
(05:46) దీని మీద చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. మనం ఈ న్యూట్రిషన్ ని సైన్స్ లా చూడాలా లేదా కల్చర్ లా చూడాలా అనేది మీరే కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మార్కెట్ లో ఏది పడితే అది హై ప్రోటీన్ అని అమ్మేస్తున్నారు. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ కఠినమైనటువంటి రూల్స్ తీసుకొచ్చింది. సాలిడ్ ఫుడ్స్ లో 100గ్రాములో కనీసం 12గ్రామ ప్రోటీన్ సోర్స్ ఉంటేనే దాని మీద హై ప్రోటీన్ అని రాయాలి.
(06:11) సో నెక్స్ట్ టైం ఏదైనా ప్రాడక్ట్ కొనే ముందు ఖచ్చితంగా లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే మన దేశంలో శాకాహారం ఎక్కువ. ఈ శాఖహారంలో తక్కువ ఖర్చుతో మన ప్రోటీన్ ఎలా పెంచుకోవాలో ఒకసారి చూద్దాం. ధాన్యాలు పప్పులు అలాగే పాల ఉత్పత్తులు అంటే పాలు, చీజ్ పెరుగు లాంటివి కలిపి తీసుకున్నామంటే అంటే 3:1:2.1 రేషియోలో తీసుకోగలిగామంటే మన బాడీకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ అమినో యసిడ్స్ అన్నీ అందుతాయి.
(06:40) తద్వారా మనకు కంప్లీట్ ప్రోటీన్ అందుతుంది. అలాగే మొలకెత్తినటువంటి గింజల్లో యాంటీ న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటాయి. తద్వారా మన శరీరానికి కావలసినటువంటి మంచి ప్రోటీన్ వీటిలో దొరుకుతుంది. ఇక మూడవది బడ్జెట్ ప్రోటీన్ అయినటువంటి సోయా చంగ్స్ ఇది చౌకైనటువంటి అపెక్స్ ప్రోటీన్ ఒక 100గ్రమల సోయా చెంగ్స్ లో దాదాపు 52 gల ప్రోటీన్ మనకు అందుతుంది.
(07:03) ఇక పని ఒత్తడి వల్ల ఇంట్లో మనం సరిగా మీల్ ప్రిపేర్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ ప్రోటీన్ ఆల్టర్నేట్ గా వే ప్రోటీన్ ని తీసుకోవడం మంచిది. ఈ వే ప్రోటీన్ అందరూ తీసుకోవచ్చు కేవలం జిమ్ కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు. ప్రస్తుతం మన దేశంలో చాలా డైరీలు అంటే అమూల్ హెరిటేజ్ లాంటి డైరీలు ఈ హై ప్రోటీన్ మిల్క్ షేక్స్ లస్సీ అలాగే పన్నీర్ లాంటివి చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాయి.
(07:27) మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంటే 2025 లో ఈ ప్రోటీన్ ఎకానమీ విలువ బిలియన్ డాలర్స్ కానీ రాబోయే 10 ఏళ్లలో అంటే 2035 నాటికి ఇది 2.71 71 బిలియన్ డాలర్లుగా పెరుగుతుందని అంచన వేస్తున్నారు. అంటే దాదాపు 22వ000 కోట్లకు పైగా ఈ రంగంలో వృద్ధి రేటు 6 నుండి 17% సిఏజిఆర్ తో వేగంగా పెరుగుతోంది. అలాగే క్లినికల్ న్యూట్రిషన్ వాయిస్ పెరిగిన వాళ్లో ఈ ఖండరాల క్షీణత నియంత్రించడానికి ప్రత్యేకమైనటువంటి ఈ ప్రోటీన్ ఫుడ్ సోర్సెస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది.
(08:00) అంతేకాక ఈ డైరీ వే ప్రోటీన్ కి ఆల్టర్నేట్ గా వేగన్ బేస్ ప్రోటీన్స్ అంటే పి ప్రోటీన్ సోయా బేస్డ్ ప్రోటీన్స్ కి డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. సో ప్రోటీన్ అనేది కేవలం మసిల్స్ పెంచడానికి మాత్రమే కాదు. ఇది మన శరీరానికి అవసరమైనటువంటి ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్. సో ప్రతిరోజు ప్రతి పూట మీ ప్లేట్ లో ప్రోటీన్ ఉందో లేదో చూసుకోండి.
(08:25) ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యబుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టు ఈ న్యూట్రిషన్ ని సైన్స్ లా చూడాలా లేదా కల్చర్ తో చూడాలా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
(08:48) మరొక సాలిడ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్. ఓం

No comments:

Post a Comment