పెద్ది మూవీ - యువత చెడిపోదా ? Srikanth Sharma Warning On Peddi Movie Controvesry
Author Name:Hindu Dharma Chakram - హిందూ ధర్మచక్రం
Youtube Channel Url:https://www.youtube.com/@HinduDharmaChakram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tpZV68ZjrlI
Transcript:
(00:04) [సంగీతం] శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్ కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసం ఆధ్యాత్మిక సమాచారం కోసం దేశం కోసం ధర్మం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి.
(00:34) మీ అభిప్రాయం ఎటువంటిదైనా సరే కామెంట్ చేయండి. పెద్ది సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. రామచరణ్ హీరోగా నటించినటువంటి సినిమా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. సినిమా గురించి నేను పెద్ద రివ్యూ ఇవ్వడం కోసం ఈ వీడియో ఏమి చేయడం లేదు. సినిమా ఎలా ఉంది అంటే గనుక సినిమా మంచి సినిమా యువతకు ఒక విధమైనటువంటి యువతకు మంచి సందేశాన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి సినిమా మోరల్స్ ఎథిక్స్ విషయం మాట్లాడుకుంటే అవి కాస్త ఈ దర్శకుడు పట్టించుకోలేడు అని చెప్పాలి.
(01:11) ఎవరైనా సరే తను పుట్టినటువంటి నేలకు కట్టుబడి ఉండాలి తన ఊరికి ఒక విలువను ఇవ్వాలి అనేటువంటి విధంగా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఏ ఊర్లో అయితే పుట్టాడో ఆ ఊరికి ఆ ఒక గుర్తింపు లేదు ప్రభుత్వంలో అలా గుర్తింపు లేనటువంటి ఆ ఊరిని ప్రభుత్వం దృష్టిలో గుర్తింపు తీసుకోరాడం కోసము హీరో చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి సినిమా ఇందులో రామచరణ్ గారు అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు చాలా కష్టపడ్డారు అద్భుతంగా నటించారు.
(01:49) రామచరణ్ గారి గురించి మైనస్ మార్కులు వేయడానికి ఏమీ లేవు అంత అద్భుతంగా చేశాడు నిజంగా రామచరణ్ గారి కెరీర్ లో నిలిచిపోయేటువంటి సినిమా హీరోయిన్ జానవీ కపూర్ను అనవసరంగా తీసుకొని వచ్చి పెట్టారు ఇందులో ఆమె పెద్ద పాత్ర ఏమీ లేదు అంగాంగ ప్రదర్శన చేయడం తప్ప ఏమీ లేదు. డైరెక్టర్ బుజ్జిబాబు అనుకున్నదానికి 90% మంచి న్యాయాన్ని చేశాడు.
(02:14) కానీ కొన్ని మోరల్స్ ఎథిక్స్ అనేటువంటి విషయంలో మాత్రము సరిగ్గా పట్టించుకోలేకపోయాడు. హీరోయిన్ని కేవలం అంగా ప్రదర్శన చేయించడానికి పెట్టడం ఒకటే అయితే గనుక హీరో క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లోకి వస్తే ఎవరైనా ఒక ప్లేయర్ గ్రౌండ్ లోకి రావడము లేదా బ్యాట్ పట్టుకొని పిచ్ లో ఉంటే బీడి తాగుకుంటూ గ్రౌండ్ లోకి రావడము బీడి తాగుకుంటూ ఆ పిచ్ లో బ్యాటింగ్ చేయడం అనేటువంటిది చేస్తారా ఎవరైనా హీరోని బాగా ఎలివేట్ చేయడం కోసం ఇది డైరెక్టర్ చేసినటువంటి పొరపాటు ఇందులో హీరో తప్పు లేదు డైరెక్టర్ తప్పు అయితే ఈ విషయంలో మీరు థం్నెల్ లో చూశారు కదా యువత చడిపోదా అనడానికి అలా తంబ్నెయిల్
(02:53) పెట్టడానికి కారణం ఆ విషయానికి వద్దాం. ఇందులో హీరో ఒక ట్రైబల్ నుంచి వచ్చినటువంటి వాడు ఒక గిరిజన తెగకు చెందినటువంటి వాడు. హీరోయిన్ ఒక గ్రామంలో కాస్త సంపన్న కుటుంబంలో రాజకీయంగా ఉన్నటువంటి హీరోయిన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని హీరో చూసిన తర్వాత ఆ అమ్మాయి అందానికి ముగ్దుడైనటువంటి హీరో ఒక మాట అంటాడు.
(03:19) పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి సత్యతో ఒక మాట అంటాడు. అమ్మాయిని ప్రేమిస్తా అంటే అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకుంటాను అంటే తండ్రి ఒప్పుకోడు కనుక మళ్ళీ పుట్టేది ఉందా ఏమైనా కనుక ఇప్పుడే ఈ జన్మ ఉన్నప్పుడే ఈ అమ్మాయిని ఏమన్నా చేయాలి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ అమ్మాయికి హీరోయిన్ కి ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు హీరో ఇది హీరో క్యారెక్టర్ ను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి సన్నివేశం ఇది.
(03:48) ముమ్మాటికి ఇది తప్పు అయితే ఇప్పుడు మీకు ఒక సన్నివేశాన్ని చూపిస్తాను కొంత కొంత నిడివి తర్వాత హీరోయిన్ మళ్ళీ హీరోతో మాట్లాడేటువంటి ఒక సన్నివేశాన్ని ఇప్పుడు చూడండి. ఆడితే నాకు ఇస్తాడు కదా గుర్తుపెట్టకూడదు తెలియనా ఒకడు ప్రేమాతానని భూమిచేసి చెప్తాడు ఒకడు పొద్దు మాసి చెప్తాడు ఒకడు బోమ చెప్తాడు. పెద్దికాడికి మాత్రం పొద్దుకుంటాడని ప్రేమ నీలాగే చెప్తాడు.
(04:30) కొండ మీద పోయి ప్రేమ ఇంతే నాకు తెలిసిన ప్రేమ ఇదే చూసారు కదా హీరోయిన్ లాగిపెట్టి చెంప మీద ఒకడు కట్టి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటావా అని అడిగితే అందులో హీరో చెప్పినటువంటి మాటలు ఒకడు పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తాడు ఇంకోడు మాటలు చెప్పి వ్యక్తం చేస్తాడు కానీ ఈ పెద్దిగాడుకి ముట్టుకుంటూనే ప్రేమను వ్యక్తం చేసినట్టు ఇది మీరు గమనించాలి.
(04:58) దీని కారణంగా ఇది యువతకు ఎలాంటి రాంగ్ డైరెక్షన్ లో సందేశం పెడుతుంది ఇప్పుడు సెలబ్రిటీలు ఏవి చేస్తే దాన్ని అనుసరించేటువంటి వాళ్ళ ఫ్యాన్స్ అధికంగా ఉంటారు. ఇప్పటికే సెలబ్రిటీల పిచ్చితో తల్లి తండ్రుల యొక్క ప్రేమను పట్టించుకోరు. సెలబ్రిటీలను చూడడానికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
(05:22) ఇలా సెలబ్రిటీలు ఏది చేస్తే ఇప్పుడు ఆ పుష్ప సినిమా వచ్చినప్పుడు ఎంతమంది అండి పుష్ప గెటప్పులు వేసుకొని తిరగలేదు పుష్ప లాగా నడవలేదు అట్లా ఇప్పుడు ఈ పెద్ది ఇచ్చినటువంటి ఈ సందేశం ప్రేమను ముట్టుకొని ముద్దు పెట్టుకొనే చెప్తాను నేను నాకు అట్లాగే తెలుసు అని అంటే అనే సందేశం యువతకి ఇస్తే గనుక రేపటి నుంచి ఇప్పటికే సమాజంలో ఎంతమంది పోకిరీలు అమ్మాయిలకు ఇష్టం లేకుండా చేస్తున్నారు.
(05:47) అట్లాంటిది ఇప్పుడు నా అభిమాన హీరో ఇట్లా చెప్పాడు నా అభిమాన హీరో నాకు ముట్టుకుంటేనే ప్రేమ అన్నట్టు చెప్పాడు కనుక నా ప్రేమ నా అభిమాన హీరో లాంటిదే ముట్టుకొని ముద్దు పెట్టుకోవడమే ప్రేమ అని వాళ్ళు దిగజారిపోరా ఇది రాంగ్ వేలో వెళ్ళదా యువతకు సందేశం పైగా ఇందులో ఏమంటాడు అంటే ఒకడు పువిచ్చి చెప్తాడు ఇంకొకడు మాటలు చెప్పి చెప్తాడు ఈ పెద్దిగాడికి మాత్రము ముట్టుకొని మాత్రమే ప్రేమను వ్యక్తం చేయడం తెలుసు అని ఇక్కడ అంటాడు.
(06:15) అంతకుముందు ఈ సీన్ కంటే ముందు ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రము ప్రేమిస్తున్నాను అంటే ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా పెళ్లి చేసుకుంటాను అంటే తండ్రి ఒప్పుకుంటాడా కనుక అంటాడు ప్రేమ ఒప్పుకోరు పెళ్లి ఒప్పుకోరు గనుక నేను ఈమె జీవితం నాశనం చేస్తా అని అక్కడ చెప్తాడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఈ డైలాగ్ చెప్తాడు హీరో క్యారెక్టర్ ను ఇది పూర్తిగా దిగజార్చేటువంటి విధానం సరే హీరో క్యారెక్టర్ ఏమన్నా గాని అక్క సినిమాలు కానీ యువతకు మాత్రం ఇది చెడువ్వలో ఇది సందేశం వెళ్తుంది.
(06:47) ఒక సందర్భంగా హీరోయిన్ ని డైరెక్టర్ చూపించేటప్పుడు హీరో మొదటిసారి చూసేటప్పుడు ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అన్నప్పుడు కళ్ళను చూపెట్టాలి కదా నడుమును చూపిస్తాడు. ఆ కంఠం ఎంత అందంగా ఉంది అనిఅంటే మరి కంఠం చూపెట్టాలి కదా అమ్మాయి భక్షోజాలు చూపిస్తారు. డైరెక్టర్ చేసినటువంటివి అంటే కేవలం అంగాంగ ప్రదర్శన అంతే ఎంత దుర్మార్గంగా ఈ మెసేజ్ ఇస్తున్నాడు అనేటువంటిది మనము ఆలోచించుకోవాలి ఇప్పటికే అసలు వాస్తవానికి ఒకవైపు సుప్రీం కోర్టులో వ్యభిచారం తప్పులేదని అంటారు.
(07:22) 18 నిండితే 18 ఏళ్ళు ఉండితే వాళ్ళ ఇష్టం అని అంటారు. అక్రమ సంబంధాలు తప్పు లేవు అని అంటారు. ఇట్లా పాశ్చాత్య సంస్కృతిని ఇప్పుడు మన దేశం మీద ఈ విధంగా ఒకవైపు ఈ సుప్రీం కోర్టు లాంటివి ఆ మద్దతు తెలుపుతూ ఉంటే ఇలాంటి సన్నివేశాలు ఇంకా దిగజారేటువంటి విధంగా తయారు చేయవా మన దేశము సంస్కృతికి సంప్రదాయానికి విలువలకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దేశం ఇతర దేశాలు మన దేశాన్ని కీర్తిస్తున్నాయి అంటే మన దేశము మోరల్ వాల్యూస్ తో కూడినటువంటి దేశము.
(07:57) మన దేశము సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం ఇచ్చేటువంటి దేశంగా ఇతర దేశాలు గౌరవిస్తాయి. ఈ దేశంలో పుట్టినటువంటి వారు ఒక్కసారి పెళ్లి చేసుకుంటారు చచ్చేంతవరకు కలిసి ఉంటారు అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి నాగరికత. ఇట్లాంటిది విదేశీ నాగరికతను చూసి విదేశీ సంస్కృతి ఇప్పటికీ షుగర్ డాడీ కల్చర్ పెరిగిపోతుంది. షుగర్ మమ్మీ కల్చర్ పెరిగిపోతుంది.
(08:21) ఇట్లాంటి దిక్కుమారిన విదేశీ సంస్కృతులు విదేశీ నాగరికత మన దేశం మీద ఒకవైపు దాడి చేస్తూ ఉంటే సెలబ్రిటీలు యువతకు సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సినిమాలు చాలా ప్రభావం చూపిస్తాయి యువత మీద అట్లాంటిది ఒక సన్నివేశము చాలా అమ్మాయి అబ్బాయి ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ అంటేనే చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి నచ్చకపోతే అమ్మాయి నేను నన్ను నేను ప్రేమిస్తే కూడా నువ్వు నన్ను ప్రేమించవ అని చెప్పేసి యసిడ్ దాడులు కత్తితోటి పొడవరాలు చంపేయడాలు లాంటివి చూస్తున్నాము.
(08:51) మరి ఇలాంటి తరుణంలో ఈ ఈ సందేశం ఏ విధంగా వెతుకుతుందో ఆలోచించండి. విదేశీ నాగరికత విదేశీ సంస్కృతి ఒకవైపు మన దేశ సంస్కృతి పైన దాడి చేస్తున్నాయి. ఇలాంటి సన్నివేశాలు ఇంకఎక్కువగా గురిచేస్తాయి. మనం కచ్చితంగా ప్రశ్నించాలి. మీరు ఈ వీడియో ఎందుకు చేశారు అని మీరు నన్ను అనకండి. ఈ వీడియో ద్వారా మనం గమనించాలి. ఇట్లాంటి సంస్కృతి మన దేశానికి ప్రమాదకరమైనటువంటిది ఈ దేశము ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకమైనటువంటిది మన దేశము ప్రేమ అన్నా గాని మన దేశం సంస్కృతి అన్నా గాని నాగరికత అన్నా గాని ఇట్లాంటి వాటికి మన దేశము చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటిది అలాంటి భారతదేశము సనాతన
(09:31) ధర్మం సంబంధించినటువంటి దేశము ఇది హిందూ మెజారిటీ కలిగినటువంటి దేశము ఇలాంటి దేశంలో ఇవి చాలా ప్రమాదకరములైనటువంటివి గనుక కచ్చితంగా ప్రశ్నించాలి వ్యతిరేకించాలి ఈ సినిమా పైన డైరెక్టర్ పైన ఖచ్చితంగా ఈ సన్నివేశం గురించి ఒత్తిడి తీసుకురావాలి ఈ సన్నివేశాన్ని తొందరలో ఖచ్చితంగా ఈ సన్నివేశాన్ని తీసేయాలి అందరూ డిమాండ్ చేయాలి అప్పుడు కచ్చితంగా ఈ సన్నివేశం అనేటువంటిది సినిమాల్లో డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.
(09:59) వెంటనే ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లోకి వచ్చేస్తాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత టీవీలో కూడా ఈ సినిమాలు వచ్చేస్తాయి అలాంటి సందర్భంలో సినిమా సినిమా టీవీలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కూర్చొని ఏ విధంగా చూడగలుగుతారు యుక్త వయసులో ఉన్నటువంటి యువతీ యువకులు తల్లిదండ్రుల మధ్య కూర్చొని ఇలా చూడగలుగుతారు. [గురకలు] కనుక ఇది ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం కనుక స్పందించండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో వర్తి అనిపిస్తే కనుక లైక్ చేయండి కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా సినిమా ఇప్పుడు నేను చెప్పిన అంశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయకండి దేశాన్ని
(10:35) కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందేమాతరం నమస్కారం
No comments:
Post a Comment